
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిక పోలింగ్ లో ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు.. ఆ తర్వాత పూర్తిగా గందరగోళంగా మారిపోయాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం లోపల ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రచారం చేస్తున్నారంటూ.. మంచు మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివబాలాజీ చేయిని హేమ కొరకడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పోలింగ్ కేంద్రం వద్ద సమీర్, శివబాలాజీ సైతం ఘర్షణకు దిగారు. సమీర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడు అంటూ శివబాలాజీ ఆరోపించాడు. సమీర్ సైతం అతనిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ ఇరు వర్గాల సభ్యులు సర్ది చెప్పారు.
ప్రస్తుతం ‘మా’ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్నాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలైయ్యాయి. ఆగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రామ్ చరణ్ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది.