
బుల్లి తెరపై మరో యంగ్ హీరో..?
ఇప్పటికే నాగార్జున, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు బుల్లితెరపై సందడి చేయగా త్వరలో యంగ్ హీరో ఎన్టీఆర్ కూడా యాంకర్ అవతారం ఎత్తుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. నార్త్లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోను సౌత్లో తమిళ నాట కమల్ హాసన్, తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ హోస్ట్ చేయటంపై అధికారిక ప్రకటన లేకపోయినా అభిమానులు మాత్రం తెగ హడావిడి చేస్తున్నారు.
తాజా మరో యంగ్ హీరో కూడా బుల్లితెరపై సందడి చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో రానా త్వరలో యాంకర్ అవతారం ఎత్తనున్నాడట. కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే ఈ షో కాఫీ విత్ కరణ్ తరహాలో రూపొందనుంది. ప్రస్తుతానికి ఈ షోకు సంబంధించిన అధికారిక సమాచారం లేకపోయినా.. ఫిలింనగర్లో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.