![Rahul Gandhi Convicted Of Defamation By Surat Court Modi Surname - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/03/23/Rahu-lGandhi.jpg.webp?itok=XmkLFnaE)
సూరత్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. రెండేళ్లు జైలు శిక్ష విధించింది. గురువారం ఈమేరకు తీర్పునిచ్చింది.
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటక కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అనే ఎందుకు ఉంది? అని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ మాట్లాడారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ అనంతరం రాహుల్‌ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును రాహుల్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment