Jeevita Rajasekhar
-
జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్
పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ సంచలన తీర్పు వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై గతంలో రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిని సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు. (ఇదీ చదవండి: సూర్య కొత్త సినిమా ప్రకటన.. విశాఖలో పుట్టిన సుధకే డైరెక్టర్ ఛాన్స్) చిరంజీవి పేరుతో నడుస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై వారిద్దరూ అసత్య ఆరోపణలు చేశారంటూ అల్లు అరవింద్ అప్పట్లోనే పరువునష్టం దావా వేశారు. అందుకు సంబంధించిన తీర్పును తాజాగా కోర్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా కూడా విధించింది. (ఇదీ చదవండి: చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్) దీంతో జరిమానాను రాజశేఖర్, జీవిత చెల్లించడంతో వారికి అప్పీలుకు వెళ్లే అవకాశం దక్కింది. వారు జిల్లా కోర్టును ఆశ్రయించడంతో వారిద్దరికి రూ. 10 చొప్పున పూచీకత్తుగా తీసుకుని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. -
‘విధి విలాసం’ చిత్రం ప్రారంభం
-
మూడు కోణాలు
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విధి విలాసం’. ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ– ‘‘ఆదిత్ నాకు మంచి సన్నిహితుడు. తనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమా కథ కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శివాత్మిక రాజశేఖర్. ‘‘ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తాం. వేసవిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి. ‘‘దశరథ్ గారి దగ్గర దుర్గ నరేష్ దర్శకత్వ శాఖలో పనిచేశారు.. మంచి ప్రతిభావంతుడు’’ అన్నారు అరుణ్ ఆదిత్. కోట శ్రీనివాసరావు, ఇంద్రజ, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాచర్ల. -
‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ (మా)లో మరోసారి విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవి, రాజశేఖర్ వాగ్వాదం జరగడం, చిరు కామెంట్స్‌కు రాజశేఖర్ అడ్డుపడ్డటం, రాజశేఖర్ తీరును చిరంజీవి, మోహన్‌బాబు ఖండించడంతో వివాదం రేగింది. రాజశేఖర్ అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితారాజశేఖర్ స్పందించారు. మాలోని విభేదాలు తగ్గించి..పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నరేశ్ వర్గంతో తమకున్న విభేదాలను తామలో తాము పరిష్కరించుకుంటామని ఆమె తెలిపారు. మాలో భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని తెలిపారు. ప్రతిచోట గొడవలు రావడం సహజమేనని, తామేమీ దేవుళ్లం కాదు మీలాగే మనుషులమని అన్నారు. చిరంజీవి మా అసోసియేషన్‌కు చాలా టైమ్ ఇచ్చారని, మా అభివృద్ధికి ఎన్నో సూచనలు ఇచ్చారని తెలిపారు. చిరంజీవి, మోహన్‌బాబులాంటి వారినుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని, ఆయన కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారని, ఆయన మనస్సులో ఏది దాచుకోరని తెలిపారు. మాను బలోపేతం చేయడం, గౌరవప్రదమైన సంస్థగా మార్చడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. నరేశ్‌తో తనకు కానీ, రాజశేఖర్‌కుకానీ వ్యక్తిగత విభేదాలు లేవని, చిన్నచిన్న భేదాభిప్రాయాలను అందరం కలిసి ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని చెప్పారు. మరోవైపు సినీ పెద్దలు కూడా ‘మా’లోని విభేదాలను రూపుమాపి.. నరేశ్, జీవితారాజశేఖర్ వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. దీంతో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వివాదంతో రచ్చరేపినా.. చివరకు పరిస్థితి చల్లబడింది. చదవండి: ‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం -
‘రాజ్‌ధూత్’ టీజర్ విడుదల
-
అబ్బాయిలకు పెళ్లి సేఫ్ కాదు
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘రాజ్‌ధూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. అర్జున్–కార్తీక్ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని నటి, దర్శక–నిర్మాత జీవితారాజశేఖర్ విడుదల చేశారు. ‘ఇందుకే అంటారు.. అమ్మాయిలకు ఢిల్లీ, అబ్బాయిలకు పెళ్లి సేఫ్ కాదని’ అంటూ కథానాయికతో హీరో అంటాడు. ‘సూపర్ భయ్యా.. ఎవరైనా ఆటోవాడికి చెప్పు.. యెనక రాసుకుంటాడు’ అంటూ నటుడు సుదర్శన్ చెప్పే డైలాగ్ టీజర్లో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జీవితారాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘శ్రీహరి–శాంతి కుమారులు చిన్ననాటి నుంచి తెలుసు. తల్లి–తండ్రిలాగే మంచి వ్యక్తిత్వం గలవారు. నా ఇద్దరు అమ్మాయిలతో పాటే వీరిద్దరూ(శశాంక్, మేఘామ్ష్) బిడ్డల్లాంటి వారు. మేఘామ్ష్, శివాత్మిక క్లాస్ మేట్స్. సినిమా టీజర్, రషెస్ చూశాను. శ్రీహరిగారి కన్నా పదిరెట్లు మేఘామ్ష్ మంచి పేరు తెస్తాడనే నమ్మకం ఉంది. శ్రీహరిగారు లేని లోటును మేఘాష్ణు్ తీర్చేశాడు. మేఘామ్ష్–శివాత్మికలకు మంచి కథ కూడా సిద్ధమైంది’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులు బావని(శ్రీహరి) గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. మా బిడ్డని కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నా’’ అన్నారు నటి శాంతిశ్రీహరి. ‘‘మా అమానాన్నల వల్లే ఈ స్థాయిలో నిలబడగలిగాను. జూలైలో సినిమా విడుదలవుతుంది’’ అని మేఘామ్ష్ అన్నారు. ‘‘మేఘామ్ష్ రెండో సినిమా కూడా నా బ్యానర్లోనే ఉంటుంది’’ అన్నారు ఎమ్.ఎల్.వి సత్యనారాయణ. ‘‘రచయితలగా పలు సినిమాలకు పనిచేసాం. మేం దర్శకులుగా పరిచయమవుతోన్న చిత్రమిది’’ అన్నారు దర్శకులు అర్జున్–కార్తీక్. ఈ సందర్భంగా ‘ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్’ అభివృద్ధికి ఎమ్.ఎల్.వి సత్యనారాయణ లక్ష రూపాయలు విరాళంగా అందించారు. సంతోషం అధినేత సురేష్ కొండేటి, నక్షత్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్ కుమార్ పాల్గొన్నారు....శశాంక్, శాంతి శ్రీహరి, మేఘామ్ష్ -
జీవితా రాజశేఖర్‌కు ఊరట
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీనటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ కు ఊరట లభించింది. ఆమెపై ఉన్న చెక్ బౌన్సు కేసును ఎర్రమంజిల్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ సందర్భంగా జీవితా మాట్లాడుతూ తనను కోర్టుకు లాగిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని, కావాలనే తన దగ్గర నుంచి చెక్‌లు తీసుకుని, కేసులో ఇరికించారని ఆరోపించారు. తనపై కేసు కొట్టివేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా జీవితా రాజశేఖర్ 2007లో 'ఎవడైతే నాకేంటి' అనే సినిమా నిర్మించారు. ఇందుకోసం సామ శేఖర్‌రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడికి ఇచ్చిన చెక్ బౌన్స్ కావటంతో కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు 2014లో జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఎర్రమంజిల్ కోర్టు తీర్పుపై సామ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... జీవితా రాజశేఖర్‌పై హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. -
సినీ నటి జీవితా రాజశేఖర్ కు అరెస్ట్ వారెంట్!
-
సినీ నటి జీవితా రాజశేఖర్ కు అరెస్ట్ వారెంట్!
చెక్ బౌన్స్ కేసులో సినీనటి జీవితా రాజశేఖర్ కు వారెంట్లు జారీ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసు లో విచారణకు హజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కేసులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితుడి పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. జీవితా రాజశేఖర్ రెండుసార్లు కోర్టుకు గైర్హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అక్టోబర్ 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.