surat court
-
రాహుల్ గాంధీకి షాక్ !
-
పరువునష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత
గుజరాత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ గురువారం కోర్టు కొట్టివేసింది. దీంతో ఇదే కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా 2019 కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్టకు నష్టంం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగేరా.. తీర్పును నేటికి రిజర్వు చేశారు. తాజాగా రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలన్న రాహుల్ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. చదవండి: భారీగా నమోదైన కోవిడ్ మరణాలు.. ఒక్క కేరళలోనే 11 మంది మృతి రాహుల్‌పై నమోదైన కేసు ఏంటి? 2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ మాట్లాడుతూ.. ‘దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. ఈ మేరకు నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్‌పై పరువు నష్టం కేసు వేయగా.. గత నెలలో సూరత్ దిగువ కోర్టు విచారణ జరిపి దోషిగా నిర్ధారించింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఈ తీర్పు వెలువరించిన మరుసటి రోజే రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సచివాలయం రద్దుచేసింది. చదవండి: అతీక్ హత్య కేసులో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్ -
రాహుల్ గాంధీ పిటిషన్ పై నేడు సూరత్ కోర్టు తీర్పు
-
ట్రయిల్ కోర్టులో నాకు అన్యాయం జరిగింది..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బెయిల్
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేశారు. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తనను దోషిగా తేల్చూతు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. అలాగే తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కూడా కొట్టివేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. రాహుల్ గాంధీ ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను అదే రోజు చేపడతామని చెప్పింది. దీంతో తీర్పుపై స్టే వస్తుందనుకున్న రాహుల్‌కు నిరాశే ఎదురైంది. రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు తీర్పుపై స్టే విధిస్తే ఆయనపై ఎంపీగా అనర్హత వేటు తాత్కాలికంగా తొలగిపోనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. సూరత్ కోర్టకు రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వెళ్లారు. ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు కూడా రాహుల్‌తో పాటు ఉన్నారు. #WATCH | Gujarat: Congress leader Rahul Gandhi, accompanied by senior Congress leaders and CMs arrives in Surat. pic.twitter.com/jNbFe1KF8u — ANI (@ANI) April 3, 2023 2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయనకు సంఘీభావం తెలిపాయి. చదవండి: కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడ్డ నాయకులు.. -
Rahul Gandhi: సోదరితో పాటు సూరత్ కోర్టుకు..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు(సోమవారం) సూరత్(గుజరాత్) కోర్టును ఆశ్రయించనున్నారు. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లేందుకు ఆయనకు కోర్టు నెల వ్యవధి ఇవ్వగా.. ఇవాళ ఆయన అప్పీల్‌కు వెళ్లనున్నారు. సూరత్ సెషన్స్ కోర్టులో ఇవాళ రాహుల్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయనున్నారు. పరువునష్టం కేసులో మెజిస్ట్రేట్ విధించిన శిక్షను పక్కనపెట్టాలంటూ ఆయన అప్పీల్ చేయనున్నారు. అంతేకాదు.. తన శిక్షపై తాత్కాలిక స్టే ఇవ్వాలని, తద్వారా లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దొరుకుతుందని ఆయన పిటిషన్లో కోరే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ నేలతో కలిసి ఆయన సూరత్ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు కూడా. -
‘దొంగల ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై... రాహుల్‌కు రెండేళ్ల జైలు
సూరత్/ఢిల్లీ: ‘దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్‌ను దోషిగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ నిర్ధారించారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్ మంజూరు చేశారు. పై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్ కోర్టులోనే ఉన్నారు. ‘‘ఈ కేసులో దోషి పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఏం మాట్లాడినా అది దేశ ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కేసు తీవ్రత పెరిగింది. దోషికి తక్కువ శిక్ష విధిస్తే ప్రజలకు తప్పుడు సంకేతం పంపించినట్లు అవుతుంది. ఎవరైనా ఇతరులను ఇష్టారాజ్యంగా దూషించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో రాహుల్ గతంలో క్షమాపణ చెప్పారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు’’ అని న్యాయస్థానంలో తన తీర్పులో పేర్కొంది. కించపర్చే ఉద్దేశం లేదు విచారణ సందర్భంగా రాహుల్ తన వాదన వినిపించారు. తనకు ఎవరిపైనా ఎలాంటి వివక్ష లేదని, దేశ ప్రజలందరినీ అభిమానిస్తానని చెప్పారు. ఎవరినీ కించపర్చే ఉద్దేశం లేదన్నారు. ‘‘ప్రజాప్రయోజనాల కోణంలోనే ఎన్నికల ప్రచారంలో ప్రసంగించా. అది నా విధి’’ అని తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నిందితుడు గతంలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, ఎవరి నుంచీ క్షమాభిక్ష కోరలేదని, ఆయనకు తక్కువ శిక్ష విధించాలని రాహుల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనను ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది ఖండించారు. రాహుల్‌ను గతంలో సుప్రీంకోర్టు మందలించిందని గుర్తుచేశారు. ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. చట్టప్రకారం పోరాడతాం: కాంగ్రెస్ సూరత్ కోర్టు తీర్టుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అప్పీల్ దాఖలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘పిరికిపంద, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై, ప్రతిపక్షాలపై కక్షగట్టింది. ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తున్నందుకు, అదానీపై అంశంపై జేపీసీ నియమించాలని డిమాండ్ చేస్తున్నందుకు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. రాజకీయ ప్రసంగాలపై కేసులు పెట్టడం చాలా దారుణం. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు తమవైపే చూపిస్తాయని బీజేపీ నేతలు తెలుసుకోవాలి. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాం. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. చట్ట ప్రకారమే పోరాడుతాం’’ అని ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ భయపడే ప్రసక్తే లేదు: ప్రియాంక తన సోదరుడు రాహుల్ గొంతును నొక్కేయడానికి మోదీ ప్రభుత్వం సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తోందని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు. రాహుల్ గతంలో ఏనాడూ భయపడలేదని, భవిష్యత్తులోనూ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సత్యమే మాట్లాడుతాడని ట్వీట్ చేశారు. దేశ ప్రజల కోసం గొంతెత్తుతూనే ఉంటారని పేర్కొన్నారు. రాహుల్‌కు కేజ్రీవాల్ మద్దతు రాహుల్‌ను పరువు నష్టం కేసులో ఇరికించడం దారుణమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీయేతర నాయకులు, పార్టీలపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ట్వీట్ చేశారు. వారిని కేసుల్లో ఇరికించడం ద్వారా నిర్మూలించడమే ఉద్దేశమన్నారు. సత్యమే నా మార్గం: రాహుల్ సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ స్పందిం చారు. ‘‘సత్యం, అహింసపైనే నా మతం ఆధారపడి ఉంటుంది. సత్యమే నా దైవం. ఆ దైవాన్ని చేరుకొనే మార్గమే అహింస’’ అంటూ మహాత్మాగాంధీ చెప్పిన సూక్తిని ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర యోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. సత్యం, ధైర్యసాహసాలే ఆలంబనగా మాతృదేశం కోసం నిర్భయంగా పోరాడడాన్ని ఆ మహనీయుల నుంచి నేర్చుకున్నామన్నారు. క్షమాపణ చెప్పాలి: బీజేపీ రాహుల్ గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేïపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇతరులను దూషిస్తే శిక్ష తప్పదని చెప్పారు. రాహుల్‌కు జైలుశిక్ష విధించడంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఎవరినైనా దూషించడానికి రాహుల్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. ఇతరుల పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. అమిత్ షాకు సమన్లు ఇవ్వండి సీబీఐ డైరెక్టర్‌కు జైరాం రమేశ్ లేఖ న్యూఢిల్లీ: ‘‘మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా సర్కారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సమన్లు జారీ చేయండి. అవినీతికి సబంధించిన వివరాలు ఆయన నుంచి సేకరించండి’’ అని సీబీఐని కాంగ్రెస్ పార్టీ కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైస్వాల్‌కు లేఖ రాశారు. ‘‘సంగ్మా ప్రభుత్వ అవినీతి గురించి తెలిసే షా ఆరోపణలు చేశారు. దానిపై చర్యల నిమిత్తం వివరాలు సేకరించండి’’ అని కోరారు. ఏమిటీ కేసు? 2019 ఏప్రిల్ 13న కర్నాటకలోని కోలార్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించారు. ‘దొంగలందరి ఇంటి పేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అని అన్నారు. మోదీ సామాజికవర్గం పరువుకు రాహుల్ నష్టం కలిగించారంటూ గుజరాత్‌లోని సూరత్ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ విజ్ఞప్తి మేరకు విచారణ సూరత్‌లో జరగకుండా విధించిన స్టేను గుజరాత్ హైకోర్టు గత ఫిబ్రవరిలో తొలగించింది. అనర్హత వేటు పడుతుందా? ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన రాజకీయ నాయకుడిపై శిక్ష ఖరారైన తేదీ నుంచి మిగిలిన పదవీ కాలమంతా అనర్హత వేటు పడుతుంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడు. అయితే, అనర్హత వేటు వెంటనే పడదని సుప్రీంకోర్టు లాయర్ మహేష్ జెఠ్మలానీ చెప్పారు. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం మూడు నెలల గడువు ఇవ్వొచ్చని తెలిపారు. ఈ సమయంలో నేరారోపణ లేదా శిక్షపై అప్పిలేట్ కోర్టు స్టే ఇస్తే అప్పీల్‌పై విచారణ ముగిసే దాకా అనర్హత వేటు కూడా ఆగిపోతుందని వివరించారు. మూడు నెలల్లోగా నేరారోపణ లేదా శిక్ష రద్దు కాకపోతే దోషిపై అనర్హత వేటు వేయొచ్చని పేర్కొన్నారు. శిక్షను రద్దు చేసే అధికారం శిక్ష విధించిన కోర్టుకు కాకుండా అప్పిలేట్ కోర్టుకే ఉంటుందన్నారు. రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షను అప్పిలేట్ కోర్టు రద్దు చేయొచ్చని, అదే జరిగితే అప్పీల్‌పై విచారణ ముగిసేదాకా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని మహేష్ జెఠ్మలానీ వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే శిక్షను అప్పిలేట్ కోర్టు రద్దు చేయడమో లేదంటే నేరారోపణపై స్టే విధించడమో జరగాలని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది చెప్పారు. రాహుల్ గాంధీకి అప్పిలేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. 2013 నాటి లిలీ థామస్, 2018 నాటి లోక్ ప్రహరి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఆయన గుర్తుచేశారు. ప్రజాప్రతినిధుల శిక్ష రద్దయితే అనర్హత వేటు కూడా రద్దవుతుందని అప్పట్లో న్యాయస్థానం తేల్చిచెప్పిందని వివరించారు. -
రాహుల్ గాంధీకి పదవీ గండం తప్పదా?
సాక్షి వెబ్‌డెస్క్: ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో.. మోదీ ఇంటి పేరును ప్రస్తావించి చేసిన వ్యాఖ్యలు అంతిమంగా రాహుల్ గాంధీకి చిక్కులు తెచ్చిపెట్టాయి. నాలుగేళ్ల కిందట ఆయనపై నమోదైన పరువు నష్టం కేసులో(Criminal Defamation Case) .. ఇవాళ(గురువారం) రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది గుజరాత్ సూరత్ కోర్టు. అయితే ఆ వెంటనే బెయిల్ మంజూరు చేయడంతో పాటు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసుకునేందుకు ఆయనకు 30 రోజుల గడువు ఇచ్చి కాస్త ఊరట అందించింది. ఇక తీర్పు వెలువడిన వెంటనే మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ.. సత్యమే నా దేవుడు, అహింస దానిని పొందే సాధనం అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. అలాగే.. కాంగ్రెస్ కీలక నేతలు, పార్టీ శ్రేణులు సైతం రాహుల్ గాంధీకి సంఘీభావంగా స్టేట్మెంట్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. ఏం జరగనుందంటే.. బెయిల్ దక్కించుకున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ముప్పై రోజుల్లోగా తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయొచ్చు. అయితే.. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష పడితే మాత్రం.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. ఈ లెక్కన రాహుల్ గాంధీకి పదవీ గండం పొంచి ఉందనే చెప్పొచ్చు. మరోవైపు ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం.. క్రిమినల్ డిఫమేషన్ కేసు( నేరపూరిత పరువునష్టం దావా) కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడడం అనేది చాలా అరుదైన సందర్భమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ తనకు పడిన శిక్షకు అప్పీల్‌కు గనుక వెళ్లపోతే ఆయన ఎంపీ పదవినీ కోల్పోవాల్సి వస్తుంది. అయితే.. పరిస్థితి అంతదాకా రాదని, ఆయన తీర్పును అప్పీల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించినా.. ఆదేశాల(జైలు శిక్ష విధింపు) నిలుపుదలకు నిరాకరించినా సరే.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఏం జరిగిందంటే.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. కర్ణాటక కోలార్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. మోదీ ఇంటి పేరుతో ఉన్నవాళ్లంతా.. అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ, సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా.. గత వారం ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది సూరత్ కోర్టు. ఇక ఇవాళ(గురువారం) రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుకుగానూ స్టేట్మెంట్ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్‌లో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు కూడా. రాహుల్ టార్గెట్ చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీని అని, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీని కాదని, కాబట్టి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది వాదించారు. అయితే చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ మాత్రం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్ పరువుకు భంగం కలిగించేవని తేల్చి.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. ఇదీ చదవండి: అప్పటిదాకా పోటీచేయను! -
Modi Surname: రాహుల్ గాంధీకి కోర్టులో ఎదురుదెబ్బ.. రెండేళ్లు జైలు శిక్ష
సూరత్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. రెండేళ్లు జైలు శిక్ష విధించింది. గురువారం ఈమేరకు తీర్పునిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటక కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అనే ఎందుకు ఉంది? అని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ మాట్లాడారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ అనంతరం రాహుల్‌ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును రాహుల్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది. -
బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం!
సంచలనం సృష్టించిన హజిరా బాలిక హత్యాచార కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నిందితుడు సుజిత్ సాకేత్‌ను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా(గుజరాత్) కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువరించిన జడ్జికి.. కోర్టు హాల్లోనే చేదు అనుభవం ఎదురైంది. జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ సుజిత్‌కు ప్రత్యేక(పోక్సో) న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన వెంటనే నిందితుడు సుజిత్ సాకేత్ కోపంతో ఊగిపోయాడు. తన కాలి చెప్పులను తీసి జడ్జి పీఎస్ కళ మీదకు విసిరాడు. అయితే ఆ చెప్పులు జడ్జి మీద పడలేదు. ఆయనకు కాస్త ముందున్న సాక్షి బోనులో పడ్డాయి. దీంతో న్యాయమూర్తి కంగుతినగా.. పోలీసులు వెంటనే సుజిత్‌ను అదుపు చేశారు. Special POCSO Judge P.S. Kala ఇదిలా ఉంటే జడ్జి పీఎస్ కళ గతంలోనూ పోక్సో నేరాలకు సంబంధించి సంచలన తీర్పులెన్నింటినో వెలువరించారు. త్వరగతిన తీర్పులు వెలువరిస్తారని ఆయనకు పేరుంది. గతంలోనూ ఓ కేసులో నిందితుడిని ‘చచ్చే వరకు జైళ్లోనే మగ్గాలి’ అంటూ తీర్పు ఇచ్చారు. పలు కేసుల కోసం ఆయన అర్ధరాత్రిళ్లు సైతం విచారణలు కొనసాగించడం విశేషం. ఇదిలా ఉంటే హజిరా ఉదంతంలో బాధితురాలు ఐదేళ్ల బాలిక. ఆమె ఓ వలస కార్మికుడి కుటంబానికి చెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్ వలస మీద హజిరాకు వచ్చి.. ఆ కుటుంబం పక్కనే ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చాక్లెట్ ఆశ చూపించి..ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను హతమార్చాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కేసు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. ఘటన తర్వాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో 26 మంది సాక్షులను విచారించారు. మరోవైపు కోర్టు కూడా 53 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను పరిశీలించాకే తుది తీర్పు వెలువరించింది. ఇక తుదితీర్పు సందర్భంగా గుమిగూడిన జనాలు.. నిందితుడిని అక్కడికక్కడే ఉరి తీయాలంటూ నినాదాలు చేయడం విశేషం. -
నేను ఏ తప్పూ చేయలేదు: రాహుల్ గాంధీ
సూరత్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. తాను ఏ తప్పూ చేయలేదని విచారణ సందర్భంగా కోర్టుకు రాహుల్ తెలిపారు. న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేకుండా శాశ్వత వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ అభ్యర్థనపై నిర్ణయాన్ని డిసెంబర్ 10న తెలియజేస్తామన్న కోర్టు.. ఆ రోజు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్‌కు మినహాయింపు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగలంతా మోదీలే ఎందుకవుతారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు సహజంగా ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువునష్టం దావా వేశారు. -
వాట్సప్ ద్వారా కోర్టు సమన్లు
గాంధీనగర్, సూరత్ : భారత న్యాయ వ్యవస్థ చర్రితలో తొలిసారి ఓ కోర్టు సామాజిక మాధ్యమం (వాట్సప్) ద్వారా ఓ వ్యక్తికి సమన్లు జారిచేసింది. గుజరాత్‌లోని సూరత్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో బాధితుడి న్యాయవాది అభ్యర్ధన మేరకు వాట్సప్ ద్వారా సమన్లు పంపింది. వివరాలు... సూరత్‌కు చెందిన ఓ టీ కప్స్ వర్తకుడు 2017లో రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ హోల్ సెల్ వ్యాపారి వద్ద టీ కప్స్ కొరకు ఆర్డర్ ఇచ్చాడు. సరకు సరఫర చేసేందుకు అడ్వాన్స్‌గా లక్షా ముఫై వేలు చెల్లించాడు. ఎనిమిది నెలలు గడిచినా సరుకు పంపక పోవడంతో తాను చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. దానికి అంగీకరించిన వ్యాపారి చెక్ రూపంలో నగదు చెల్లించాడు. తనకు వేసిన చెక్ బౌన్స్ అయిందని, ఆ విషయంపై వ్యాపారితో చర్చిద్దాం అనుకున్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందన లేకపోవడంతో తనకు న్యాయం చేయవలసిందిగా సూరత్‌లోని అదనపు న్యాయ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మూడు సార్లు సమన్లు పంపినా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో న్యాయవాది అభ్యర్ధన మేరకు వాట్సప్ ద్వారా సమన్లు జారిచేసింది. తన అభ్యర్ధన మన్నించి దేశంలోనే మొదటిసారిగా వాట్సప్ ద్వారా కోర్టు సమన్లు పంపిందని భాదితుడు తరుఫున న్యాయవాది అశ్విన్ జోగడియా తెలిపారు. -
హార్దిక్‌కు మళ్లీ చుక్కెదురు
సూరత్: దేశద్రోహం కేసులో పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన సూరత్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పటేళ్లకు ఓబీసీ కోటాలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గుజరాత్ కు చెందిన హార్ధిక్ పటేల్ పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని లేవదీసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమం ఆందోళన కరంగా మారి ఘర్షణలకు తావిచ్చింది. ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. ఆయనపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, ప్రత్యేకంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు అవసరం అయితే ప్రాణాలు తీయాలని వ్యాఖ్యానించి ఆందోళనకారులను రెచ్చగొట్టాడు. ఉద్యమకారులారా ఆత్మహత్యలు వద్దు అవసరం అయితే పోలీసులను చంపేయండి అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి గత నెల 16న లప్ పోర్ జైలులో వేశారు. దీంతో ఆయన సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. కానీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అక్టోబర్ నుంచే హార్ధిక్ పై దేశ ద్రోహం కేసులు పలు చోట్ల నమోదయ్యాయి.