సినీ నటి జీవితా రాజశేఖర్ కు అరెస్ట్ వారెంట్!
చెక్ బౌన్స్ కేసులో సినీనటి జీవితా రాజశేఖర్ కు వారెంట్లు జారీ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసు లో విచారణకు హజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కేసులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితుడి పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. జీవితా రాజశేఖర్ రెండుసార్లు కోర్టుకు గైర్హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అక్టోబర్ 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.