cheque bounce case
-
చెక్ బౌన్స్ కేసు.. అనిత పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి
-
వారి చుట్టూ తిరిగే ఓపికలేకే రాజీపడ్డా
సాక్షి, అమరావతి: చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు, తన మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తనపై విశాఖపట్నం 7వ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏం రాజీ కుదిరిందో చెప్పకుండా, రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదని వ్యాఖ్యనించింది. ఈ సందర్భంగా హైకోర్టు, అనిత తన డబ్బు తీసుకుని ఎగవేసిందంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావుతో స్వయంగా మాట్లాడింది. మీ మధ్య రాజీ కుదిరిందని అనిత పిటిషన్ దాఖలు చేశారని, రాజీ కుదిరిందా? మీరు తప్పుడు కేసు వేశారని వారు చెబుతున్నారంటూ ఆయన్ను ప్రశ్నించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వారి చుట్టూ తిరిగే ఓపిక లేదన్నారు. అందుకే రాజీ అంటే సరేనన్నానని తెలిపారు. రాజీ ఏం కుదిరిందని న్యాయస్థానం ప్రశ్నించగా, అనిత తరఫు న్యాయవాది సతీష్ స్పందిస్తూ.. కుదిరిన రాజీ ప్రకారం వేగి శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీల్లేదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదని తెలిపారు. న్యాయస్థానం స్పందిస్తూ, ఇది రాజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. రాజీలో ఇరుపక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చూపారు, శ్రీనివాసరావుకు ఇవ్వాల్సిన దాంట్లో ఏం ఇచ్చారు.. తదితర వివరాలు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. రాజీ కుదిరిపోయిందని, దానిని రికార్డ్ చేసేయాలంటే కుదరదని తేల్చిచెప్పింది. రాజీని రికార్డ్ చేసేందుకు అవసరమైన అన్నీ వివరాలను తమ ముందుంచాలని అనితను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
వారియర్ డైరెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష
ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ క్యాపిటల్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు. చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. గతేడాది ఆగస్టులో ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సమయమిచ్చింది. దీంతో డైరెక్టర్ రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం అప్పీల్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (ఏప్రిల్ 12న) ఈ కేసును మరోసారి విచారించిన మద్రాస్ హైకోర్టు లింగుస్వామికి విధించిన ఆరు నెలల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో డైరెక్టర్ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్విటర్లో షేర్ చేసిన లింగుస్వామి మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. కాగా లింగుస్వామి చివరిగా రామ్ పోతినేనితో వారియర్ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. pic.twitter.com/aJujcEr01m — Lingusamy (@dirlingusamy) April 13, 2023 -
బాలీవుడ్ నటి అమిషా పటెల్‌పై అరెస్ట్ వారెంట్
బాలీవుడ్ బ్యూటీ అమిషా పటెల్‌పై రాంచి సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కింద ఆమెపై 420, 120 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అమిషా, అమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్‌కు వ్యతిరేకంగా సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాలు.. అమీషా పటేల్‌కు చెందిన ‘దేశీ మ్యాజిక్’ చిత్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్‌గా రాంచీ జిల్లాలోని హర్ము ప్రాంత నివాసి అజయ్ కుమార్ సింగ్‌ను ఆమె సంప్రదించింది. చదవండి: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పుష్ప 2’ టీజర్.. హిందీలోనే ఎక్కువ వ్యూస్.. దీంతో అజయ్ కుమార్ రూ.2.5కోట్లను అమీషా ఖాతాకు బదిలీ చేశాడు. మేకింగ్‌తో పాటు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని ఆయన అమిషాను కోరాడు. ఈ ఒప్పందం ప్రకారం ఆమె 2013లో ప్రాజెక్టును పట్టాలెక్కించింది. సినిమా షూటింగ్‌ను మాత్రం పూర్తి చేయలేదు. ఫలితంగా అజయ్ డబ్బును వెనక్కి ఇవ్వాలని నటిని పలు మార్లు కోరాడు. అక్టోబర్ 2018లో అమీషా రూ.2.5కోట్లకు ఒకటి, రూ.50లక్షలకు మరో చెక్‌ను ఇచ్చింది. చదవండి: ‘మీటర్’ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే కానీ, ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయి. దీంతో అజయ్ సింగ్ ఆమెపై రాంచీ సివిల్ కోర్టులో అమిషా, ఆమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్పై కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు విచారణకు అమిషా హజరు కాగా ఆమె తరపు న్యాయవాది మాత్రం కోర్టుకు ముందు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అలాగే గతంలో రూ. 32.25 లక్షల చెక్ బౌన్స్ కేసులో భోపాల్ కోర్టు అమిషాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఫిలిం అవార్డు చెక్స్ బౌన్స్ గందరగోళం: విజేతలకు చేదు అనుభవం
గువహటి: అసోం రాష్ట్ర చలనచిత్ర అవార్డు విజేతలకుచేదు అనుభవం ఎదురైంది. వారికిచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో గందరగోళం నెలకొంది. ఎనిమిది మంది విజేతలకు ఇచ్చిన చెక్కులను క్లియరెన్స్ కోసం బ్యాంకుకు సమర్పించినప్పుడు అవి బౌన్స్ అయ్యాయి. సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టర్ మీనాక్షి దాస్ నాథ్ సంతకంతో జారీ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులు మార్చి 17న బౌన్స్ అయ్యాయి. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లు వెత్తాయి. ఈ వ్యవహారంపై సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బిమల్ బోరా తక్షణ విచారణకు ఆదేశించారు. వివరాలను పరిశీలిస్తే చలన చిత్ర రంగానికి చెందిన ఎనిమిది మందికి స్టేట్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ASFFDC సోమవారం అవార్డులను ప్రదానం చేసింది దీంతో అవార్డు గ్రహీత రచయిత అపరాజిత పూజారి చెక్కును డిపాజిట్ చేశారు. అయితే అది బౌన్స్ అయిందని బ్యాంకు నుండి కాల్ రావడంతో నిర్ఘాంతపోయి, నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. (ఐఫోనా మజాకా? మైనర్ కిడ్నాప్ డ్రామా...కట్‌చేస్తే..!) పూజారి ఉత్తమ రచయితగా అవార్డును గెలుచుకున్నారు. అయితే పూజారితోపాటు, అమృత్ ప్రీతమ్ (సౌండ్ డిజైన్), దేబజిత్ చంగ్మాయి (సౌండ్ మిక్సింగ్), ప్రాంజల్ దేకా (దర్శకత్వం), దేబజిత్ గయాన్ (సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్) బెంజమిన్ డైమరీ (నటన) వంటి ఇతర ప్రముఖ సినీ ప్రముఖులకు అందజేసిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయట. (ఇదీ చదవండి: రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?) అయితే సాంకేతిక కారణాల వల్ల చెక్కులు బౌన్స్ అయ్యాయని సంబంధిత అధికారి వెల్లడించారు. మొదటి రోజు రూ.18 లక్షల విలువైన చెక్కులు క్లియర్ చేశామనీ, రెంcy రోజు తొమ్మిది చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు. సమస్యను పరిష్కరించామని, తమ చెక్కులను డిపాజిట్ చేయాలని, ఈసారి క్లియర్ అవుతాయంటూ మొత్తం ఎనిమిది మందికి శనివారం వ్యక్తిగతంగా సమాచారం అందించినట్టు తెలిపారు. ఇది మాత్రమే కాదు ఈ అవార్డుల్లో మరో తప్పిదం కూడా చోటు చేసుకుంది. ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్ అవార్డును నహిద్ అఫ్రిన్‌కు ఆమె పాడని పాటకు స్వీకరించారంటూ వివాదం రేగింది. అయితే అఫ్రీన్ 'నిజానోర్ గాన్' చిత్రంలో పాడిన ఆఫ్రీన్కే అవార్డు వచ్చిందని, తప్పిదం జరిగిందని సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రకటించడం గమనార్హం. -
ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల గణేష్
ప్రొద్దుటూరు క్రైం : చెక్‌బౌన్స్ కేసుకు సంబంధించి సినీ నిర్మాత బండ్లగణేష్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు బండ్లగణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టులో చెక్‌బౌన్స్ కేసులు ఉన్నాయి. వీటిలో ఒక కేసుకు సంబంధించి బుధవారం ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. తిరిగి ఈ కేసు విచారణ ఈ నెల 22కు వాయిదా పడినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. -
కన్నడ దర్శకుడి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: శాండిల్‌వుడ్ దర్శకుడు గురుప్రసాద్‌ను గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. మఠ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న గురుప్రసాద్ చెక్‌బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేయటంతో పాటు అతడు ఇచ్చిన చెక్‌బౌన్స్ అయ్యింది. దీంతో శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. దర్శకుడు విచారణకు గైర్హాజరవ్వడంతో గురుప్రసాద్‌పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు గిరినగర పోలీసులు గురుప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. -
అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష
సాక్షి, యశవంతపుర: చెక్‌బౌన్స్ కేసులో కోలారు జిల్లా మాలూరు ఎమ్మెల్యే కెవై నంజేగౌడకు బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు రూ.49.65 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మలూరుకు చెందిన జి రామచంద్ర అనే వ్యక్తి నుంచి నంజేగౌడ రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఎన్నేళ్లయినా అప్పు చెల్లించలేదు. దీంతో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల 24వ ఎసీఎంఎం కోర్టులో ఆయన వ్యాజ్యం వేశారు. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి జె ప్రీతి అసలు, వడ్డీ కలిసి రూ. 49.65 లక్షలు ఎమ్మెల్యే నంజేగౌడ చెల్లించాలని తీర్పు చెప్పారు. లేని పక్షంలో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. (చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో లివ్ ఇన్ రిలేషన్.. పెళ్లి చేసుకోమని అడిగితే దారుణంగా..) -
చెక్‌బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన జీవితా రాజశేఖర్
చెక్‌బౌన్స్ కేసులో ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ గురువారం తిరుపతి జిల్లాలోని నగరి కోర్టుకు హాజరైంది. గరుడవేగ సినిమా నిర్మాతలు హేమ, కోటేశ్వరరావులకు ఆమె రూ.26 కోట్లు బకాయిపడినట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లుగా ఆమె బకాయిలు చెల్లించలేదు. అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయింది. దీంతో గరుడవేగ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. చెక్ బౌన్స్ కేసు విచారణలో భాగంగా జీవితా రాజశేఖర్ కోర్టుకు హాజరైంది. చదవండి: ఆ హీరోయిన్‌తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో సీతారామం సక్సెస్ మీట్‌కు సుమంత్ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో -
చెక్ బౌన్స్ కేసులో విశాఖ జిల్లా కోర్టుకు టీడీపీ నేత అనిత
సాక్షి, విశాఖపట్నం: చెక్ బౌన్స్ కేసులో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2015 వేగి శ్రీనివాసరావు అనే టీడీపీ నేత నుంచి అనిత రూ. 70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే తీసుకున్న డబ్బుకు 2018 సంవత్సరంలో అనిత చెక్ ఇచ్చారు. కాగా చెక్ బౌన్స్ కావడంతో 2019లో శ్రీనివాస్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విచారణకు రావడంతో అనిత కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్ని సార్లు డబ్బులు అడిగినా అనిత ఏదో ఒక వంక పెట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. అవసరం ఉందని చెప్పి డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. సొంత పార్టీ నేతలే మోసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని అన్నారు. టీడీపీలో ఉన్నత స్థానంలో ఉన్న అనిత ఇలా చేయడం దుర్మార్గమని వాపోయారు. ఇప్పటికైనా అనిత తన డబ్బులు ఇచ్చేస్తే కోర్టులో ఉన్న కేసు విత్‌డ్రా చేసుకుంటానని చెప్పారు. చదవండి: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు -
బండ్ల గణేష్‌కు రిమాండ్, కడప జైలుకు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు కడప జైలుకు తరలించారు. కాగా కేసు విచారణ నిమిత్తం బండ్ల గణేష్‌ను పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు తీసుకువచ్చి జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్‌రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. చెక్ కూడా బౌన్స్ కావడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. అయితే కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో బండ్ల గణేష్‌పై కోర్టు సెప్టెంబర్ 18న అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఇక ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్ -
రాహుల్ గాంధీ ప్రత్యర్థి అరెస్ట్
దుబాయ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పోటీచేసి ఓడిపోయిన ఎన్డీఏ అభ్యర్థి, భారత ధర్మ జనసేన(బీడీజీఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి అరెస్ట్ అయ్యారు. ఓ చెక్ బౌన్స్ కేసులో తుషార్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజ్మాన్ సెంట్రల్ జైలుకు తరలించారు. అజ్మాన్‌లో స్థిరపడిన కేరళకు చెందిన వ్యాపారి నాసిల్ అబ్దుల్లా ఈ చెక్‌బౌన్స్ కేసు పెట్టాడు. అసలేం జరిగిందంటే.. తుషార్ వెల్లపల్లి కొంత మంది సన్నిహితులతో కలిసి దుబాయ్‌లో పదిహేనేళ్ల క్రితం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించారు. అయితే ఆ వ్యాపారంలో నష్టాలు వాటిల్లడంతో పదేళ్ల క్రితమే ఆ కంపెనీని అమ్మేశారు. ఆ సమయంలో నాసిల్ అబ్దుల్లాకు రూ. 19కోట్ల విలువ చేసే చెక్‌లు తుషార్ ఇచ్చారు. అయితే అంత డబ్బు బ్యాంకులో లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో పదేళ్ల నుంచి వేచి చూసిన నాసిల్ పక్కా ప్రణాళిక ప్రకారం తుషార్‌ను అజ్మాన్‌కు రప్పించి ఓ హోటల్లో దింపాడు. అప్పటికే స్థానిక పోలీసులకు అబ్దుల్లా ఫిర్యాదు చేయడంతో హోటల్‌కు చేరుకన్న పోలీసులు తుషార్‌ను అరెస్ట్ చేశారు. అయితే తుషార్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అతడికి చట్టప్రకారమే కొంత ఉపశమనం కలిగేలా చూడాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. -
చెక్ బౌన్స్ .. రూ.కోటి జరిమానా..!
సాక్షి, హైదరాబాద్ : చెక్‌బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి మల్కాజిగిరి ఫస్ట్ సెషన్స్ కోర్టు కోటి రూపాయల జరిమానా విధించింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో నిందితుడికి జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. దాంతోపాటు బాధితుడికి అసలు రూ.55 లక్షలు, నష్టపరిహారంగా మరో రూ.20 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. న్యాయవాది టి.నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి నివాసి గూడూరు సంజీవరెడ్డి (సాయి రత్న) వ్యాపార నిమిత్తం సాకేత్ మిథిలాలో నివాసముండే మొగుల్ల విజయభాస్కర్ రెడ్డి (42) కి రూ.55 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చేందుకు డెక్కన్ గ్రామీణ బ్యాంక్ (ఎస్సార్ నగర్ బ్రాంచ్)కు సంబంధించిన రు.25 లక్షల రూపాయల చెక్కును 2015, నవంబర్ 23న, రూ.30 లక్షల చెక్కును 2015, డిసెంబర్ 1న విజయభాస్కర్ రెడ్డి సంజీవరెడ్డికి ఇచ్చారు. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయగా ఫెయిల్ అయ్యాయి. దీంతో సంజీవ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. పూర్తి విచారణ అనంతరం ఇరువురి వాదనలు విన్న జడ్జి సాంబశివ మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడు విజయ భాస్కర్ రెడ్డిపై వచ్చిన చెక్‌బౌన్స్ ఆరోపణలు రుజువైనందున రూ.కోటి జరిమానాతోపాటు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, బాధితుడికి అసలు 55 లక్షల రూపాయలతో పాటు 20 లక్షలు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు మాసాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు అనంతరం విజయ భాస్కర్ రెడ్డి ని కుషాయిగూడ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనితపై చెక్‌బౌన్స్ కేసు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): తనకు చెల్లని చెక్కు ఇవ్వడంతో..అధికార పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయని వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత 2015 అక్టోబర్ నెలలో అతని వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకుంది. అందుకు సంబంధించి ప్రాంసరీ నోటు, పోస్ట్ డేటెడ్ చెక్కును అనిత ఇచ్చారు . అయితే చాలా రోజుల పాటు ఆ చెక్కును బ్యాంకులో వెయ్యొద్దంటూ శ్రీనివాసరావును ఆమె కోరుతూ వచ్చారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బ్యాంకు లోన్ పెట్టానని, వచ్చిన వెంటనే మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని నమ్మబలికారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. తన అప్పు తీర్చాలని శ్రీనివాసరావు ఒత్తిడి తేగా.. గతేడాది జూలై 30న రూ.70 లక్షల హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను అనిత ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేస్తే అకౌంట్లో బ్యాలెన్స్ లేదని బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు లేఖ పంపారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సివిల్ కేసుకు సంబంధించి 12వ అదనపు జిల్లా జడ్జి నుంచి కోర్టుకు హాజరు కావాలని అనితకు (ఓఎస్ నంబరు 434/2018)తో సమన్లు అందాయి. ఇక క్రిమినల్ కేసు (సీసీ నంబరు 1919/2018)కి సంబంధించి ఈ నెల 26వ తేదీన వాయిదాకు హాజరు కావల్సి ఉంది. అధికారం తన చేతిలో ఉందని, ప్రజల్ని ఇలా మోసం చేయడం సరికాదని బాధితుడు వాపోతున్నాడు. అంత డబ్బు ఎందుకిచ్చానంటే.. తాను ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, కొంత అప్పు ఉందని, ఎమ్మెల్యేగా పరువు పోతుందని అనిత బతిమాలుకున్నారు. ఆమెపై నమ్మకంతో అప్పు ఇచ్చా. దఫదఫాలుగా సమకూర్చుకున్న రూ.70 లక్షల మొత్తాన్ని ఆమెకు ఒక్కసారిగానే అందజేశా. ఇంత వరకు ఆమె అప్పు తీర్చకపోగా..చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారు. అందుకే కోర్టును ఆశ్రయించా. –వేగి శ్రీనివాసరావు, బాధితుడు -
సంతోషించేలోపే.. టీమిండియా క్రికెటర్‌కి షాక్!
కోల్‌కతా : లైంగిక ఆరోపణలు, గృహ హింస చట్టం కేసులతో భర్త, టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని ఉక్కిరి బిక్కిరి చేసిన హసీన్ జహాన్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో టీమిండియా క్రికెటర్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్య హసీన్ జహాన్ చేసిన ఫిర్యాదుతో షమీకి కోల్‌కతా అలీపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 20వ తేదీన కోర్టుకు హాజరు కావాలని క్రికెటర్‌ను ఆదేశించింది. భార్య ఫిర్యాదు అనంతరం గత మార్చి నెలలో షమీ లక్ష రూపాయల చెక్కును ఇచ్చాడు. తనకు షమీ ఇచ్చిన లక్ష రూపాయల చెక్ (నెంబర్ 03718) బౌన్స్ అయిందని హసీన్ జహాన్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన అలీపూర్ కోర్ట్ సెప్టెంబర్ 20న విచారణకు హాజరు కావాలని క్రికెటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, నెలకు తనకు రూ.10 లక్షల భరణం ఇవ్వాలని షమీని భార్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కుటుంబ పోషణకు 7లక్షల రూపాయలు, తమ పాప కోసం 3 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. తన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం భార్య ఎప్పుడో ఖాళీ చేసిందని ఆరోపించిన షమీ.. ఈ నేపథ్యంలో ఇచ్చిన లక్ష రూపాయల చెక్ బౌన్స్ వ్యవహారం షమీకి తలనొప్పిగా మారింది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో పేసర్ షమీకి బీసీసీఐ చోటిచ్చింది. ఇటీవల నిర్వహించిన యోయో టెస్టులో విఫలమవడంతో ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో జరిగిన పొట్టి ఫార్మాట్ సిరీస్‌లకు దూరమైన షమీకి అలా గుడ్ న్యూస్ తెలిసి సంతోషించేలోపే.. ఈ బ్యాడ్ న్యూస్ తెలిసింది. గతంలోనూ భార్య ఆరోపణల నేపథ్యంలో షమీకి బీసీసీఐ తొలుత ఆటగాళ్ల కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ప్రాథమిక విచారణ అనంతరం షమీకి క్లీన్చిట్ రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో, భారత జట్టులో ఆడేందుకు పర్మిషన్ లభించింది. -
వాట్సప్ ద్వారా కోర్టు సమన్లు
గాంధీనగర్, సూరత్ : భారత న్యాయ వ్యవస్థ చర్రితలో తొలిసారి ఓ కోర్టు సామాజిక మాధ్యమం (వాట్సప్) ద్వారా ఓ వ్యక్తికి సమన్లు జారిచేసింది. గుజరాత్‌లోని సూరత్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో బాధితుడి న్యాయవాది అభ్యర్ధన మేరకు వాట్సప్ ద్వారా సమన్లు పంపింది. వివరాలు... సూరత్‌కు చెందిన ఓ టీ కప్స్ వర్తకుడు 2017లో రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ హోల్ సెల్ వ్యాపారి వద్ద టీ కప్స్ కొరకు ఆర్డర్ ఇచ్చాడు. సరకు సరఫర చేసేందుకు అడ్వాన్స్‌గా లక్షా ముఫై వేలు చెల్లించాడు. ఎనిమిది నెలలు గడిచినా సరుకు పంపక పోవడంతో తాను చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. దానికి అంగీకరించిన వ్యాపారి చెక్ రూపంలో నగదు చెల్లించాడు. తనకు వేసిన చెక్ బౌన్స్ అయిందని, ఆ విషయంపై వ్యాపారితో చర్చిద్దాం అనుకున్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందన లేకపోవడంతో తనకు న్యాయం చేయవలసిందిగా సూరత్‌లోని అదనపు న్యాయ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మూడు సార్లు సమన్లు పంపినా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో న్యాయవాది అభ్యర్ధన మేరకు వాట్సప్ ద్వారా సమన్లు జారిచేసింది. తన అభ్యర్ధన మన్నించి దేశంలోనే మొదటిసారిగా వాట్సప్ ద్వారా కోర్టు సమన్లు పంపిందని భాదితుడు తరుఫున న్యాయవాది అశ్విన్ జోగడియా తెలిపారు. -
ప్రముఖ హాస్య నటుడికి 6 నెలల జైలు శిక్ష
బాలీవుడ్ హస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ కార్కారదుమ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎమ్జీ అగర్వాల్ దగ్గర నుంచి తీసుకున్న 5 కోట్ల రూపాయల అప్పును తిరిగి చెల్లించనందుకు గాను, కోర్టు ఈ శిక్ష విధించింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ నటుడికి 6 నెలల జైలు శిక్షతో పాటు, 11.2 కోట్ల రూపాయలు జరిమానాను, అతని భార్య రాధ యాదవ్‌కు 70 లక్షల జరిమానాను విధించారు. తరువాత రాజ్‌పాల్‌కు 50వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. 2010 లో రాజ్‌పాల్ తొలిసారి తానే నటిస్తూ దర్శకత్వం వహించబోయే సినిమా ‘ఆట పాట లపాట’ కోసం ఢిల్లీకి చెందిని మురళీ ప్రాజెక్ట్ కంపెనీ యజమాని ఎమ్జీ అగర్వాల్ దగ్గర నుంచి 5కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి 2011, డిసెంబర్ 3 నాటికి తిరిగి చెల్లిస్తానని మాట ఇచ్చి సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆ వ్యాపారవేత్త ఈ రాజ్ పాల్ దంపతుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఢిల్లీ హై కోర్టు అప్పు చెల్లించడానికి ఈ దంపతులకి చాలా అవకాశాలు ఇచ్చింది, కానీ వారు అప్పు చెల్లించలేదు. దీంతో సోమవారం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. రాజ్‌పాల్ హిందీలో ‘భూల్‌భూలయ్యా’, ‘పార్టనర్’, ‘హంగామా’ వంటి హిందీ చిత్రాల్లోనే కాక తెలుగులో ‘కిక్ -2’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు -
ఇక ఆ హాస్యనటుడు జైలుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ రుణ రికవరీ కేసులో దోషిగా తేలారు. చెక్ బౌన్స్ సహా, ఏడు కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్, అతని భార్య రాధను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీలోని 'కర్ కర్ డూమా' కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల 23న న్యాయస్థానం వీరికి శిక్షలను ఖరారు చేయనుంది. కాగా 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ బాకీ తీర్చకపోవడంతో బాధితుడు రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ బాకీ మొత్తం ఇపుడు రూ. 8కోట్లకు చేరినట్టు అంచనా. గతంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్‌పాల్ యాదవ్, అతని భార్యకు ఆరు రోజుల జైలు శిక్షను విధించింది. దీంతోపాటు ముంబై మలాడ్‌లోని రాజ్పాల్యాదవ్, అతడి భార్యకు చెందిన యాక్సిస్ బ్యాంక్ జాయింట్ అకౌంట్‌ను, వారి కంపెనీ అకౌంట్‌ను సైతం అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే బాలీవుడ్ సినిమాలు భూల్ భులయ్యా, పార్టనర్, హంగమా వంటి పలు విజయవంతమైన చిత్రాలతోపాటు, తెలుగులో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాకు సీక్వల్ కిక్-2 లో కూడా ఆయన నటించారు. -
టాలీవుడ్ నిర్మాతపై నాన్‌బెయిలబుల్ వారెంట్
సాక్షి, రాజమండ్రి: ప్రముఖ సినీ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కోర్టు ఆయనకు బుధవారం ఈ వారెంట్ జారీ చేసింది. ఓ ఫైనాన్షియర్‌కు రవీంద్రరెడ్డి ఇచ్చిన రూ. 50 లక్షల చెక్ బౌన్స్ అవ్వడంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి రవీంద్రరెడ్డికి కోర్టు పలు సార్లు నోటీసులు పంపింది. అయితే, కోర్టు నోటీసులపై రవీంద్రరెడ్డి స్పందించకపోవడంతో ఈ రోజు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాగా రవీంద్ర రెడ్డి. గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, బోయపాటి డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక చిత్రాలను నిర్మించారు. -
సినీ నిర్మాతకు రిమాండ్
గుండెపోటు రావడంతో చికిత్సకోసం ఆసుపత్రికి తరలింపు కాకినాడ లీగల్: చెక్‌బౌన్స్ కేసులో ‘సినిమా చూపిస్తా మావా’ సినీ నిర్మాత బోగాది అంజిరెడ్డిని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోర్టు సోమవారం రిమాండ్‌కు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన మేడపాటి సాయికృష్ణా రెడ్డి వద్ద నుంచి 2016లో తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన ‘సినిమా చూపిస్తా మావా’ సినీ నిర్మాత బోగాది అంజిరెడ్డి రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. దీని నిమిత్తం రూ.5 లక్షలు చెక్కును సాయికృష్ణారెడ్డికి ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు కాకినాడ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. జూన్ నెల 27వ తేదీన కేసు వాయిదాకు సినీ నిర్మాత హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో కాకినాడ టూటౌన్ పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న అంజిరెడ్డిని అరెస్టు చేసి శనివారం రాత్రి 8 గంటలకు మేజిస్ట్రేట్ వెంకటేశ్వరరావు ఎదుట హాజరుపరిచారు. ఆ సమయంలో అస్వస్థతకు గురైన అంజిరెడ్డికి పూర్తి స్థాయిలో చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఐదో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి విచారణ చేసి 14 రోజులు రిమాండ్ విధించగా రాజమండి సెంట్రల్ జైలుకు తరలించారు. -
కాంగ్రెస్ మాజీ ఎంపీకి రెండేళ్ల జైలు
►చెక్‌బౌన్స్ కేసులో కింది కోర్టు తీర్పును నిర్ధారించిన చెన్నై అదనపు కోర్టు చెన్నై: చెక్‌బౌన్స్ కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అన్బరసుకు కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను చెన్నై అదనపు కోర్టు ఖరారు చేసింది. రాజీవ్‌గాంధీ విద్యా ట్రస్ట్ కోసం ముకుంద్‌చంద్ బోద్రా అనే ఫైనాన్షియర్ నుంచి 2002లో అన్బరసు రూ.35 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించేందుకు ఫైనాన్షియర్‌కు ఆయన చెక్కు ఇచ్చాడు. అయితే ఇది బౌన్స్ అయింది. అన్బరసు, ఆయన భార్యకు జైలు శిక్ష విధించాలని బాధితుడు కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్‌ను విచారించి అన్బరసు, ఆయన భార్య కమల, ట్రస్ట్ నిర్వాహకుడు మణిలకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2015లో చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అలాగే ట్రస్ట్ నిర్వాహకులైన 8 మంది కలిసి రూ.35 లక్షలకు ఏడాదికి 9 శాతం చొప్పన వడ్డీ చెల్లించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చెన్నై అదనపు బెంచ్ కోర్టులో నిందితులు అప్పీలు చేసుకున్నారు. ఈ అప్పీలు పిటిషన్‌ను బెంచ్ కోర్టు న్యాయమూర్తి శాంతి శుక్రవారం విచారించి కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అన్బరసు సతీమణి కమల మృతిచెందడంతో ఆమెకు విధించిన శిక్షను కొట్టివేశారు. నిందితులంతా కోర్టులో హాజరుకావాలని పిటిషన్ జారీ అయింది. -
చంచల్‌గూడ జైలుకు నటుడు ప్రదీప్
చంచల్‌గూడ: చెక్ బౌన్స్ కేసులో నిందితుడిగా ఉన్న బుల్లి తెర నటుడు ప్రదీప్‌ని నగర పోలీసులు శుక్రవారం సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఎర్ర మంజిల్ కోర్టు ప్రదీప్‌పై వారెంట్ జారీ చేయగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైల్‌కు తరలించారు. అనంతరం అదే రోజు కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో గంటల వ్యవధిలో ప్రదీప్ జైలు నుంచి విడుదలయ్యాడు. -
