ఇక ఆ హాస్యనటుడు జైలుకేనా? | Bollywood Actor Rajpal Yadav, Wife Convicted in Recovery Suit | Sakshi

ఇక ఆ హాస్యనటుడు జైలుకేనా?

Apr 14 2018 11:38 AM | Updated on Apr 3 2019 6:34 PM

Bollywood Actor Rajpal Yadav, Wife Convicted in Recovery Suit  - Sakshi

రాజ్‌పాల్‌ యాదవ్‌, అతని భార్య (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ:  బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌  రుణ రికవరీ కేసులో దోషిగా తేలారు.  చెక్‌ బౌన్స్‌ సహా, ఏడు కేసుల్లో  రాజ్‌పాల్‌ యాదవ్‌, అతని భార్య రాధను కోర్టు దోషులుగా నిర్ధారించింది.  ఢిల్లీలోని  'కర్ కర్ డూమా'   కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ అరోరా  ఈ తీర్పును వెలువరించారు.  ఈ నెల 23న  న్యాయస్థానం వీరికి శిక్షలను ఖరారు చేయనుంది.

కాగా  2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ బాకీ  తీర్చకపోవడంతో  బాధితుడు రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ బాకీ మొత్తం ఇపుడు రూ. 8కోట్లకు చేరినట్టు అంచనా.

గతంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన  కేసులో సుప్రీంకోర్టు రాజ్‌పాల్‌ యాదవ్‌, అతని భార్యకు ఆరు రోజుల జైలు శిక్షను విధించింది. దీంతోపాటు ముంబై మలాడ్‌లోని రాజ్‌పాల్‌యాదవ్, అతడి భార్యకు చెందిన  యాక్సిస్ బ్యాంక్‌ జాయింట్ అకౌంట్‌ను, వారి కంపెనీ అకౌంట్‌ను సైతం అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.  ఇకపోతే బాలీవుడ్‌ సినిమాలు భూల్‌ భులయ్యా, పార్టనర్, హంగమా వంటి పలు విజయవంతమైన చిత్రాలతోపాటు, తెలుగులో  రవితేజ హీరోగా నటించిన కిక్‌ సినిమాకు  సీక్వల్‌ కిక్‌-2 లో కూడా ఆయన నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement