బిగ్‌బాస్ షోకి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి ఏడాది ఎప్పుడెప్పుడు బిగ్‌బాస్ ప్రారంభమవుతుందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు అభిమానులు. కానీ ఆరో సీజన్ పుణ్యమా అని మెచ్చినవాళ్లే మండిపడ్డారు. చెత్త కంటెస్టెంట్లు, చెత్త సీజన్ అని ఈసారి బిగ్‌బాస్ షోను ఏకిపారేశారు. మొదట్లో బాగానే ఉండేది కానీ రానురానూ మరీ దారుణంగా తయారవుతుందని పెదవి విరిచారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మొదటి సీజన్ కంటెస్టెంట్ సమీర్. 'మా సీజన్‌లో చాలా బాగా ఉండేది. కానీ ఈసారి స్క్రిప్టెడ్ అయిందేమోనని అందరూ డౌట్ పడుతున్నారు. అయితే మా సీజన్‌లో సంపూర్ణేశ్ బాబు స్వతాహాగా ఎలిమినేషన్‌కు సిద్ధపడటాన్ని కూడా కొందరు స్క్రిప్ట్ అనుకున్నారు, కానీ అసలు నిజమేంటంటే.. అతడు పల్లెటూరి వ్యక్తి, పల్లెటూరి వాతావరణాన్ని అతడు బాగా ఇష్టపడతాడు. ఇప్పటికీ షూటింగ్ అయిపోగానే సిటీలో ఉండలేక తిరిగి సిద్దిపేటకు వెళ్లిపోతాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక మహల్ లాంటి బిగ్‌బాస్ హౌస్‌లో పడేశారు. ఒక వారం ఉన్నాడు, కానీ తనవల్ల కాలేదు.
గదిలో బంధించినట్లుగా ఫీలయ్యాడు. మైండ్ డిస్టర్బ్ అయింది, ఆ క్షోభ భరించలేక నిజంగా ఏడ్చాడు. అప్పుడు నేనక్కడే ఉన్నాను. గేట్లు ఓపెన్ చేయండి, వెళ్లిపోతా.. లేదంటే గేట్లు పగలగొట్టుకుని వెళ్లిపోతానన్నాడు. కానీ బిగ్‌బాస్‌లో అగ్రిమెంట్లు ఉంటాయి. ఎలిమినేషన్ ద్వారా వెళ్లిపోతే ఓకే కానీ తనంతట తానుగా వెళ్లాలంటే తిరిగి రూ.25 లక్షలు కట్టాలి. డబ్బులు కట్టడానికైనా సరే కానీ ఉండనని ఏడుస్తూనే ఉన్నాడు. సరిగా తిండి కూడా తినలేదు. సంపూ పరిస్థితి చూసి తారక్ బిగ్‌బాస్ టీమ్‌తో మాట్లాడాడు. పాతిక లక్షలు కట్టకుండానే అతడిని హౌస్ నుంచి పంపించేశాడు. ఇప్పుడంటే సిటీ మధ్యలోనే బిగ్‌బాస్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ, మాది మహారాష్ట్ర లోనావాలాలోని అడవిలో సెట్ వేశారు' అని చెప్పుకొచ్చాడు సమీర్.
చదవండి: ఏమున్నాడ్రా బాబూ, హృతిక్ రోషన్ ఎయిట్ ప్యాక్ లుక్ వైరల్
వంద కోట్లకు చేరువలో ధమాకా
Comments
Please login to add a commentAdd a comment