కోర్టుకు హాజరైన ప్రముఖ నటి
బొమ్మనహల్లి(కర్ణాటక): చెక్కు బౌన్స్ కేసులో ప్రముఖ నటి పూజా గాంధీ శుక్రవారం ఇక్కడి 16వ ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు. కొద్ది నెలల క్రితం స్వీయ నిర్మాణంలో ఆమె ‘ముత్తులక్ష్మి’ సినిమా ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఫైనాన్స్ వ్యాపారి విజయ్ కుమార్ నుంచి 4 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత రూ. 4 కోట్లకు చెక్కు ఇచ్చారు. అయితే ఈ చెక్కు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. గతంలో పలుమార్లు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు శుక్రవారం తండ్రి పవన్ గాంధీతో కలిసి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. కన్నడ, తమిళం, బెంగాలీ, హిందీ, మలయాళం సినిమాల్లో పూజా గాంధీ నటించారు. 2012లో రాజకీయ ప్రవేశం చేశారు. మొదట్లో జేడీఎస్ చేరిన ఆమె తర్వాత కేజేపీలోకి మారారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాయచూరు నుంచి బీఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. -
మాల్యాకు వార్నింగ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ రుణ ఎగవేతదారుడు, బ్రిటన్‌లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు పాటియాలా హౌస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 4న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. లండన్ లో ఉన్న మాల్యాకు వారెంట్ అందేలా చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టుకు హాజరుకాకుంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఇప్పటికే పలు కోర్టులు మాల్యాకు బెయిల్ కు వీలుకాని వారెంట్లు జారీ చేశాయి. సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆయన ఏ కోర్టులోనూ హాజరుకాలేదు. కాగా, ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్ ను రూ.135 కోట్లకు వేలం వేసినా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. -
మాల్యాకు మరోసారి వారెంట్
ముంబై: మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు ముంబై కో్ర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారీ జారీ చేసింది. న్యాయమూర్తి హెచ్చరించినట్టుగానే చెక్ బౌన్స్ కేసులో కోర్టు మద్యం వ్యాపారి ,కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతి విజయ్ మాల్యా కు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. సబర్బన్ అంధేరీలోని మెట్రోపాలిటన్ కోర్టు శనివారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ (ఏఏఐ) దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ముందు హాజరుకావాలన్న ఆదేశాలను బేఖాతరు చేసిన మాల్యాపై మాజిస్ట్రేట్ ఏఏ లాల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలైలో తదుపరి విచారణకు హాజరు కాని పక్షంలో నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ చేస్తామన్న కావాలంటూ కింగ్‌ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యాను ఈ ఏడాది మే నెలలో కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేయనున్నట్లు మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ ఏఏ లాల్కర్ హెచ్చరించిన మాల్యా గైర్హాజరు కావడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 100 కోట్ల రూపాయలు చెల్లించేందుకు రెండు చెక్కులను ఇచ్చింది. ఇవి బౌన్స్ కావటంతో ఏఏఐ.. మెట్రోపాలిటన్ కోర్టులో కేసు దాఖలు చేసింది. కేసు విచారణ సందర్భంగా విజయ్ మాల్యా కోర్టులో హాజరయ్యేందుకు ఇస్తున్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేయాలంటూ ఏఏఐ కోర్టును కోరింది. బకాయిలు చెల్లించకుండా మాల్యా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనపై అరెస్ట్ వారంట్ జారీ చేయాలని కోరింది. దీంతోపాటుగా ఏఏఐ న్యాయవాది వాదించిన సంగతి తెలిసిందే.