ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరటనిచ్చింది ఇస్లామాబాద్ హైకోర్టు. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ళ జైలు శిక్షను నిలిపివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.
తోషఖానా అవినీతి కేసులో ట్రయల్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అమిర్ ఫరూఖ్, న్యాయమూర్తి తరీఖ్ మహమూద్ జహంగిరిలతో కూడిన డివిజన్ బెంచ్ తోషఖానా కేసులో ఉత్కంఠతకు తెరదించుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన మూడేళ్ళ జైలుశిక్షను నిలిపివేసింది.
2018 నుండి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై దేశ సంపదను అక్రమంగా అమ్ముకున్నారన్న నేరంపై పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో మరో ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా వీల్లేదని తెలుపుతూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆ తీర్పును నిలిపివేయడంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించినట్లయింది.
ఇది కూడా చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ
Comments
Please login to add a commentAdd a comment