న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు(సోమవారం) సూరత్(గుజరాత్) కోర్టును ఆశ్రయించనున్నారు. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లేందుకు ఆయనకు కోర్టు నెల వ్యవధి ఇవ్వగా.. ఇవాళ ఆయన అప్పీల్‌కు వెళ్లనున్నారు.
సూరత్ సెషన్స్ కోర్టులో ఇవాళ రాహుల్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయనున్నారు. పరువునష్టం కేసులో మెజిస్ట్రేట్ విధించిన శిక్షను పక్కనపెట్టాలంటూ ఆయన అప్పీల్ చేయనున్నారు. అంతేకాదు.. తన శిక్షపై తాత్కాలిక స్టే ఇవ్వాలని, తద్వారా లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దొరుకుతుందని ఆయన పిటిషన్‌లో కోరే అవకాశం కనిపిస్తోంది.
ఈ మేరకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ నేలతో కలిసి ఆయన సూరత్ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment