బంజారాహిల్స్ (హైదరాబాద్) : మాజీ డీజీపీ సతీమణి దగ్గర అప్పుగా తీసుకున్న నగదును చెల్లించకపోవడం, ఇచ్చిన చెక్కు బౌన్స్ అవడంతో ఓ యువతిని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 18లో నివసించే మాజీ డీజీపీ అప్పారావు సతీమణి ఊట్ల శ్రీదేవి 2012 అక్టోబర్ 18న తనకు పరిచయం ఉన్న కొల్లి అంజనీ అనిత అనే యువతికి బొటిక్ పెట్టుకోవడానికి రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చారు.
అనిత తీసుకున్న అప్పుకుగాను శ్రీదేవికి 2014లో చెక్ ఇవ్వగా అది బౌన్స్ అయింది. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. మూడు సార్లు నోటీసులు జారీ చేసినా నిందితురాలు స్పందించకపోగా తరచూ ఇళ్లు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నది. దీంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున మాదాపూర్‌లో నివసిస్తున్న అనిత ఇంటికి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు.
చెక్‌బౌన్స్ కేసులో యువతి అరెస్ట్
Published Tue, Dec 8 2015 5:43 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement