మాల్యా చెక్ బౌన్స్ కేసు జూలై 5కి వాయిదా | Vijay Mallya cheque bounce matter: Hyderabad court asks GMR to submit fresh address of accused | Sakshi
Sakshi News home page

మాల్యా చెక్ బౌన్స్ కేసు జూలై 5కి వాయిదా

Published Mon, Jun 6 2016 12:55 PM | Last Updated on Thu, Jul 11 2019 7:42 PM

Vijay Mallya cheque bounce matter: Hyderabad court asks GMR to submit fresh address of accused

హైదరాబాద్ :  బ్యాంకులను ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కింగ్‌ఫిషర్ విమానాల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకుగాను జీఎంఆర్‌కు మాల్యా రూ. 50లక్షలు విలువ చేసే రెండు చెక్కులను ఇచ్చారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు లేకపోవడంతో ఈ రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీనిపై జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో మాల్యను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన చిరునామాలో ఉన్న నివాసాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ సీజ్ చేశారని, ఆయన అక్కడ ఉండడం లేదని వివరిస్తూ మహారాష్ట్ర పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు. దీంతో మాల్యా నివసిస్తున్న సరైన చిరునామా  ఇవ్వాలని న్యాయవాది ఎం కృష్ణారావు ఈ సందర్భంగా జీఎంఆర్కు సూచించిన విషయం తెలిసిందే. అనంతరం కేసు విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. సరైన చిరునామాతో వస్తే మాల్యాకు ఫ్రెష్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement