
సమీర్ ఔట్.. బిగ్‌బాస్ విజేత ఎవరంటే..
గెస్ట్‌గా రానా ఎంట్రీ.. బిగ్‌బాస్ హౌజ్ నుంచి సమీర్ ఔట్.. ఇవి బిగ్‌బాస్ షో వీకెండ్ ఎపిసోడ్ విశేషాలు.. తన 'నేనే రాజు-నేనే మంత్రి' సినిమా ప్రమోషన్‌లో భాగంగా రానా బిగ్‌బాస్ హౌస్‌లోకి గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రానాను చూసి ఆశ్చర్యపోయిన హౌజ్‌లోని సభ్యులు ఆయనను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. హౌజ్ అంతా తిప్పి చూపించారు. ఆయన చుట్టూ మూగి 'నేనే రాజు-నేనే మంత్రి' సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఇక స్నేహితుల దినోత్సవం కావడంతో రానా సమక్షంలో హోస్ట్ ఎన్టీఆర్ ఒక సరికొత్త టాస్క్‌ను హౌజ్‌లోని సభ్యులకు ఇచ్చాడు. తమకు ఇష్టంలేనివారికి నల్లపువ్వు, ఇష్టమైన వారికి పసుపు రంగు పువ్వు ఇవ్వాలని చెప్పడంతో.. సభ్యులు హౌజ్‌లోని తమకు ఎవరు ఇష్టమో, ఎవరు కష్టమో చాటుతూ ఈ టాస్క్‌లో పాల్గొన్నారు.
మొదట ఆదర్శ్ కల్పనకు బ్లాక్, తన స్నేహితుడు ప్రిన్స్‌కి ఎల్లో పువ్వును ఇవ్వగా.. ఇదేవిధంగా మహేష్ కత్తి.. హరితేజకు బ్లాక్ పువ్వు, బాలాజీకి ఎల్లో పువ్వు, అర్చన.. హరితేజకు ఎల్లో పువ్వు, దీక్షకు బ్లాక్ పువ్వు, ధనరాజ్.. ముమైత్‌కు ఎల్లో పువ్వు, మహేష్‌కు బ్లాక్ పూవ్వు, శివబాలాజీ.. ముమైత్ కి ఎల్లో పువ్వు, సమీర్‌కి బ్లాక్ పువ్వు, సమీర్.. అర్చనకి ఎల్లో పువ్వు.. శివ బాలాజీకి బ్లాక్ పువ్వు, ప్రిన్స్.. ఆదర్శ్‌కి ఎల్లో పువ్వు.. దీక్షకి బ్లాక్ పువ్వు, ముమైత్.. ధనరాజ్‌కి బ్లాక్ పువ్వు, శివబాలాజీకి ఎల్లో పువ్వు, కల్పన.. కార్తీకకి బ్లాక్ పువ్వు, శివబాలాజీకి ఎల్లో పువ్వు, కత్తి కార్తీక కల్పనకి బ్లాక్ పువ్వు.. ఆదర్శ్‌కి ఎల్లో పువ్వు, హరితేజ.. అర్చనకి ఎల్లో పువ్వు.. దీక్షకి బ్లాక్ పువ్వు ఇవ్వగా.. చివరిగా దీక్ష.. కత్తి కార్తీకకి ఎల్లో పువ్వు.. అర్చనకి బ్లాక్ పువ్వు ఇచ్చింది. అతిథి అయిన రానా కూడా తనకు ఇష్టమెవరో.. కష్టమెవరో చాటుతూ మొమైత్‌కు ఎల్లో, ప్రిన్స్‌కు బ్లాక్‌పువ్వును ఇచ్చాడు. మొమైత్ కష్టపడి తెలుగు నేర్చుకొని మాట్లాడటం నచ్చిందని చెప్పాడు.
ఈ లోపు శివబాలజీ చికెన్ కర్రీ చేసి రానాను ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఎలిమినేషన్‌కు మొమైత్‌ఖాన్, కల్పన, సమీర్ ఎంపికవ్వగా.. మొమైత్‌ఖాన్‌ను ముందే సేఫ్‌జోన్‌లోకి పంపిన ఎన్టీఆర్.. కల్పన-సమీర్ మధ్య చివరివరకు ఉత్కంఠ రేపాడు. ఆఖరికీ గెస్ట్ రానా సమీర్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు. అంతేకాదు బిగ్‌బాస్ హౌజ్‌లో గంటపాటు సభ్యులతో గడిపిన నేపథ్యంలో సీజన్-1 విజేత ఎవరో గెస్ చేయాలని ఎన్టీఆర్ కోరగా.. ధన్‌రాజ్, శివబాలాజీల మధ్య ఎవరో ఒకరు విజేతగా నిలిచే చాన్స్ ఉందని రానా చెప్పాడు. మొత్తానికి గెస్ట్‌గా రానా, హోస్ట్‌గా ఎన్టీయార్ వీకెండ్ షోను రక్తికట్టించారు.