చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు శిక్ష
Published Fri, Nov 11 2016 2:38 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
భీమవరం టౌ¯ŒS : రెండు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిసే్ట్రట్ జి.షణ్ముఖరావు తీర్పు చెప్పారని టూటౌ¯ŒS పోలీసులు గురువారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. మూడు కాసుల బంగారపు బ్రాస్‌లెట్ పోయిందని ఈ ఏడాది మే 2న, 12న జరిగిన రెండు చోరీ ఘటనలపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీలకు పాల్పడింది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దొండపల్లి ఏసుకుమార్ అని గుర్తించి అరెస్ట్ చేశారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
Advertisement
Advertisement