మాల్యాకు మరోసారి వారెంట్
ముంబై: మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు ముంబై కో్ర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారీ జారీ చేసింది. న్యాయమూర్తి హెచ్చరించినట్టుగానే చెక్ బౌన్స్ కేసులో కోర్టు మద్యం వ్యాపారి ,కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతి విజయ్ మాల్యా కు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. సబర్బన్ అంధేరీలోని మెట్రోపాలిటన్ కోర్టు శనివారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ (ఏఏఐ) దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ముందు హాజరుకావాలన్న ఆదేశాలను బేఖాతరు చేసిన మాల్యాపై మాజిస్ట్రేట్ ఏఏ లాల్‌కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూలైలో తదుపరి విచారణకు హాజరు కాని పక్షంలో నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ చేస్తామన్న కావాలంటూ కింగ్‌ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యాను ఈ ఏడాది మే నెలలో కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేయనున్నట్లు మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ ఏఏ లాల్‌కర్ హెచ్చరించిన మాల్యా గైర్హాజరు కావడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 100 కోట్ల రూపాయలు చెల్లించేందుకు రెండు చెక్కులను ఇచ్చింది. ఇవి బౌన్స్ కావటంతో ఏఏఐ.. మెట్రోపాలిటన్ కోర్టులో కేసు దాఖలు చేసింది. కేసు విచారణ సందర్భంగా విజయ్ మాల్యా కోర్టులో హాజరయ్యేందుకు ఇస్తున్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేయాలంటూ ఏఏఐ కోర్టును కోరింది. బకాయిలు చెల్లించకుండా మాల్యా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనపై అరెస్ట్ వారంట్ జారీ చేయాలని కోరింది. దీంతోపాటుగా ఏఏఐ న్యాయవాది వాదించిన సంగతి తెలిసిందే.