కోర్టుకు బండ్ల గణేష్, బెయిల్ మంజూరు | cheque bounce case: bandla ganesh gets bail | Sakshi
Sakshi News home page

కోర్టుకు బండ్ల గణేష్, బెయిల్ మంజూరు

Published Thu, Jun 25 2015 12:49 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

కోర్టుకు బండ్ల గణేష్, బెయిల్ మంజూరు - Sakshi

కోర్టుకు బండ్ల గణేష్, బెయిల్ మంజూరు

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం నాంపల్లి కోర్టుకు  హాజరయ్యారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 14వ తేదీకి వాయిదా వేసింది.   'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న హీరో సచిన్ జోషి ... బండ్ల గ‌ణేష్ త‌న‌ని మోసం చేశాడ‌ని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. ఈ కేసు విచారణ నిమిత్తం బండ్ల గణేష్ ఇవాళ కోర్టుకు హాజరు అయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement