
సాధారణంగా సీరియల్స్‌లో కష్టపడి ఫేమ్ తెచ్చుకున్నాక సినిమాల్లో నటిస్తుంటారు. కానీ నటుడు సమీర్ విషయంలో మాత్రం సీరియల్స్ నుండి ఉన్నపలంగా తొలగించడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా పలు గుర్తిండిపోయే పాత్రలు చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్‌లో వరుస సీరియల్స్‌లో నటించిన సమీర్ ఆ తర్వాత అదే ఛానెల్ నుంచి బయటకు పంపిచేయడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై స్పందించాడు. నా మొగుడు నాకు సొంతం సీరియల్ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నానని, సెట్‌లోనే రాసలీలలు అంటూ కొందరు నాపై ప్రచారం చేశారు. దీంతో సదరు యాజమాన్యం అసలు ఏం జరిగిందో కూడా కనుక్కోకుండా నన్ను అర్థాంతరంగా సీరియల్ నుంచి తప్పించారు.
నాకు రావాల్సిన చెక్కులు కూడా ఆపేశారు. దీంతో అద్దెలు కట్టుకోలేక, ఈఐఎంలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ తర్వాత కొన్నాళ్లకు అసలు విషయం తెలిసి ఆయనే ఫోన్ చేసి సారీ చెప్పారు. కానీ అప్పటికే నా మనసు విరిగిపోయింది. అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు సమీర్.
Comments
Please login to add a commentAdd a comment