గాంధీనగర్, సూరత్ : భారత న్యాయ వ్యవస్థ చర్రితలో తొలిసారి ఓ కోర్టు సామాజిక మాధ్యమం (వాట్సప్) ద్వారా ఓ వ్యక్తికి సమన్లు జారిచేసింది. గుజరాత్‌లోని సూరత్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో బాధితుడి న్యాయవాది అభ్యర్ధన మేరకు వాట్సప్ ద్వారా సమన్లు పంపింది. వివరాలు... సూరత్‌కు చెందిన ఓ టీ కప్స్ వర్తకుడు 2017లో రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ హోల్ సెల్ వ్యాపారి వద్ద టీ కప్స్ కొరకు ఆర్డర్ ఇచ్చాడు. సరకు సరఫర చేసేందుకు అడ్వాన్స్‌గా లక్షా ముఫై వేలు చెల్లించాడు. ఎనిమిది నెలలు గడిచినా సరుకు పంపక పోవడంతో తాను చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు.
దానికి అంగీకరించిన వ్యాపారి చెక్ రూపంలో నగదు చెల్లించాడు. తనకు వేసిన చెక్ బౌన్స్ అయిందని, ఆ విషయంపై వ్యాపారితో చర్చిద్దాం అనుకున్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందన లేకపోవడంతో తనకు న్యాయం చేయవలసిందిగా సూరత్‌లోని అదనపు న్యాయ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మూడు సార్లు సమన్లు పంపినా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో న్యాయవాది అభ్యర్ధన మేరకు వాట్సప్ ద్వారా సమన్లు జారిచేసింది. తన అభ్యర్ధన మన్నించి దేశంలోనే మొదటిసారిగా వాట్సప్ ద్వారా కోర్టు సమన్లు పంపిందని భాదితుడు తరుఫున న్యాయవాది అశ్విన్ జోగడియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment