conviction
-
వైట్‌హౌస్ కేసు.. సాయివర్షిత్‌కు 8 ఏళ్ల జైలు శిక్ష
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌పై దాడికి యత్నించిన భారత సంతతి యువకుడు కందుల సాయివర్షిత్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతనికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు డిస్ట్రిక్ కోర్టు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ శిక్ష ఖరారు చేశారు. అంతేకాదు.. సాయివర్షిత్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక మరో మూడేళ్లపాటు అతనిపై నిఘా కొనసాగనుందని తెలిపారాయన. గ్రీన్‌కార్డు కలిగి శాశ్వత నివాసితుడు కావడంతో కందుల ఈ శిక్షలు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్(Whitehouse)పై సాయివర్షిత్ దాడికి యత్నించాడు. అయితే ఆ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అతను యత్నించినట్లు తేలింది. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను చంపడానికి కూడా తాను వెనుకాడలేదని విచారణలో సాయి ఒప్పుకున్నాడు. బైడెన్ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు యూఎస్ అటార్నీ ఇదివరకే ప్రకటించింది. నిజానికి ఈ కేసులో కిందటి ఏడాది ఆగస్టు 23న శిక్ష ఖరారు కావాల్సి ఉండగా.. అది ఆలస్యమైంది. 2023 మే 22న సాయి వర్షిత్ కందుల(Sai Varshith Kandula) అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్ వద్ద బీభత్సం సృష్టించాడు. అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్ , ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు. ఉద్దేశపూరితంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యూఎస్ అటార్నీ తెలిపింది.కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం.. మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. దీంతో పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా ప్లాన్‌తో..ఈ దాడి కోసం చాలా కాలం నుంచే ప్లాన్ చేసుకున్నట్లు సాయి వర్షిత్ విచారణలో తెలిపాడు. 2022 ఏప్రిల్‌లో వర్జీనియాలోని ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థను సంప్రదించి 25 మంది సాయుధ సిబ్బంది, సాయుధ కాన్వాయ్ కావాలని కోరాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇతర కంపెనీలను సంప్రదించాడు. ఓ పెద్ద కమర్షియల్ ట్రక్కును అద్దెకు తీసుకునేందుకు యత్నించాడు. అవి కుదరకపోవడంతో చివరకు ఓ చిన్నపాటి ట్రక్కును రెంట్‌కు తీసుకుని దాడికి పాల్పడ్డాడు.ఎవరీ కందుల సాయి వర్షిత్?మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ది అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబం. అతనిది తెలుగు నేపథ్యంగా తెలుస్తున్నప్పటికీ.. ప్రాంతం వివరాలపై స్పష్టత లేదు. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టున్న అతడు.. డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా తెలిసింది. కాగా.. ఇంతకు ముందు అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. -
డొనాల్ట్ ట్రంప్ ఓడిపోయి ఉంటేనా..
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఈలోపు ఆయనకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ గనుక ఓడిపోయే ఉంటే.. ఆయనకు కచ్చితంగా శిక్ష పడేదని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మంగళవారం ఓ నివేదిక రిలీజ్ చేసింది.స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్(Jack Smith) నివేదిక ప్రకారం.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్దేశపూర్వకంగానే ఆయన అసత్య ప్రచారాలకు దిగారని, తద్వారా శాంతియుతంగా అధికార మార్పిడికి భంగం కలిగించారని అభియోగాలు నమోదయ్యాయి. దీనిని తీవ్ర నేరంగా స్పెషల్ కౌన్సల్ జాక్ స్మిత్ పరిగణించారు. అంతేకాదు.. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను తన అబద్ధాలతో ట్రంప్ భ్రష్టు పట్టించే యత్నమూ చేశారనే పేర్కొన్నారు. ట్రంప్‌పై అభియోన్నింటికి సరైన ఆధారాలున్నాయి. ఒకవేళ ట్రంప్ కిందటి ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గనుక ఓడిపోయి ఉంటే.. ఈ నేరాలకుగానూ కచ్చితంగా శిక్ష పడేది అని ఆ నివేదిక స్పష్టం చేసింది.అయితే అర్ధరాత్రి విడుదలైన ఈ నివేదికను ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తప్పుబట్టారు. జాక్ స్మిత్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉంటే.. 2020 ఎన్నికల వ్యవహారంపై గతంలో ట్రంప్ మీద స్మిత్ అనేక ఆరోపణలను నమోదు చేశారు. ట్రంప్‌పై నమోదైన రెండు ఫెడరల్ క్రిమినల్ కేసులను ఆయనే పర్యవేక్షించారు.అయితే ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఆయన ట్రంప్‌పై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. తన నివేదిక బహిర్గతం అయ్యే సమయంలోనే తన పోస్టుకు సైతం రాజీనామా చేయడం గమనార్హం. -
సర్వేలో ట్రంప్ కు షాక్.. ఏ శిక్ష పడనుంది..?
-
పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ‘నర్మదా బచావో’ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేధాపాట్కర్ను పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. పాట్కర్ దోషిగా తేలిన పరువు నష్టం కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో ఫైల్ చేశారు. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు నేతృత్వం వహించేవారు. పాట్కర్ గుజరాత్లో ‘నర్మదా బచావో’ ఆందోళన్‌కు నాయకత్వం వహించేవారు.ఈ క్రమంలోనే పాట్కర్, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై పాట్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సక్సేనా క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం ఢిల్లీ సాకేత్ కోర్టు పాట్కర్‌ను దోషిగా తేల్చింది. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరటనిచ్చింది ఇస్లామాబాద్ హైకోర్టు. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ళ జైలు శిక్షను నిలిపివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. తోషఖానా అవినీతి కేసులో ట్రయల్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అమిర్ ఫరూఖ్, న్యాయమూర్తి తరీఖ్ మహమూద్ జహంగిరిలతో కూడిన డివిజన్ బెంచ్ తోషఖానా కేసులో ఉత్కంఠతకు తెరదించుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన మూడేళ్ళ జైలుశిక్షను నిలిపివేసింది. 2018 నుండి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై దేశ సంపదను అక్రమంగా అమ్ముకున్నారన్న నేరంపై పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో మరో ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా వీల్లేదని తెలుపుతూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆ తీర్పును నిలిపివేయడంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించినట్లయింది. ఇది కూడా చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాం«దీకి ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్లో కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ శుక్రవారం తోసిపుచ్చారు. ఆ శిక్షను నిలుపుదల చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అన్నారు. ‘‘రాహుల్ గాం«దీపై 10కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేయడానికి తగిన కారణాలు ఏమీ లేవు’’అని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు రాహుల్ గాం«దీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. రాహుల్ గొంతు నొక్కేయడానికి కొత్త టెక్నిక్కులు : కాంగ్రెస్ గుజరాత్ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాహుల్ అన్నీ నిజాలు మాట్లాడుతూ ఉండడంతో ఆయన గొంతు నొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నిక్కులు ఉపయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేయడం తీవ్ర అసంతృప్తికి లోను చేసిందని, కానీ తాము ఊహించిన తీర్పే వచి్చందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ రాజకీయ కుట్రలకు ఎవరూ భయపడడం లేదన్నారు. పార్లమెంటులో రాహుల్ గొంతు నొక్కేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించిన ఖర్గే రాహుల్ గాంధీ న్యాయం కోసం , నిజం కోసం తన పోరాటం కొనసాగిస్తారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఇలాంటి తీర్పు రావడం పట్ల తమకు ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ వంటి రాష్ట్రం నుంచి న్యాయం జరుగుతుందని మేము ఎలా భావిస్తాం. ఈ తీర్పులు రాసేవారు, కోర్టుల్లో పిటిషన్లు వేసేవారంతా ఒక్కటి గుర్తు ఉంచుకోవాలి. రాహుల్ లాంటి నాయకుడిని ఏ తీర్పులు , అనర్హత వేటులు ఆపలేవు’’అని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకం చేసే మిషన్ నుంచి రాహుల్‌ని అడ్డుకునే శక్తి దేనికీ లేదన్నారు. పరువు తీయడం కాంగ్రెస్‌కు అలవాటే: బీజేపీ గుజరాత్ హైకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతించింది. ఇతరుల పరువు తీయడం , వారిని దూషించడం కాంగ్రెస్‌కు తరతరాలుగా వస్తున్న ఒక అలవాటేనని ఆరోపించింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై క్షమాపణ కోరడానికి రాహుల్ నిరాకరించడం ఆయనకున్న అహంకారాన్ని సూచిస్తుందని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఇలాగే ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాహుల్ గాం«దీకి విధించిన శిక్ష అత్యంత కఠినమైనదని అంటున్న వారంతా అంత కఠినమైన నేరాన్ని ఆయన ఎందుకు చేశారో సమాధానం ఇవ్వాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బెయిల్
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేశారు. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తనను దోషిగా తేల్చూతు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. అలాగే తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కూడా కొట్టివేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. రాహుల్ గాంధీ ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను అదే రోజు చేపడతామని చెప్పింది. దీంతో తీర్పుపై స్టే వస్తుందనుకున్న రాహుల్‌కు నిరాశే ఎదురైంది. రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు తీర్పుపై స్టే విధిస్తే ఆయనపై ఎంపీగా అనర్హత వేటు తాత్కాలికంగా తొలగిపోనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. సూరత్ కోర్టకు రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వెళ్లారు. ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు కూడా రాహుల్‌తో పాటు ఉన్నారు. #WATCH | Gujarat: Congress leader Rahul Gandhi, accompanied by senior Congress leaders and CMs arrives in Surat. pic.twitter.com/jNbFe1KF8u — ANI (@ANI) April 3, 2023 2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయనకు సంఘీభావం తెలిపాయి. చదవండి: కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడ్డ నాయకులు.. -
Rahul Gandhi: సోదరితో పాటు సూరత్ కోర్టుకు..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు(సోమవారం) సూరత్(గుజరాత్) కోర్టును ఆశ్రయించనున్నారు. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లేందుకు ఆయనకు కోర్టు నెల వ్యవధి ఇవ్వగా.. ఇవాళ ఆయన అప్పీల్‌కు వెళ్లనున్నారు. సూరత్ సెషన్స్ కోర్టులో ఇవాళ రాహుల్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయనున్నారు. పరువునష్టం కేసులో మెజిస్ట్రేట్ విధించిన శిక్షను పక్కనపెట్టాలంటూ ఆయన అప్పీల్ చేయనున్నారు. అంతేకాదు.. తన శిక్షపై తాత్కాలిక స్టే ఇవ్వాలని, తద్వారా లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దొరుకుతుందని ఆయన పిటిషన్లో కోరే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ నేలతో కలిసి ఆయన సూరత్ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు కూడా. -
మాకే పాఠాలు చెప్తున్నారా? కేంద్రంపై సీరియస్
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అబూ సలేం జైలు శిక్ష వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు, కేంద్ర హోంశాఖపై, హోం శాఖ సెక్రటరీపై మండిపడింది. కేంద్ర మంత్రిత్వ శాఖ అభ్యర్థనను తొందరపాటుగా అభివర్ణిస్తూనే.. నిర్ణయాత్మకంగా కేంద్రం వ్యవహరించడం మంచిదికాదని గురువారం అత్యున్నత న్యాయస్థానం మందలించింది. అభ్యర్థన పిటిషన్‌పై ఏం చేయాలో హోం సెక్రటరీ మాకు చెప్పే ప్రయత్నంగా అఫిడవిట్‌ను చూస్తే అనిపిస్తుంది. ఆయన మాకు చెప్పడం కాదు. అది అర్థం చేసుకోండి. మేం ఏం చేయాలో అది చేస్తాం. సమస్యను సరైన సమయంలో పరిష్కరించమని మాకు చెప్పడానికి హోం కార్యదర్శి ఎవరు?. అసలు హోం మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్లో.. ‘ఇది సరైన సమయం కాదు’ అనే లైన్‌ను ఎందుకు చేర్చారు అని అభ్యంతరం వ్యక్తం చేశారు జస్టిస్ ఎస్కే కౌల్. 1993 బాంబే పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అబూ సలేంని.. పోర్చుగల్ నవంబర్ 11, 2005లో బారత్‌కు అప్పగించింది. ఆ సమయంలో 25 ఏళ్లకు మించి జైలు శిక్ష విధించబోమని పోర్చుగల్ న్యాయస్థానాలకు భారత్ చెప్పింది. ఆ మాట ప్రకారం.. 2030, నవంబర్ 10న శిక్షా కాలం ముగుస్తుంది. అయితే తన శిక్షాకాలం ఒప్పందానికి విరుద్ధంగా ఉందంటూ సలేం సుప్రీం కోర్టులో అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తరపున కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా.. మంగళవారమే ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు చర్య అవుతుందని ఓ లైన్లో పేర్కొన్నారాయన. అబూ సలేం పిటిషన్‌పై స్పందించడానికి ఇంకా సమయం ఉందని, ఇది సరైన సమయం కాదని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఇది న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. న్యాయవ్యవస్థకు ఉపన్యాసాలు ఇవ్వవద్దు. మీరు నిర్ణయించుకోవాల్సిన విషయాన్ని నిర్ణయించమని మీరు మాకు చెప్పినప్పుడు మేము దానిని దయతో పరిగణనలోకి తీసుకోం. సరైన సమయం కాదని మీరెలా చెప్తారు.. అని జస్టిస్ ఎస్కే కౌల్, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై మండిపడ్డారు. ఇక 2017లో అబూ సలేంను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది ఇక్కడి న్యాయస్థానం. ముంబైలో 1993 మార్చి 12న రెండు గంటల వ్యవధిలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 257 మంది దుర్మరణం చెందగా.. 700 మంది గాయపడ్డారు. చదవండి: ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే!. సుప్రీంలో.. -
ఉరితో రేప్‌లకు చెక్!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు భారత రాష్ట్రపతి కూడా తిరస్కరించడంతో నలుగురుకి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా నిర్భయ తల్లి ఆశాదేవీని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. నేరస్థులకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ గత ఏడేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున ఆశాదేవీ క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదు. పైపెచ్చు ఉరిశిక్ష వల్ల తనకు న్యాయం జరిగిందంటూ ఆమె సంతప్తి కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. రేప్‌లకు ఉరిశిక్షలు అమలు చేయాలంటూ ఆందోళనలు చేస్తున్న సామాజిక కార్యకర్తలంతా స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలు కూడా జరుపుకోవచ్చు. అసలు ఉరిశిక్షల వల్ల మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయా ? అన్నది ప్రస్తుతం ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. నిర్భయ అత్యాచారం, హత్య సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగిన నేపథ్యంలో దారుణమైన అత్యాచార సంఘటనల్లో ఉరిశిక్షలు విధించేందుకు వీలుగా కేంద్రం 2013లో చట్ట సవరణ తీసుకొచ్చింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం 2015 నుంచి 2017 మధ్య దేశంలో 31 శాతం మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. ఎక్కువ కేసుల్లో మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం హత్యలు చేశారు. ఇది అంతకుముందు చాలా అరుదుగా జరిగేది. బాధితురాలు బతికుంటే తమకు మరణ శిక్షలు పడే అవకాశం ఉందన్న భావంతోనే ఈ హత్యలు జరిగాయని న్యాయ నిపుణులు విశ్లేషించారు. వీటికన్నా అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగితేనే సానుకూల ప్రభావం ఉంటుందని, శిక్షలు కఠినం అవుతున్న కొద్దీ విచారణ ప్రక్రియ చాలా జాప్యం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2018లో జరిగిన అత్యాచార కేసుల్లో 85 కేసుల్లో చార్జిషీట్లు నమోదు కాగా, వాటిలో శిక్షలు పడేవరకు వెళ్లిన కేసులు కేవలం 27 శాతం మాత్రమే. పైగా అత్యాచార కేసుల్లో నేరస్థులు ఎక్కువగా పరిచయస్థులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారే ఉంటున్నారు. అపరిచితులు తక్కువగా ఉంటున్నారు. పరిచయస్థులు కనక కేసులవుతే మరణ శిక్షలు ఖాయమనుకొని సాక్ష్యాధారాల నిర్మూలనలో భాగంగా మహిళలను ఎక్కువగా హత్య చేస్తున్నారని సామాజిక విశ్లేషకులు తెలిపారు. నిర్భయ లాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు భావోద్వేగాలకు గురై కఠిన చట్టాల కోసం ఆందోళనలకు దిగడం సహజం. ప్రజల భావోద్వేగాలకు అనుకూలంగా న్యాయ నిర్ణేతలు చట్టాలు తీసుకరావడం ప్రమాదకరం. కఠిన చట్టాలే పరిష్కారమైతే నిర్భయ చట్టం తర్వాత హైదరాబాద్‌లో ‘దిశ’ దారుణ అత్యాచార, హత్య సంఘటన జరిగి ఉండేది కాదు. మరణ శిక్ష పడుతుందనే భయాందోళనలతోనే ఆ కేసులో నేరస్థులు దిశను కాల్చివేశారు. చదవండి : దోషులను క్షమించడమా... ఆ ప్రసక్తే లేదు! ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం -
నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ నిర్భయ తల్లి ఆశాదేవికి ఆసక్తికరమైన విన్నపాన్ని చేశారు. ఏడేళ్ల క్రితం తన కుమార్తె (నిర్భయ)పై సామూహిక హత్య చారం చేసిన వారిని క్షమించాలని ఆమె కోరారు. ఈ విషయంలో ఆమె పెద్దమనసు చేసుకోవాలని ఇందిరా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగాఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీని ఉదాహరణగా తీసుకోవాలని కోరారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబు ద్వారా హత్య చేసిన కేసులోనళినిని సోనియా క్షమించినట్టుగానే, నలుగురు దోషులకు కూడా ఆశాదేవి క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నామని జైసింగ్ ట్వీట్ చేశారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనకు పూర్తి మద్దతు తెలిపిన ఇందిరా మరణశిక్ష వద్దు.. ఉరి శిక్షలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నరాన్నవార్తలపై ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కోర్టులు, ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. అలాగే 2012లో నిర్భయ హత్యాకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, మహిళల భద్రత కోసం నినాదాలు చేసిన వ్యక్తులే, రాజకీయ ప్రయోజనం కోసం తన కుమార్తె మరణాన్ని వాడు కుంటున్నారని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయ లాభాల కోసమే ఉరిశిక్ష అమలును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయితే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దోషులను ఉరితీసే వరకు తనకు మనశ్శాంతి లేదంటూ కంట తడిపెట్టారు. ఈ నేపథ్యంలో ఇందిరాజైసింగ్ అభ్యర్థనను, ఆశాదేవి అంగీకరిస్తారా అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏం నేరమూ చేయని తన కుమార్తెను అతికిరాతంగా హత్య చేసిన వారికి మరణ శిక్షే న్యాయమంటూ.. ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన ఆమె ఇపుడు హంతకులను క్షమిస్తారా? పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి, క్షమించడమనే ఉదాత్తమైన నిర్ణయం తీసుకుంటారా... లేదంటే..దేశవ్యాప్తంగా ఎందరో ఆడబిడ్డల కన్నతల్లులకు తీరని కడుపుశోకాన్ని మిగిల్చుతున్న వారికి ఇదే న్యాయమంటారా? వేచి చూడాలి కాగా 2012 డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధానిలో కదిలే బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిత్య హత్యాచారానికి పాల్పడిన కేసులో వినయ్, అక్షయ్, పవన్, ముకేశ్ అనే నలుగురు దోషులుగా (ఒక దోషి జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో దోషి మైనర్ కావడంతో శిక్షనుంచి మ తప్పించుకున్నాడు) నిర్దారించారు. సుదీర్ఘ విచారణ, న్యాయపరంగా అన్ని అడ్డంకులను అధిమించిన అనంతరం ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. చదవండి : ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం While I fully identify with the pain of Asha Devi I urge her to follow the example of Sonia Gandhi who forgave Nalini and said she didn’t not want the death penalty for her . We are with you but against death penalty. https://t.co/VkWNIbiaJp — Indira Jaising (@IJaising) January 17, 2020 -
నాకు ఆ నమ్మకం ఉంది!
ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులున్నారు. వారిలో ఒకరు భక్తిపరుడు. ప్రతిరోజూ పూజ చేసేవాడు. పూజలో భాగంగా దేవుడికి రకరకాల పండ్లను, పదార్థాలను నైవేద్యంగా సమర్పించి, అందులో ఒక ఫలాన్నో, ఆహార పదార్థాన్నో ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేవాడు. రెండోవ్యక్తికి దైవం అంటే నమ్మకం ఏ మాత్రం లేదు. ఒకరోజు ఇతను వచ్చేటప్పటికి దైవభక్తుడైన మిత్రుడు దేవుడికి నైవేద్యం పెడుతున్నాడు. అది చూసి నాస్తిక మిత్రుడు ఎగతాళిగా ‘‘నువ్వు రోజూ దేవునికి నైవేద్యం పెడుతున్నావు. ఆ పండు నువ్వు పెట్టిన చోటే ఉంటోంది. దానిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. దీనిని బట్టి నీకిష్టమైన వాటిని దేవుని పేరు చెప్పి, ఆయన ముందుపెట్టి, ఆనక నువ్వే తింటున్నావు. నువ్వు చేసేది పొట్ట పూజే కానీ దైవపూజ కాదు’’ అంటూ నవ్వాడు. అందుకు ఆ భక్తుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు. ‘‘గీతలో కృష్ణుడు– భక్తులు భక్తితో తనకు పువ్వు, పండు లేదా కనీసం నీటిని సమర్పించినా, దానిని తాను స్వీకరిస్తానన్నాడు. దానిని బట్టే నేను సమర్పించేదానిని ఆయన తప్పక తీసుకుంటాడన్న భావనతో ప్రతిరోజూ నైవేద్యం పెడుతున్నాను. ఆయన సర్వశక్తి మంతుడైనందువల్ల ఆ ఫలాన్ని లేదా పదార్థాన్ని పూర్తిగా అదృశ్యం చేయవచ్చు లేదా దానిని వినియోగించినా కూడా అలాగే ఉండేటట్లు చేయగలడు. నాకు సంబంధించినంతవరకు భగవంతుడు ఆరగించిన తరువాత మిగిలిన ఫలాన్నే నేను ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నేనొక చిన్న ప్రశ్న అడగవచ్చా?’’ అన్నాడు. ‘‘సరే, అడుగు’’ అన్నాడు నాస్తిక మిత్రుడు. ‘‘మనం రోజూ వార్తాపత్రికలు చదువుతాం కదా, అందులోని అక్షరాలు ఏమైనా మాయం అవుతున్నాయా?’’ అనడిగాడతను. ‘‘లేదు. అయినా, అలా ఎలా మాయం అవుతాయి?’’ అనడిగాడితను. ‘‘అవి మాయం కాకుండానే వాటి సారం మీకు తెలుస్తోందా లేదా? ఇదీ అంతే అని ఎందుకనుకోవు? మరో విషయం– ఈ మధ్య నీ అభిమాన నటుడు ఒకతను మన ఊరికి వచ్చినప్పుడు మీరందరూ ఆయనకు పూలదండలు వేశారు. తనకు వేసిన దండల్లో ఒకదానిని ఆయన తిరిగి నీకే ఇస్తే, సంతోషంతో తీసుకున్నావా లేదా? అలాగే ఆయన కొన్ని పూలదండలను తన అభిమానుల మీదికి విసిరితే అందరూ ఆనందించారా లేదా? నీ అభిమాన నటుడు తనకు వేసిన పూలదండలన్నింటినీ తన దగ్గర ఉంచుకోక పోయినా మీరు పూలదండలు వేయడం మానుకున్నారా? అలాగే నేను చిత్తశుద్ధితో దేవునికి నైవేద్యం సమర్పించి, దానిని ప్రసాదంగా స్వీకరిస్తున్నాను.?’’ అన్నాడు. అంగీకార సూచకంగా తల ఊపాడు నాస్తిక మిత్రుడు. – డి.వి.ఆర్. -
సోలాంగ్
నైట్ డ్యూటీలో ఉన్నాడు సోలాంగ్. రాత్రి పదకొండు అవుతుండగా తన ఫ్లోర్‌లోంచి పైఫ్లోర్లోని ఆఫీస్ డైనింగ్ హాల్లోకి వెళ్లాడు. దేనికైనా అందరూ ఒకేసారి వెళ్లిరావాలనే ‘హాఫేనవర్ బ్రేక్’లు ఉండే ఆఫీస్ కాదది. ‘ఎప్పుడెలా చస్తారో మీ ఇష్టం. ఇన్ టైమ్‌లో వర్క్ ఫినిష్ అయితే చాలు..’ అన్నట్లుంటాయి అక్కడి రూల్స్ అన్నీ.నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు రోజూ అదే టైమ్‌కి భోజనానికి లేస్తాడు సోలాంగ్. అప్పటికైనా ఆకలి కొరికేస్తోందని అతడు లేవడు. ఇంటి నుంచి ఏవో రెండు గిన్నెలు తెచ్చుకుంటాడు. అవి ఖాళీ చేయడం కోసం లేస్తాడు. ఆ గిన్నెలు కూడా అతడు పెట్టించుకుని తెచ్చుకున్నవి కావు. భార్య పెట్టిస్తే తెచ్చుకున్నవి. ఆ గిన్నెల్లో ఏం పెట్టావని అతడెప్పుడూ ఆఫీస్‌కు బయల్దేరే ముందు గానీ, ఆఫీస్‌కి వచ్చాక గానీ భార్యను అడగలేదు. కొత్తల్లో ఒకసారి అతడు అడక్కుండానే భార్యే చెప్పింది.. పై గిన్నెలో మీకిష్టమైన బంగాళదుంప వేపుడు, చల్ల మిరపకాయలు ఉన్నాయని. ఆమె అలా చెప్పినప్పుడు.. అతడన్నమాట.. ‘ఏదైతేనేం.. నోట్లోనే ఉండిపోయేదా! కడుపులోకి వెళ్లేదే కదా’ అని! ఆ లాజిక్ ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజు నుంచీ గిన్నెల్లో ఏం పెట్టిందీ చెప్పడం మానేసింది. అప్పుడే ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఏదో ఒకటి తినడం తప్ప, ఏదైనా ఒకటి తినాలని తన భర్తకు ప్రత్యేకంగా ఏమీ ఉండదని. అలాగని అతడికి ఇష్టమైనవి చేసి గిన్నెల్లో సర్దడం మానలేదు ఆమె. తనకు ఇష్టమైనవి ఇష్టంగా తింటున్నానన్న స్పృహైతే లేకుండా అతడు తినేసేవాడే కానీ, ఆమె మాత్రం పూర్తి స్పృహతో అతడు ఏవైతే ఇష్టంగా తింటాడో అవి మాత్రమే చేసి గిన్నెల్లో పెట్టేది. క్యారియర్ తెరిచాడు సోలాంగ్. పెద్ద కంపెనీకి తగినంత పెద్ద డైనింగ్ హాల్ అది. ఓ యాభై వరకు టేబుల్స్ ఉంటాయి. సోలాంగ్ వెళ్లేటప్పటికి అవన్నీ ఖాళీగా ఉన్నాయి. సోలాంగ్ ఆ టైమ్‌కే డైనింగ్ హాల్‌కి రావడానికి అదొక కారణం. ఎవరూ ఉండరు. తనొక్కడే ఉంటాడు. ఒక్కడే కూర్చొని తింటూ ఆలోచనల్లో పడిపోవడం అతడి అలవాటు. ఆలోచనల మధ్య తింటుంటాడు తప్ప, తింటూ మధ్య మధ్య ఆలోచించడు. ఇంట్లో కూడా అంతే. ఎదురుగా భార్య కూర్చొని ఉన్నా.. తన ఆలోచనల్ని తను తింటుంటాడు. ఆమెతో మాట్లాడడు. కొంచెం పెట్టమనీ, ఇంక చాలనీ అనడు. భర్త ఏం తిన్నాక ఏం తింటాడో, ఏది ఎంత తింటాడో పెళ్లయిన ఆ మూడేళ్లలోనూ పెద్ద పీహెచ్‌డీనే చేసింది ఆమె. డైనింగ్ హాల్లో ఒక్కడే తింటున్నాడు సోలాంగ్. అతడు తింటుంటే.. ఎప్పటిలాగే అతడిని ఆలోచనలు కొరుక్కుతింటున్నాయి. సోలాంగ్ ఎప్పుడూ ముగ్గురి గురించి ఆలోచిస్తుంటాడు. దేవుడు.. దెయ్యం.. మనిషి!ఈ ముగ్గురి మధ్య ఉండే సంబంధమే అతడి నిరంతర ఆలోచన. సోలాంగ్ తింటూ ఉంటే.. (ఆలోచిస్తూ ఉంటే).. డైనింగ్ హాల్లోకి ఎప్పుడొచ్చాడో గానీ ఓ వ్యక్తి నేరుగా సోలాంగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, ‘‘నేనూ మీతో కలిసి కూర్చోవచ్చా?’’ అన్నాడు తన క్యారియర్‌ను బయటికి తీస్తూ. సోలాంగ్ అతడివైపు మౌనంగా చూశాడు. ‘‘ఒక్కణ్ణే తినడం నాకు అలవాటు లేదు’’ అన్నాడు ఆ వచ్చిన అతను. ‘‘కానీ నాది ఐపోవచ్చింది. మధ్యలోనే లేచి వెళ్తాను’’ అన్నాడు సోలాంగ్. ఎలాగైనా అతడిని అక్కడ కూర్చోనివ్వకపోవడం సోలాంగ్ ఉద్దేశం. అతడు నవ్వాడు. ‘‘రెండు క్షణాల్లో తినేస్తాను. బహుశా మీకంటే ముందే తినేస్తానేమో కూడా’’ అన్నాడు. అతడి డబ్బాలవైపు చూశాడు సోలాంగ్. అవి రెండు క్షణాల్లో అయిపోయేలా లేవు.. అతడు దెయ్యమో, దేవుడో అయితే తప్ప! అదే మాట అన్నాడు కూడా.ఆ మాటకు పెద్దగా నవ్వాడు అతను. ‘‘రండి. కూర్చోండి’’ అన్నాడు సోలాంగ్. అతడి జీవితంలో ఒక వ్యక్తిని అలా తన టేబుల్ మీదకు ఇన్వైట్ చెయ్యడం అదే మొదటిసారి.‘‘మిమ్మల్ని ఆఫీస్‌లో చాలాసార్లు చూశాను. ఎప్పుడూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తుంటారు కదా’’ అన్నాడు అతను. సోలాంగ్ నవ్వాడు. ఆ ‘సుదీర్ఘత’నే ఇంగ్లిష్‌లోకి అనువదించి అతడికి ఆఫీస్‌లో అంతా సోలాంగ్ అనే పేరు పెట్టారని కూడా ఆ వచ్చినతనికి తెలుసు. అయితే ఆ మాట పైకి అనలేదు. ‘‘నా పేరు విశిష్ట’’ అన్నాడు.. తన గిన్నెలు ఓపెన్ చేస్తూ. ‘అవునా’ అన్నట్లు చూశాడు సోలాంగ్. ఆ తర్వాత కొద్దిసేపటికే వాళ్లిద్దరి టాపిక్.. దెయ్యాల మీదకు, దేవుడి మీదకు మళ్లింది! ‘‘నాకు ఈ దెయ్యాల మీద, దేవుళ్ల మీద, మనుషుల మీద నమ్మకం లేదు’’ అన్నాడు విశిష్ట. పెద్దగా నవ్వాడు సోలాంగ్. ‘‘కనీసం మీ మీదైనా మీకు నమ్మకం ఉండాలి కదా’’ అన్నాడు. ‘‘మీరన్నది నాకు అర్థమయింది. మీ ఎదురుగా ఉన్న నేను.. దెయ్యమో, దేవుడో, మనిషో కాకుండా ఇంకొకరు అవడానికి అవకాశమే లేనప్పుడు.. ఈ ముగ్గురిలో నేను ఎవరో.. ఆ ఎవరినోనైనా నేనునమ్మకపోవడం ఎలా సాధ్యమౌతుందనే కదా మీరు అనడం’’ అన్నాడు విశిష్ట. ‘అంతే కదా’ అన్నట్లు చూశాడు సోలాంగ్.‘‘కానీ సుధీర్.. ‘నాకు నమ్మకం లేదు’ అని నేను అన్నది ఆ ముగ్గురి ఉనికి గురించి కాదు. ఆ ముగ్గురినీ నేను విశ్వసించను అని’’ అన్నాడు విశిష్ట. అదిరిపడ్డాడు సోలాంగ్. అయితే ఆ అదురుపాటును దాచుకుంటూ.. ‘‘నా పేరు మీకెలా తెలుసు?’’ అన్నాడు. ‘‘మీ పేరు అదే అయినప్పుడు.. ఆ పేరేగా నాకు తెలుస్తుంది’’ అన్నాడు విశిష్ట. సోలాంగ్కి చాలా సంతోషం వేసింది. విశిష్ట తనకు ఆప్తుడిలా అనిపించాడు. తనని అతడు తనలాగే గుర్తించాడు. తన ‘సుదీర్ఘత’కు ఎలాంటి గుర్తింపునూ ఇవ్వకుండా. ఇద్దరి భోజనాలు పూర్తయ్యాయి. టాపిక్ మాత్రం పూర్తి కాలేదు. అది పూర్తయ్యేలా లేదనిపించి.. ‘‘ఇక నేను వెళ్తాను’’ అని పైకి లేచాడు విశిష్ట. సోలాంగ్ లేవలేదు.విశిష్ట లేచి, ఆ డైనింగ్ హాల్లోనే ఓ మూల.. మలుపులో ఉన్న సింక్ దగ్గరికి వెళ్లి గిన్నెల్ని కడుక్కుని, వాటిని మళ్లీ టేబుల్ దగ్గరకు తెచ్చి, టేబుల్ మీద ఉన్న లంచ్ బ్యాగ్‌లో సర్దుకుని కింది ఫ్లోర్‌లోకి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి ‘బై’అన్నట్లు సోలాంగ్ వైపు చెయ్యి ఊపాడు. సోలాంగ్ కూడా చెయ్యి ఊపాడు. సోలాంగ్కి, తిన్న తర్వాత గిన్నెలు కడిగే అలవాటు లేదు. వాటిని అలాగే లంచ్ బ్యాగ్‌లో పెట్టేస్తాడు. చేతులు కడుక్కోవడం తప్పదు కాబట్టి.. వాటిని మాత్రం కడుక్కుంటాడు. విశిష్ట వెళ్లిపోయాక కూడా, కొద్దిసేపు అలాగే కూర్చొని.. చేతులు ఎండిపోతున్నట్లుంటే అప్పుడు లేచి, సింక్ వైపు నడిచాడు సోలాంగ్. సింక్‌లో నీళ్ల చప్పుడు అవుతోంది! ట్యాప్‌ను సరిగా కట్టేయకుండా వెళ్లాడేమో విశిష్ట.. అనుకున్నాడు.మరో నాలుగడుగులు వేసి, మలుపు తిరిగి, సింక్ ఉన్న రూమ్‌లోకి వెళ్లాడు.నిజమే. లోపల ట్యాప్‌లోంచి నీళ్లు పడుతున్నాయి. అయితే అవి విశిష్ట తిప్పేసి వెళ్లడం వల్ల పడుతున్న నీళ్లు కాదు. ట్యాప్ తిప్పి విశిష్ట చేతులు కడుక్కుంటున్నప్పుడు పడుతున్న నీళ్లు!గుండె చిక్కబట్టుకుని ఒక్కసారిగా అక్కణ్ణుంచి డైనింగ్ హాల్ బయటికి పరుగులు తీశాడు సోలాంగ్. ఆ తర్వాతెప్పుడూ అతడు ఆఫీస్ డైనింగ్ హాల్లో ఒక్కడే కూర్చొని తినలేదు. - మాధవ్ శింగరాజు -
అయ్యా.. మీరే గొప్ప!
అనగనగా ఓ జ్ఞాని. ఆయన రోజూ ఎవరికో ఒకరికి అన్నం పెట్టి గానీ తాను భుజించడు. దానిని ఓ నియమంగా చేసుకుని చాలా కాలంగా కొనసాగిస్తూ వచ్చాడు. ఓరోజు ఒక్క అతిథీ రాలేదు. వీధి అరుగుమీద కూర్చుని చాలాసేపు నిరీక్షించాడు. దేవుడా, ఈరోజు ఎవరూ రాలేదు. ఏం చేయను.. ఒక్కడినే భుజించి నియమం తప్పాలా.. లేక ఉపవాసం ఉండనా.. అనుకుంటాడు.అయినా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అన్నం పెట్టి ఆ తర్వాత తాను తినాలనుకున్నాడు. అందుకని వీధిలోకి వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. ఇంతలో ఎదురుగా ఓ వ్యక్తి రావడం చూశాడు. జ్ఞానిలో పట్టరాని ఆనందం కలిగింది. అమ్మయ్య ఎవరో ఒకరు కనిపించారు చాల్లే అనుకున్నాడు మనసులో. అతనిని తన ఇంటికి వచ్చి భోజనం చేయమన్నాడు. అతను వచ్చాడు. అయితే ఆ వ్యక్తి పక్కా నాస్తికుడు. ఆ విషయం జ్ఞానికి తెలీదు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. జ్ఞాని అతనికి వడ్డిస్తూ దేవుడి గురించి స్మరించాడు. ఆ తర్వాత అతనిని దేవుడిని స్తుతించమన్నాడు. అయితే అతను తనకిలాంటి మూర్ఖత్వం పట్ల నమ్మకం లేదన్నాడు. ‘‘ఏంటీ అన్నం తినడానికి ముందు దేవుడిని స్తుతించడం మూర్ఖత్వమా’’ అడిగాడు జ్ఞాని.‘‘అసలు దైవారాధనే మూర్ఖత్వం’’ అన్నాడు నాస్తికుడు.ఇలా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. పైగా అతనన్నాడు...‘‘అన్నం పెడుతున్నది మీరు. కావాలంటే మీ గురించి ప్రార్థించమంటే ఎంతయినా ప్రార్థిస్తాను. అంతే తప్ప కనిపించని దేవుడి గురించి ప్రార్థించడం వొట్టి మూర్ఖత్వం‘‘ అని గట్టిగా చెప్పాడు. దాంతో వారి మధ్య వాదనలు మరింత పెరిగాయి.‘‘నాస్తికుడికి నేను అన్నం పెట్టను, పో‘‘ అన్నాడు జ్ఞాని.అప్పుడు అతను ‘‘నేనా వచ్చాను. మీరు రమ్మంటే వచ్చాను... మీరేదో అన్నం పెడుతున్నారు కదాని నా అభిప్రాయాన్ని మార్చుకోలేను’’ అని వెళ్ళిపోయాడు.అనంతరం జ్ఞాని నీరసించి పడుకుండిపోయాడు.అప్పుడు ఆయనకు కలలో కృష్ణుడు కనిపించాడు.‘‘నాయనా, అతనికి నా మీద నమ్మకం లేకపోవచ్చు. అది అతని ఇష్టం. అయినా నేను అతనిని ఏమీ అనలేదు. కానీ నువ్వు నీ అంతట నీవే అతనిని భోజనానికి రమ్మనమని చెప్పి ఇలా గొడవ పెట్టి పంపడం ఏమన్నా బాగుందా? నిన్ను నమ్మి అతనిని నీ దగ్గరకు పంపాను భోజనానికి. కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వతనిని పంపించేయడంతో నేనిప్పుడు అతనికి మరొక చోట అన్నం లభించే ఏర్పాటు చేయాలి.. ఏం చేయనూ.. చేస్తాను’’ అన్నాడు. ఈ కలతో జ్ఞాని నిద్ర లేచి వీధిలోకి పరుగులు తీశాడు. అతను ఓ చెట్టు కింద కూర్చుని ఉండడం చూశాడు. అతనిని భోజనానికి రమ్మనమని చెప్పాడు.అయితే అతను ‘‘నేను భగవంతుడిని వ్యతిరేకించే వాడిని. మీరు నన్ను పొమ్మనడం న్యాయమే. అందులో మీ తప్పేమీ లేదు. ఇప్పుడు మళ్లీ మీరొచ్చి నన్ను రమ్మంటున్నారేంటీ.. ఇంతలో ఏమైంది‘‘ అని అడిగాడు ఆ నాస్తికుడు.జ్ఞాని ఏం చెప్తాడు.. తనకు కలలో వచ్చిన కృష్ణుడి గురించి చెప్పాలా... చెప్తే అతను వింటాడా.. మళ్లీ గొడవకు దిగడూ.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్న ఆ జ్ఞాని.. తన జ్ఞానం, చదువుసంధ్యలు అన్నీనూమూట కట్టి పక్కన పెట్టి అతనితో ఇలా అన్నాడు –‘‘అయ్యా, మేము ఆస్తికులం. దేవుడు ఉన్నాడు అనడానికి మాకు ప్రత్యేకించి ధైర్యం అక్కర్లేదు. కానీ దేవుడు లేడని చెప్పడానికే అసాధారణమైన ధైర్యం ఉండాలి. మనసు గట్టి చేసుకోవాలి. అంతేకాదు, వైరాగ్యమూ ఉండాలి. ఆ విధంగా చూస్తే మీరే నాకంటే దృఢమైనవారు. నా కంటే ఉన్నతులు. మీకు అన్నం పెట్టడం నాకు గొప్పే’’ అన్నాడు జ్ఞాని. దాంతో అతను సరేనని జ్ఞాని వెంట అతనింటికి వెళ్లి భోజనం చేశాడు. అక్కడే విశ్రాంతి కూడా తీసుకున్నాడు. – యామిజాల జగదీశ్ -
అనగనగా ఒక రాత్రి
ఆమెను బస్సులో కలిశాను. జనంతో బస్సు కిక్కిరిసిపోయింది. సీటు కోసం వెతుకులాడే నా చూపులు తప్పించుకోవడానికి ఆమె అటూ ఇటూ చూస్తుండేది. ఆమె కాస్తంత పక్కకి జరిగితే అక్కడో మనిషి సర్దుకుని కూర్చునే స్థలం లభించింది. దూసుకుని వెళ్లి కూర్చున్నా, నన్ను తిట్టుకుంటున్న వారిని అంతగా పట్టించుకోలేదు. నా స్టాప్ రాగానే లేచి వెళుతూ ఏదో గొణిగాను థాంక్స్ అన్నట్టు! చీకటి పడింది. సన్నటి తుప్పర మొదలైంది. చలికాలంలోలానే వుంది, అట్టే జనసంచారం లేకుండా. దీనికి తోడు వీధి దీపాలు వెలగడం లేదు. ఇంటికి వెళ్లడం ఇప్పటికే ఆలస్యమైంది. మా వార్షికోత్సవానికి చీఫ్‌గెస్ట్ ముఖ్యమంత్రే. ఆయన రాక ఆలస్యం కావడంతో అన్ని కార్యక్రమాలు అనుకున్న దానికంటే ఆలస్యంగా జరిగాయి. అమ్మా, నాన్న ఎంతో కంగారు పడుతుంటారని తెలుసు. అందుకే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వీలయినంత వేగంగా వెళుతున్నాను. ఎవరో వెనకే వస్తున్నట్టు అనిపించింది. నన్ను నెమ్మదిగా వెళ్లమని ఎవరో అడుగుతున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. బస్సులో ఉన్న ఆమె కూడా బస్సు దిగి నేను వెళుతున్న వైపే వస్తోంది. ‘‘మేము కొత్తగా వచ్చాం. 173 క్వార్టర్లో ఉంటాం’’. నిజమే నిన్ననే ఆమ్మ చెప్పింది. ఇప్పుడు గుర్తొస్తోంది. మా యింటికి మూడిళ్ల అవతల ఇంట్లో ఎవరో కొత్తవారు వచ్చారని అంది. జల్లు పెద్దదయింది. మేం కొద్దిగా వేగంగా నడక సాగించాం.‘‘మీకు దయ్యాల మీద నమ్మకం వుందా?’’‘‘ఏమిటి?’’ నాకు బొత్తిగా ఇష్టంలేని అంశం ఇదే. అయినా ఈ చలిరాత్రి, వర్షం పడుతున్న రాత్రి అస్సలు పరిచయం లేని ఆమె ఈ ప్రశ్న వేసింది. వెనక్కి తిరిగి ఆమె వంక చూశాను. ఆమె చక్కగా నవ్వుతోంది. అంతే! వెంటనే కళ్ల ముందు రావ్ుసే బ్రదర్స్ హారర్ షోలో ఆడ డ్రాక్యులా ప్రత్యక్షమైంది. రాక్షసులు మామూలు మనుషుల్లానే వుంటారు. కానీ మనిషి రక్తాన్ని తాగేస్తారు. ఇంతకీ ఈమె డ్రాక్యులానా? ‘‘ఏంటి? బిక్కు బిక్కుమంటున్నావ్? కొంపదీసి దయ్యాలంటే భయమా?’’‘‘అవును. మరి నీకు?’’ అంటూ ఆమె వంక తిరిగి చూశాను. ఆమె లేదు. చుట్టూరా చూశాను. కానీ ఆమె చీకట్లో ఎటో వెళ్ళిపోయింది. చెప్పొద్దు.. క్షణంపాటు భయంతో వొణికిపోయాను. ఆ తర్వాత కొంత దూరం నుంచీ ఆమె సహాయం కోరుతూ పిలుస్తోంది. ఆమె కనిపించడం లేదు. మాట ఎలా వినపడుతోంది? ఇంతకీ ఆమె ఎవరు...రాక్షసా లేక మనిషి వేటలో ఉన్న దయ్యమా? నా చుట్టూ దయ్యాలు, భూతాలు ఉన్నట్టనిపించింది.అంతే! ఒక్కసారిగా భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి చూడకుండా పరుగు పెట్టాను నాన్నను చేరేవరకు. ‘‘ఏమైందిరా?’’ నాన్న నన్ను పట్టుకుని లోపలికి తీసికెళ్లారు. భయంతో, వొణుకుతో నోట మాట రాలేదు. అలసిపోయి అలా అమ్మ వొడిలో పడిపోయాను. ఏడుపు వచ్చేసింది. గట్టిగా ఏడ్చాను.‘‘నానీ... నానీ... ఏమైందీ?’’ నాన్న గట్టిగా పట్టుకుని అరుస్తున్నారు. అందులోనూ ఆందోళన.. భయం..‘‘దయ్యం..నేనిప్పుడే దయ్యాన్ని చూశాను. ఆమె బస్సులో వుంది.’’‘‘ఏమిటీ.. బస్సులో దయ్యం ఉందా?!’’ కళ్లద్దాలు పెట్టుకుని అమ్మ నా మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది.‘‘అవును. నాతోనే బస్సులో దిగింది. దయ్యాల గురించి అడిగింది. చీకట్లోకి మాయమైపోయింది. ఆమెనా శరీరం కోసం అడగడం వినిపించింది. మనిషి రక్తమాంసాల కోసం వెతుకుతున్న రాక్షసి ఆమె.’’ అసలే చీకటి, పైగా వర్షం, దానికి తోడు లోపలి భయం అన్నీ వెరసి నాపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అసలు అలా జరగడానికి అవకాశం వుందా అనే ఆలోచన ఎప్పుడో పోయింది.‘‘ఎలా తప్పించుకున్నానో నాకే తెలీదు. చాలా చిత్రంగా, భయంగానూ వుంది...’’ అలా చెబుతూనే వున్నాను. ఏది ముఖ్యమో తేల్చుకోలేకపోతున్నాను. దయ్యాన్ని కలిశానన్న భావన, లేదా భయం. ఈ కాలనీలో రాబోయే పది రోజుల్లో పెద్ద హీరో అయిపోతానన్న ఆందోళనా పట్టుకుంది.‘‘నువ్వు చెప్పేదంతా ఎక్కడ జరిగింది?’’ నాన్న ప్రశ్నల మీద ప్రశ్నలు.‘‘నారంగ్ అంకుల్ ఇంటి దగ్గరే’’‘‘ఆమె పడిపోయిందో ఏమయిందో నీకు స్పష్టంగా తెలుసునా?’’‘‘నేను అంతా వెతికాను.’’‘‘మరి మ్యాన్ హోల్?’’ నాన్నా, నేను ఒక్కసారే ఆశ్చర్యంగా అనుకున్నాం.‘‘నిజమే. ఇవాళ సాయంత్రమే నారంగ్ వచ్చి తనింటి దగ్గరున్న మ్యాన్ హోల్ పై చట్రాన్ని ఎవరో దొంగిలించారని చెప్పాడు’’ అమ్మ అంది. ‘‘నానీ... ఆ సంగతి...’’ అని నాన్న ఏదో అనబోయాడు. నన్ను తిట్టాలా, పడిపోయిందేమో అనుకుంటున్న ఆమెని రక్షించాలా అనే సందిగ్ధంలో కంగారు పడ్డారు. వెంటనే పరుగున బయటికి వెళ్లాడు. ఆయన వెంట నేనూ పరిగెట్టాను. అందరం ఒక్కసారి వెతకడం మొదలెట్టాం. అందరూ నన్ను కోపంగానూ చూడటం గమనించాను. అప్పటికే నారంగ్ అంకుల్, ఆయన భార్య టార్చి వెలుగులో ఆమెను రక్షించే యత్నాలు చేస్తున్నారు. మొత్తానికి నాన్నా, నారంగ్ అంకుల్ ఆమెను బయటికి తీసుకురాగలిగారు. ఆమె దెయ్యంలా లేదు. బట్టలంతా మురికి మురికి అయి అచ్చం మురికిలో దొర్లిన ఎలకపిల్లలా వుంది. ఆమె ‘ఎలక దెయ్యం’! ఆ ఆలోచనే చాలా తమాషా అనిపించింది. నవ్వొచ్చింది. కానీ అమ్మ చాలా కోపంగా చూసింది. పరిస్థితులు గ్రహించి మౌనంగా వున్నాను. అంతా నన్ను చాలా కోపంగా చూస్తున్నారు. కానీ వారంతా నా ఫాంటసీని ఎలా అర్థం చేసుకోగలరు! క్షమించమని ఏదో నసుగుతూ ఇవతలకి వచ్చేశాను. కానీ ఆ రాత్రి మూడు నిర్ణయాలు తీసుకున్నాను. కొత్తవారితో మాట్లాడకూడదని, హారర్ చిత్రాలు అస్సలు చూడకూడదని, భువనేశ్వర్ చీకటి దారుల్లో వెళ్లేటపుడు టార్చ్‌లైట్ తప్పనిసరిగా ఉంచుకోవాలని. ఒరియా మూలం : డాక్టర్ శ్రుతి మహాపాత్రో అనువాదం: టి. లలితప్రసాద్ -
నిర్భయ ఘటన : రివ్యూ పిటిషన్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటన నిందితులకు గతేడాది సుప్రీం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే 2017లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిర్భయ కేసులో దోషుల తరపు లాయర్లు గత మే నెలలో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్‌ను విచారించనుంది. ఇందుకు సంబంధించి సోమవారం(జూలై 9న) తీర్పు వెలువరించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. కాగా 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు బస్సులో నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్‌లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. -
ఏం దొరికినట్లు?
జీవిత రహస్యాలన్నీ సత్యాలేనని నమ్మే పని లేదు. వాటిలో నమ్మకాలు కూడా కొన్ని ఉంటాయి. గంపలో కలిసిపోయినట్లు గుట్టుగా అవన్నీ సత్యాలలో కలిసి ఉంటాయి. నమ్మకాలను సత్యాలను వేరు చేసే పని వల్ల ఎవరికీ ప్రయోజన లేదు. ఇవాళ్టి సత్యం నిన్నటి నమ్మకం కావచ్చు. నేటి సత్యం రేపటికి ఒట్టి నమ్మకంగా మిగలవచ్చు. సత్యమూ, వాస్తవమూ కాని అలాంటి ఒక ప్రపంచంలో జీవించడానికి, అలాంటి ఒక ప్రపంచాన్ని భరించడానికి మనిషి ఇష్టపడడు. కానీ తాత్వికత అంటుంది... మనిషి ఒక దశకు చేరాక ఏ ప్రపంచమైనా ఒక లెక్కకు రాదని! అంటే, ప్రపంచాన్ని దాని నెత్తిపై నుంచి చూసేందుకు వీలైన ఒక పెద్ద చెట్టుపైన... అనుభవం, విజ్ఞత అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేసి మనిషిని అతడి డెబ్బయవ యేటో, ఎనభయ్యవ యేటో లేపి కూర్చోబెడతాయని. నాకైతే నమ్మకం లేదు మనిషి ఎదుగుతాడని. జీవితపు ప్రారంభ సందర్భాలలో అతడికి నచ్చిన క్షణాలో, నచ్చని క్షణాలో ఏవో కొన్ని పోగుపడి ఉంటాయి. వాటితో ఒళ్లంతా చిక్కు ముడులు వేసుకుని అక్కడే సౌఖ్యంగా దుఃఖిస్తూనో, విషాదంలో సుఖిస్తూనో ఉండిపోతాడు. చివరికి అక్కడే ఒరిగిపోతాడు. అదే అతడి ఎదుగుదల. అదే అతడి ఉత్కృష్ట స్థితి. లేదా ఎదిగేందుకు ఇంకేమీ లేని స్థితి. అందుకే మన జీవితాన్వేషణలు రోజూ ఉదయాన్నే మొదలై, చీకటి పడేవేళకు ఇంటికి చేరుకుంటాయి. మధ్యలో ఏం దొరికినట్లు. బయల్దేరిన చోటికే రాకతప్పదన్న ఒక జీవిత సత్యమా? (ఇంగ్లండ్ కవి టి.ఎస్.ఇలియట్ స్వగతాల్లోంచి కొంత భాగం) -
ఎమ్మెల్సీ యండపల్లికి రెండేళ్ల జైలు
సాక్షి, చిల్లకూరు: విధి నిర్వహణలో ఉన్న సీఐను అడ్డుకుని అతనిపై దాడికి పాల్పడిన కేసులో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డితోపాటు మరో 10 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నె ల్లూరు జిల్లా గూడూరు అడిషనల్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఎన్.లావణ్య తీర్పు చెప్పారు. చిల్లకూరు ఎస్సై కె.శ్రీనివాసరావు కథనం మేరకు.. మండలంలోని అంకులపాటూరులో 2011 అక్టోబర్ 3న వీఎస్ఎఫ్ అనే కంపెనీ విద్యుత్ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయసేకరణ అప్పటి తహసీల్దార్ రోజ్‌మాండ్ అధ్యక్షతన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అప్పటి జేసీ సౌరభ్‌గౌర్ కూడా హాజరు అయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న పలువురు వ్యక్తులు విద్యుత్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడటంతో ఆ సమయంలో బందోబస్తు నిర్వహిస్తున్న అప్పటి గూడూరు పట్టణ సీఐ జె రాంబాబుపై పలువురు దాడిచేసి గాయపరిచారు. దీంతో అప్పట్లో నిందితులపై 143, 147, 148, 332, 447, 290 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, 12 మందిపై చార్జిషీట్ దాఖాలు చేశారు. ఈ కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో శుక్రవారం మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4,700 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో మరో నిందితుడు నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు విజయకుమార్ మృతి చెందడంతో మిగిలిన ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డి, ఎం.రాజేష్‌కుమార్, కె బాలయ్య, జాస్తి కిషోర్, టీహెచ్ కోటిరెడ్డి, కటికాల వెంకటేశ్వర్లు, సీహెచ్ అంజిరెడ్డి, వి వెంకటరమణయ్య, సీహెచ్ నాగరాజు, జి రామకృష్ణయ్య, కేవీ కృష్ణయ్య ఉన్నారు. -
క్రిస్మస్ అద్భుతం!
‘దూత పాటపాడుడీ.. రక్షకున్ స్తుతించుడి’క్వయర్ పాటక బృందం చర్చిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి కొందరు యువకులు చర్చిని అలంకరించే పనిలో ఉంటే, అమ్మాయిలు చర్చిని శుభ్రం చేస్తున్నారు. మాదేమంత చెప్పుకోదగ్గ చర్చి కట్టడం కాదు. సిమెంట్ రేకులు ఒక వైపు గోడనుంచి వాల్చారు. నిజానికి గుడిసె లాంటి చర్చి. మూడువైపులా గోడలు లేవు. ఖాళీ పాలిథిన్ బియ్యం బస్తాలను కుట్టి, వేలాడదీశారు గోడల్లాగ. అది ఒక చర్చి అనడానికి గుర్తుగా ముఖద్వారం పైన చెక్కతో చేసిన సిలువను బిగించడం! అంతా కలిసి ఒక బీదవాని చర్చి.ఖర్చు ఏమీ చేయలేదు. ఉన్నదానిలోనే తృప్తిపడాలి అని మా ఆయన.. అదే పాస్టర్ జోసెఫ్‌గారు చెప్పిన మాటలు ఎవరు వింటారు? పండుగ ఉత్సాహం యువకులది. వారు ఊరంతా తిరిగి, చందాలు వసూలు చేశారు. వీధుల్లో అక్కడక్కడ గుడిసెల మీద కాంతులీడుతున్న స్టారులను బట్టి ఇవి క్రైస్తవుల ఇళ్లు అని తెలుసుకోవచ్చు. నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద స్టారును ఏర్పాటు చేశారు.‘‘మమ్మీ.. మనమెప్పుడు షాపింగ్‌కు వెళ్తాం’’ అని ఆశగా అడుగుతున్న కూతురు రూతు, చిన్నవాడైన జేమ్స్‌లను చూసి, ఏమి చెప్పాలి బాధగా ఉంది. నాకు, మా ఆయనకు కొత్త బట్టలు లేకపోయినా ఫరవాలేదు. సర్దుకుంటాం. పిల్లలెలా సర్దుకుంటారు? అందునా మా చర్చి ఆడవారైన మెంబర్లు వారి కుటుంబానికి కొత్త దుస్తులు కొనుక్కుని, నాకు చూపించి, ఎలా ఉన్నాయి అమ్మగారు అంటుంటే.. బాగున్నాయి అనక తప్పలేదు. ఈ పండుగకు మా పిల్లలకేమి లేవు..? మేమున్నది నల్లగొండ జిల్లాలోని నెల్లికల్లు తండాలో. అంతా ఆటవిక ప్రాంతం! ఉన్న కొద్దిమంది విశ్వాసులు రైతుకూలీలు. ‘‘ఇక్కడే సేవ చేయాలని ప్రభువు నాకు చూపారు’’ అంటారు పాస్టర్ జోసెఫ్. అదే... మా ఆయన! ‘‘క్రైస్తవ వేదాంత విద్య చదివి, ఈ తండాలో సేవ ఎందుకు? హాయిగా మనకు దగ్గరగా ఉన్న నాగార్జున సాగర్లోనో, హాలియాలోనో సేవ చేస్తే బాగుంటుంది కదా’’ అని నేనంటే, ‘‘చూడు పూజా! ప్రభువు చూపిన స్థలంలోనే మనముండాలి’’ అంటారాయన. ఆదివారాలు చర్చికి వచ్చేవారే తక్కువ. వారు వేసే కానుకలు అంతంత మాత్రమే. ఒక్కోసారి ఐదురూపాయలు కానుకగా రావడం కష్టం. మా ఆయనకు కొంచెం వైద్యం తెలుసు కాబట్టి, సేవలోని భాగంగా పాత మోపెడ్ వేసుకుని పక్క తండాల్లో చిన్న చిన్న రోగాలకు మందులు, సూది వేయడంతో కొంచెం అదనపు డబ్బు.. బియ్యం, కూరగాయలు వస్తాయి. రాత్రి ప్రార్థనకు కూర్చున్నాం.‘‘పిల్లలు క్రిస్మస్కు కొత్త బట్టలంటున్నారు’’ అన్నాను ఆయనతో. ‘‘నీకు తెలుసుకదా! మనకు డబ్బులు రావు. ఏదో అద్భుతం జరిగితే తప్ప!! అయినా కొత్త బట్టలుంటేనే పండుగా? ఇప్పటి నుండే పిల్లలకు నేర్పాలి.. ప్రభువు సేవలో ఎన్ని కష్టాలుంటాయో! మనం భోజనం లేనప్పుడూ – ప్రభువు కోసం ఉపవాసాలున్నవి మరిచావా?’’ అన్నాడు పాస్టర్ జోసెఫ్‌గారు.‘‘అయినా..!’’ అన్నాను. పిల్లలు ఆతృతగా చూస్తున్నారు.‘‘రూతు.. నీవైనా అర్థం చేసుకో.. తమ్ముడు జేమ్స్ చిన్నవాడుగా.. అర్థం అయ్యేలా చెప్పు..’’ అన్నారాయన!‘‘అలాగే’’ అంది కూతురు రూతు మౌనంగా. జేమ్స్ మాత్రం రాజీపడ లేకపోతున్నాడు. ఎదురు తిరిగి గొడవ చేయాలని ఉంది. ఆ కళ్లలో నిరాశ స్పష్టంగా అగుపడుతుంది. ‘‘పిల్లలూ.. మీకు ఓ సంఘటన చెప్పనా? నీవు కూడా విను పూజా’’ అన్నారాయన మమ్మల్ని చూస్తూ...‘‘లేమన్ ఎలాంజిలికల్ ఫెలోషిప్ అనే సంస్థ వ్యవస్థాపకుడు జాషువా డానియేలు గారు. ఆయన తండ్రికూడా దేవుని సేవ చేసేవారు. ఆయనలో గొప్ప లక్షణం నేను ఈ రోజుకీ అమలు చేస్తున్నాను’’ అన్నారు పాస్టర్గారు.నేను నవ్వి, ‘‘చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత బీదవిశ్వాసులకో, సేవ చేస్తున్న సంస్థలకో మనీ ఆర్డర్ చేయడమేనా?’’ అన్నాను.‘‘అవును పాస్టరమ్మగారు! అదే నా పద్దతి అని నీకూ తెలుసు. కాసేపు ఆగి, అసలు ఏమయిందో చెప్పలేదు కదా’’ అని పిల్లల వైపు చూశారు. ‘‘చెప్పండి నాన్నా’’ అన్నారు వాళ్లు. నాన్న అని పిలిపించుకోవడమే ఆయనకు ఇష్టం.‘‘జాషువా గారు ఇలా తన పుస్తకంలో రాశాడు. ‘పిల్లలమైన మాకు.. మా నాన్న ఏనాడూ ఏదీ కొనిపెట్టేవారు కాదు. అమ్మకూ, మాకు పండుగకైనా బట్టలు కొనాలనే ధ్యాసే ఆయనలో ఉండేది కాదు. అంత డబ్బు కూడా ఉండేది కాదు. మా అమ్మానాన్నలు ప్రార్థన కూడికకు క్రిస్మస్ పండుగ సమీపిస్తుండటంతో.. పక్క ఊరు వెళ్లారు. పిల్లలం మేమే ఇంట్లో ఉన్నాం ఆడుకుంటూ. మా ఇంటికి డాడీ, మమ్మీ లేరా? అంటూ వచ్చింది ఒక డాక్టరమ్మ. ఆమె మా ఇంటికి తరచు ప్రార్థన కోసం వచ్చేది. తాను ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా, ఇంట్లో అన్నీ ఇబ్బందులు – చికాకులు– అనారోగ్యం! అనేకమైన సమస్యలు. మా డాడీ మంచి ప్రార్థనా పరులు. ఆయన ఈ డాక్టరమ్మ గూర్చి – చాలా సార్లు క్రమంగా ప్రార్థించేవారు. అలా ఆమె సమస్యలు కొద్దిగా మెరుగవసాగాయి. ఇది చూసి, ఆవిడ తరఫు బంధువులు, యేసయ్యను విశ్వసించి, చర్చికి వస్తున్నారు. ఏమిటన్నట్లుగా ఆమె వైపు చూశాం.. మా డాడీ, మమ్మీ పక్క ఊరికి ప్రార్థన కూటానికి వెళ్లారని చెప్పి. పిల్లలూ.. మీకు పండుగ బట్టలు తెచ్చాను. టైలర్ వస్తే, మీ కొలతలు ఇవ్వండి. రెండ్రోజుల్లో కుట్టి ఇస్తాడు. అతనికి డబ్బు ఇచ్చేశాను కుట్టడానికి అంది. మేమెంతో సంతోషించాం. ఈ పండుగకు మాకు కొత్త బట్టలు వచ్చాయని! మా డాడీ నిస్వార్థసేవ వల్ల పరలోకం నుండే దేవుడు ఇలా మాకు బహుమతి పంపారని ప్రభువుకు స్తోత్రం చెప్పాము.’ ఇదే ఆయన సాక్ష్యం.’’ ముగించారు పాస్టర్ గారు.అప్పటికే పిల్లలు నిద్రపోయారు సాంతం ఇది వినకుండానే! ‘‘నేను పొద్దున్నే పక్క తండాలో ఒక వ్యక్తికి ఇంజక్షన్ ఇవ్వాలి. జ్ఞాపకం చెయ్యి. నేను రేపటికి ప్రభువు వర్తమానం కొరకు సిద్ధపడతాను’’ అన్నారు నిద్రవస్తే, పడుకోమని!నిద్రరావడం లేదు. జాషువాగారి సాక్ష్యం విన్నాక ఎంతో ధైర్యం వచ్చింది. పాస్టరమ్మను అయినా– ఏదో విశ్వాసలోపం. జాషువా గారంటే, పెద్ద విశ్వాసుల కుటుంబం. యేసయ్య అలాంటి వారికి ఏది చేసినా యిస్తారు. మేము సామాన్యమైన సేవకులం! మా ఆయనది నిస్వార్థ సేవ. లోకం కన్నా ప్రభువునే అధికంగా ప్రేమిస్తారు. ఎన్నోసార్లు మేము పస్తులుండి, పిల్లలకు భోజనం పెట్టాం. యేసయ్యకు మేము గుర్తుకురామా? ‘ఆశీర్వాదాలన్నీ పెద్ద దైవజనులకే కాబోలు...’ నాలో కొంచెం అవిశ్వాసం. ‘నాకూ, మా ఆయనకు లేకున్న ఫరవాలేదు ప్రభూ – నా పిల్లలకు.. పండుగకు కొత్త బట్టలు ఇవ్వు తండ్రీ!’ ప్రార్థించాను. రూతు కొంచెం పెద్దది కాబట్టి అర్థం చేసుకుంటుంది. జేమ్స్ చిన్నవాడు – ఎలా నచ్చజెప్పాలి. నిద్రపోతున్న ఇద్దరినీ చూశాను. ప్రశాంతంగా ఉన్నాయి ముఖాలు. ఆ ప్రశాంతత నాకు ఎప్పుడొస్తుంది ప్రభువా?తెల్లవారక ముందే పాస్టర్ గారు పక్క ఊరు వెళ్లారు పాత మోపెడ్ మీద. అది చేసే శబ్దం యింకా వినబడుతూనే ఉంది మూల మలుపు వరకూ. మా ఆయన దగ్గర వైద్యం చేయించుకున్నవారు కొంచెం కొంచెంగానైనా డబ్బు సర్దితే సరి. పండుగ ఆనందంగా గడుస్తుంది అనుకున్నాను. సంఘపెద్ద మరియమ్మ వచ్చింది హడావుడిగా.‘‘పాస్టరమ్మగారూ! మేము పట్నం బోతున్నాం. మొన్న పెళ్లయింది చూడు.. రత్న, అల్లుడూ వచ్చారు. ముందు పండుగకు రమ్మంటే రానన్నారు. రాత్రే వచ్చిండ్రు. బట్టలు అవీ కొనాలి. పైకం ఎక్కడుంది? పదిరూపాయల వడ్డీతో షావుకారు దగ్గర రెండువేలు తీసుకున్నాం. మా ఆయన పత్తి ఏరడానికి పోయిండు’’ అంది గాబరాగా!‘‘మంచి పనేగా.. మిగతా పిల్లలకు కూడా కొను..’’ అన్నాను.‘‘చూస్తా.. ఎంతవుతుందో..’’ అంది లెక్కలు వేసుకుంటూ. ఇక్కడ బీదల పరిస్థితి అంతే. చేతిలో డబ్బు ఉండదు. అధిక వడ్డీకి జలగల్లా పీడించుకునే దళారులు. అవసరం వీరిది. అవకాశం వారిది.‘‘సర్లే! వెళ్లి త్వరగా రా.. చర్చి పనులన్నీ అలాగే ఉన్నయి’’ అన్నాను. ‘‘అలాగే సాయంత్రం మనోళ్లందరినీ రమ్మను. తలోపని జేస్తారు.’’ అన్నాను.‘‘నిర్మలమ్మకు, ఎస్తేరమ్మకు చెప్పా. వాళ్లు చూసుకుంటారులేమ్మ’’ అంది మరియమ్మ.మెల్లిగా నా వైపు తిరిగి, ‘‘పిల్లలకైనా బట్టలు కొన్నారా?’’ అంది.నేనేమి చెప్పలా– విశ్వాసం.. బాగుంది. ‘‘నిజానికి మన చర్చివాళ్లే పండుగకు మీ యింటివాళ్లకు కొత్త బట్టలు బెట్టాలా! అసలే కరువు. ఏం బెట్టి కొంటాం? వచ్చే పండుగకు చూత్తామమ్మా’’ అంది ఓదార్పుగా!కళ్లలో కన్నీరు తిరిగింది. దాచుకుందామనుకున్నాను. ‘‘బాధపడకమ్మా – మన ప్రభువు గొప్పోడు...’’ అంది దుఃఖంతో.నేను తేరుకుని.. ‘‘సర్లే.. నీవు వెళ్లు..’’ అన్నాను ఆమెను సాగనంపి. క్రిస్మస్ ముందు రోజు స్వస్థతా ప్రార్థనంటూ పక్క ఊరు వారు పాస్టర్ గారిని పిలిస్తే వెళ్లారు.. త్వరగానే వస్తానని! ఆయనకు తెలుసు చర్చిలోని పనులన్నీ నేనే చూసుకుంటానని!ఆయన బయటకు వెళ్లాక.. పాత మోపెడు శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఏమి జరుగదు. పండుగ వస్తుంది. వెళ్లిపోతుంది. అలాగే అనుకున్నాను. ఏం జరుగుతుంది. ఏమీ జరుగదు– అలా మనస్సు నిబ్బర పరచుకున్నాను.‘‘అమ్మా..!’’ అంటూ వచ్చింది రూతు. ‘‘తమ్ముడెక్కడా?’’ అన్నాను. ‘‘చర్చిలో ఉన్నాడు’’ అంది. ‘‘నీకో విషయం చెప్పాలి అమ్మా’’ అంది. ‘‘ఏమిటో అది!’’ అడిగాను. ఎక్కడ కొత్త బట్టలు అంటుందేమోనని!‘‘అమ్మా! నాకు.. నాకు లేకున్నా పరవాలేదు. తమ్ముడికైనా కొనండి..’’ అంది రూతు ఏడ్చేస్తూ.బిత్తరబోయాను. పిల్లను దగ్గరకు తీసుకొని ఏడ్చేశాను తనివితీరా! సిగ్గనిపించింది. నా భర్త మంచి విశ్వాసి. నేను ఇంత అపనమ్మకస్తురాలినా?ఎంత సామాన్య స్త్రీనైనా.. పాస్టరమ్మను. ‘‘లేదు రూతు.. మనకు కొత్త బట్టలు వస్తాయి.’’ అన్నాను ధైర్యంగా. అదీ ఒక అబద్ధం అని తెలిసీ. ఎలా వస్తాయి? సాయంకాలం... మోపెడ్ శబ్దం వస్తూంది. ఆయన వస్తున్నారు అనుకున్నాను, చదువుతున్న బైబిల్ పక్కన బెట్టి. ఆయన స్నానం చేసి, వచ్చాక భోజనం పెట్టాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను మౌనంగా ఉండిపోయాను. భోజనం అయ్యాక చర్చిపనులు ఎంత వరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. పిల్లల గూర్చి అడిగితే చర్చిలో ఉన్నారన్నాను. ‘‘సరే నేను చర్చిపనులు చూస్తాను..’’ అని చర్చిలోకి వెళ్లిపోయారు. చీకటిపడుతుండగా.. ఏదో వాహన శబ్దం. మా మోపెడ్ది కాదు. అది శబ్దం చేస్తూ చర్చి ముందే ఆగింది.‘‘జోసెఫ్ అయ్యగారు..’’ అంటూ వచ్చాడు టౌన్ చర్చిమెంబర్ మోషేగారు. చర్చిలోకి వెళ్లాను. మోషే చేతిలో పెద్ద పార్సిల్ ఉంది. ‘‘అయ్యా.. పొద్దున్నే వచ్చింది పార్సిల్ మీ పేరున. మా పాస్టర్గారు వెంటనే ఇచ్చిరమ్మంటే తెచ్చాను’’ అని పార్సిల్ టేబుల్ మీద పెట్టి, ‘‘నేను వెళ్తాను..చర్చిలో పనులున్నాయి’’ అన్నాడు వెళ్లిపోతూ.‘‘టీ అయినా తాగి వెళ్లవోయ్’’ అన్నారు జోసెఫ్‌గారు, నా వైపు టీ చెయ్యమని సైగ చేస్తూ.‘‘వద్దొద్దు.. వెళ్లాలి. అయ్యగారు, అమ్మగారు.. మీకూ, పిల్లలకు, సంఘానికి క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అని అందరికీ కరచాలనం చేసి వెళ్లిపోయాడు. మిగిలింది మేమే. పార్సెల్ వైపే చూస్తున్నామంతా. నేను, రూతు, జేమ్స్ ఆత్రంగా చూస్తున్నాం. జోసెఫ్‌గారు చాలా నిబ్బరంగా ఉన్నారు. ‘‘క్రిస్మస్కు ఏమైనా బైబిల్స్ పంపించి ఉంటారు ఎవరో’’ అంటూ పార్సిల్ కత్తిరించారు. అందులో ఓ తెల్ల కాగితం. గట్టిగా చదివారు పాస్టర్ గారు...‘‘జోసెఫ్ అ య్యగారు.. పాస్టరమ్మగారూ.. మీ పిల్లలు, సంఘానికి క్రిస్మస్ శుభములు. ఇవి క్రిస్మస్ బహుమతిగా స్వీకరించండి.’’ పాస్టర్ సునీల్ అని ఉంది. పాస్టర్ సునీల్ అంటే.. మా ఆయనతో బాటు థియాలజికల్ కాలేజీలో చదువుకొని, హైదరాబాద్‌లో పెద్ద చర్చికి పాస్టర్‌గా ఉన్నారు. కాలేజీలో అతనికి మా ఆయన చాలా సహాయం చేశారు. వేదాంత విద్య అభ్యాసంలో..!పార్సిల్ తెరిచారు.. అందరి కుతూహలం గమనించి!అందమైన బ్లూ కలర్ ఫ్రాక్ ప్యాకెట్ – పైన రూతుకు అని రాసి ఉంది. ఎగిరి గంతేసింది రూతు. జేమ్స్‌కు మరో ప్యాకెట్– అందులో అందమైన సూట్. సరిగ్గా సరిపోయాయి ఇద్దరికీ!మా యిద్దరికీ కొత్త బట్టలు– నాకు శారీ, ఆయనకు తెల్లరంగు ప్యాంటు, షర్టు!లోన పెద్ద అక్షరాలతో ప్రింటైన కొత్త బైబిల్ సేవకి!నా ముఖం చేతులతోకప్పుకొని ఏడ్చేశాను నా అవిశ్వాసానికి...!‘‘నన్ను క్షమించు ప్రభూ’’ అన్నాను.‘‘ఎందుకు? కొత్త బట్టలు వచ్చాయనా?’’ అన్నారు జోసెఫ్ గారు.‘‘కాదు. ప్రభువు మనలను జ్ఞాపకం ఉంచుకున్నందుకు’’ అన్నాను. -
విశ్వాసాన్ని కోల్పోతున్నారా?
సెల్ఫ్ చెక్ ఒక్కసారి మనల్ని మనం నమ్మితే అద్భుతాలు సృష్టించవచ్చు, మనకు కావలసిన ఎలాంటి అనుభూతులనైనా సాధ్యం చేసుకోవచ్చు.ఇది జరగనప్పుడు? ఏదైనా సాధించగలను అనుకోవటం మరుక్షణం డీలా పడిపోవటం... వల్ల మనశ్శాంతి ఉండదు. దేనినీ నమ్మక, ఎవరిపై నమ్మకం ఉంచక చివరికి వారినివారే ద్వేషించుకుంటూ తమపై విశ్వాసాన్ని కోల్పోయేవారు ఏదీ సాధించలేరు. అయితే దీనిని అధిగమించటం, మీ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవటం కష్టమేమీ కాదు. 1. మీ పనుల్లో అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకుంటారు. అహానికి తావివ్వరు. ఎ. అవును బి. కాదు 2. ‘‘నువ్వు దేనికీ పనికిరావు, నువ్వు సరిగా పనిచేయటం లేదు’’ ఇలా మిమ్మల్ని ఎవరైనా నిరుత్సాహపరిస్తే ఎలాంటి ఒత్తిడికి లోనవ్వరు. ఎ. అవును బి. కాదు 3. హడావిడి పడరు, ప్లాన్డ్గా ఉంటారు. ప్రతిచిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మీకిష్టం ఉండదు. ఎ. అవును బి. కాదు 4. మిమ్మల్ని ఇబ్బందిపెట్టే సమస్యలను గుర్తు చేసుకొని నోట్ చేసుకుంటారు. వాటిని ఎలా పరిష్కరించవచ్చో, మార్గాలు అన్వేషిస్తారు. ఎ. అవును బి. కాదు 5. అసంబద్ధమైన వాటిని నమ్మాలంటే అనుమాన పడతారు, కానీ మీ నమ్మకంపై అనుమానం పెంచుకోరు. ఎ. అవును బి. కాదు 6. దార్శనికతను ఏర్పరచుకుంటారు. దానికోసం కావలసిన ఇన్‌పుట్స్‌ను పొందుతారు. మీ విజన్కున్న ప్రతికూల అంశాలను గుర్తించగలరు. ఎ. అవును బి. కాదు 7. విజన్‌ను ఏర్పరచుకొని అంతటితో వదిలేయరు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మోటివేట్ అవుతారు. మీరనుకున్నది సాధించలేమని అనుకోరు. ఎ. అవును బి. కాదు 8. మీ విశ్వాసాన్ని నీరుకార్చే ఆలోచనలు వస్తే వాటిని ఆహ్వానిస్తారు. తర్వాత వాటిని పాజిటివ్‌గా మరల్చుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 9. కొన్ని సందర్భాల్లో, నమ్మకాన్ని కోల్పోవటం మీకు మాత్రమే జరగదని, ఇలా ప్రతివ్యక్తిలో జరుగుతుందని అనుకుంటారు. అందుకే దీనిని కామన్ ప్రాబ్లమ్‌గా నిర్వచిస్తారు. ఎ. అవును బి. కాదు 10. ప్రయత్నించడమంటే మీకిష్టం. మీరు ట్రై చేసిన మొదటిసారే మీరనుకున్న ఫలితం రావాలని ఆశించరు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీ విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోరు. విశాలదృక్పథంతో, ఆప్టిమిజంతో పనులను చేస్తుంటారు. దీనివల్ల మంచి ఆరోగ్యం మీ సొంతమవుతంది. ఇబ్బందిపెట్టే ఆలోచనలను దరిచేరనివ్వరు. ‘బి’ లు ఆరు దాటితే మనశ్శాంతితో ఉండరు. జీవితంలో ఎలా ఆనందించాలో, సమస్యలపై ఎలా స్పందించాలో మీకు తెలియదు. మీ నిరాశావాదానికి ఇకనైనా చెక్ చెప్పండి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా తీసుకోవటంతోపాటు ఆత్మవిశ్వాసం ఎలాపొందాలో తెలిపే పుస్తకాలూ చదవండి. ఆశావాదులతో స్నేహం చేయండి. ఆల్ ద బెస్ట్. -
చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు శిక్ష
భీమవరం టౌ¯ŒS : రెండు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిసే్ట్రట్ జి.షణ్ముఖరావు తీర్పు చెప్పారని టూటౌ¯ŒS పోలీసులు గురువారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. మూడు కాసుల బంగారపు బ్రాస్లెట్ పోయిందని ఈ ఏడాది మే 2న, 12న జరిగిన రెండు చోరీ ఘటనలపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీలకు పాల్పడింది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దొండపల్లి ఏసుకుమార్ అని గుర్తించి అరెస్ట్ చేశారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
హోమో సెక్సువల్స్ కు క్షమాపణ చెప్పనున్న దేశం!
మెల్ బోర్న్: స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించి అందుకు శిక్షగా 15 ఏళ్ల కాలాన్ని విధించినందుకు గాను.. మంగళవారం ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ అధికారి డానియెల్ ఆండ్రూస్ పార్లమెంట్ లోఅధికారికంగా క్షమాపణ చెప్పనున్నారు. ఇందుకోసం గతంలో జైలు శిక్షను అనుభవించిన కొంతమంది స్వలింగసంపర్కులను పార్లమెంటులోనికి అనుమతించనున్నారు. ఇలా కొంతమంది స్వలింగసంపర్కులను పార్లమెంటులోనికి అనుమతించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వం 1981 నుంచి స్వలింగసంపర్కానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి గే, లెసిబియన్స్ లపై లింగ వివక్ష కారణంగా నమోదు చేసిన కేసులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం వివరాలను సేకరిస్తోంది. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక గ్రూప్ కు చెందిన వారికి క్షమాపణ తెలపడం ఇది మొదటిసారేం కాదు. 2008లో ఆస్ట్రేలియా అప్పటి ప్రధానమంత్రి కెవిన్ రుడ్ ఫెడరల్ గవర్నమెంట్ తరఫున ఐస్ లాండ్ లలో నివసించే ఆస్ట్రేలియన్లకు క్షమాపణ తెలిపారు. -
అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం కాబట్టే యాకుబ్ ను ఉరి తీస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేవలం ముస్లిం అయినందు వల్లే యాకుబ్ మెమన్ ఉరిశిక్ష విధించారన్నారు. అతని పిటిషన్ పరిశీలించకుండా, అసలు యాకూబ్ ను ఎలా ఉరి తీస్తారని ఒవైసీ నిలదీశారు. రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ నేతల అండ ఉందన్నారు. అందుకే వారు యావజ్జీవ శిక్షలతో బతికిపోయారని, కానీ ముస్లిం మతస్థుడైన యాకూబ్‌ను ఆదుకునేవారే కరువయ్యారన్నారు. ఒక వేళ నేరస్తులను ఉరి తీయాలనుకుంటే, మతాన్ని ఆధారంగా చేసుకుని వారికి మరణ శిక్షలు విధించొద్దని ఆయన కోరారు. ఒక మతాన్ని టార్గెట్ చేయడం సమంజసం కాదన్నారు. కాగా 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన యాకుబ్ మెమన్‌కు టాడా కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా మెమన్ క్షమాభిక్ష పిటీషన్‌ను తిరస్కరించారు. ఇటీవల శిక్షనుతగ్గించాల్సిందా యెమెన్ పెట్టుకున్న పిటిషన్ కూడా సుప్రీం తిరస్కరించడంతో ఈ నెల 30న నాగపూర్ జైల్లో అతణ్ని ఉరి తీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. . ఈ సమయంలో ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
నేనే తప్పూ చేయలేదు: వీణామాలిక్
దుబాయ్: పాకిస్థాన్ కోర్టు తనకు 26 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై నటి వీణామాలిక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 26 ఏళ్ల జైలు అంటే జీవితఖైదు విధించినట్టేనని ఆమె పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానాలపై తనకు నమ్మకముందని తెలిపారు. తుది తీర్పులో తనకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. తానేమీ తప్పు చేయలేదని ఆమె పేర్కొంది. దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ యో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రె హ్మాన్, నటి వీణామాలిక్, ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయిష్టా వాహిదిలకు 26ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పు చెప్పింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. -
రుణమాఫీ హామీ తప్పుల తడక:జ్యోతుల నెహ్రు