
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై నటుడు నరేశ్ స్పందించారు. ‘పెద్ద గొడవలేవి జరగలేదు. ఎవరో ఒకరు ప్రకాశ్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్ రాజ్ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్’అని చెప్పుకున్నాం. శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment