అమ్మ అయిన అమ్మడు! | Actor Veena Malik gives birth to son, names him Abram | Sakshi
Sakshi News home page

అమ్మ అయిన అమ్మడు!

Published Tue, Sep 23 2014 11:07 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

అమ్మ అయిన అమ్మడు! - Sakshi

అమ్మ అయిన అమ్మడు!

 వీణామాలిక్ సమస్త ప్రపంచాన్ని మరిచిపోయి ఆనందసాగరంలో తేలియాడుతున్నారు. ఇంతకీ ఈ శృంగార నాయిక ఆనందానికి కారణం ఏంటనుకుంటున్నారా! ఆ ఆనందానికి కారణం ఆమె ‘అమ్మ’ కావడమే. వాషింగ్టన్‌లోని వర్జినీయా హస్పిటల్‌లో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త అసద్ బాషిర్‌ఖాన్ కఠాక్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తమ కుమారుడికి అబ్రాం ఖాన్ కఠాక్ అని నామకరం చేసినట్లు వీణామాలిక్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా, తమ కుమారుడి పేరు మీద ఓ ట్విట్టర్ అకౌంట్‌ను కూడా తెరిచారామె. ఆ తాజా ట్విట్టర్‌లో ‘ప్రపంచానికి స్వాగతం... నేను వచ్చాను’ అని తన బిడ్డ పేరుతో తానే ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement