నేనే తప్పూ చేయలేదు: వీణామాలిక్
దుబాయ్: పాకిస్థాన్ కోర్టు తనకు 26 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై నటి వీణామాలిక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 26 ఏళ్ల జైలు అంటే జీవితఖైదు విధించినట్టేనని ఆమె పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానాలపై తనకు నమ్మకముందని తెలిపారు. తుది తీర్పులో తనకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. తానేమీ తప్పు చేయలేదని ఆమె పేర్కొంది.
దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ యో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రె హ్మాన్, నటి వీణామాలిక్, ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయిష్టా వాహిదిలకు 26ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పు చెప్పింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.