అబ్బాయిలకు పెళ్లి సేఫ్‌ కాదు | raj dhoot movie teaser launch | Sakshi
Sakshi News home page

అబ్బాయిలకు పెళ్లి సేఫ్‌ కాదు

Published Sun, Jun 9 2019 3:13 AM | Last Updated on Sun, Jun 9 2019 7:59 AM

raj dhoot movie teaser launch - Sakshi

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘామ్ష్‌ హీరోగా  పరిచయమవుతోన్న చిత్రం ‘రాజ్‌ధూత్‌’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. అర్జున్‌–కార్తీక్‌ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని నటి, దర్శక–నిర్మాత జీవితారాజశేఖర్‌ విడుదల చేశారు. ‘ఇందుకే అంటారు.. అమ్మాయిలకు ఢిల్లీ, అబ్బాయిలకు పెళ్లి సేఫ్‌ కాదని’ అంటూ కథానాయికతో హీరో అంటాడు. ‘సూపర్‌ భయ్యా.. ఎవరైనా ఆటోవాడికి చెప్పు.. యెనక రాసుకుంటాడు’ అంటూ నటుడు సుదర్శన్‌ చెప్పే డైలాగ్‌ టీజర్‌లో ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా జీవితారాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీహరి–శాంతి కుమారులు చిన్ననాటి నుంచి తెలుసు. తల్లి–తండ్రిలాగే మంచి వ్యక్తిత్వం గలవారు. నా ఇద్దరు అమ్మాయిలతో పాటే వీరిద్దరూ(శశాంక్, మేఘామ్ష్‌) బిడ్డల్లాంటి వారు. మేఘామ్ష్, శివాత్మిక క్లాస్‌ మేట్స్‌. సినిమా టీజర్, రషెస్‌ చూశాను. శ్రీహరిగారి కన్నా పదిరెట్లు  మేఘామ్ష్‌ మంచి పేరు తెస్తాడనే నమ్మకం ఉంది. శ్రీహరిగారు లేని లోటును మేఘాష్ణు్‌ తీర్చేశాడు. మేఘామ్ష్‌–శివాత్మికలకు మంచి కథ కూడా సిద్ధమైంది’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులు బావని(శ్రీహరి) గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. మా బిడ్డని కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నా’’ అన్నారు

నటి శాంతిశ్రీహరి. ‘‘మా అమానాన్నల వల్లే ఈ స్థాయిలో నిలబడగలిగాను. జూలైలో సినిమా విడుదలవుతుంది’’ అని మేఘామ్ష్‌ అన్నారు. ‘‘మేఘామ్ష్‌ రెండో సినిమా కూడా నా బ్యానర్లోనే ఉంటుంది’’ అన్నారు ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ.  ‘‘రచయితలగా పలు సినిమాలకు పనిచేసాం. మేం దర్శకులుగా పరిచయమవుతోన్న చిత్రమిది’’ అన్నారు దర్శకులు అర్జున్‌–కార్తీక్‌. ఈ సందర్భంగా ‘ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అభివృద్ధికి ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ లక్ష రూపాయలు  విరాళంగా అందించారు. సంతోషం అధినేత సురేష్‌ కొండేటి, నక్షత్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎమ్‌.ఎస్‌ కుమార్‌ పాల్గొన్నారు....శశాంక్, శాంతి శ్రీహరి, మేఘామ్ష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement