ఎర్రమంజిల్ కోర్టుకు హజరైన కొత్తపల్లి గీత
ఎర్రమంజిల్ కోర్టుకు హజరైన కొత్తపల్లి గీత
Published Mon, Sep 22 2014 6:17 PM | Last Updated on Thu, Jul 11 2019 7:42 PM
హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టుకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలని చేసిన విజ్క్షప్తికి ఎర్రమంజిల్ కోర్టు సానుకూలంగా స్పందించింది. దాంతో కొత్తపల్లి గీతపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ను కోర్టు రీకాల్ చేసింది.
గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 25 కోట్ల రుణాన్ని కొత్తపల్లి గీత తీసుకున్నారు. కొత్తపల్లి గీత ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోర్టులో పిటిషన్ వేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కొత్తపల్లి గీత, ఆమె భర్త సీఆర్కే రావులు డైరెక్టర్లుగా ఉన్నారు.
Advertisement
Advertisement