
సూరత్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. తాను ఏ తప్పూ చేయలేదని విచారణ సందర్భంగా కోర్టుకు రాహుల్ తెలిపారు. న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేకుండా శాశ్వత వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ అభ్యర్థనపై నిర్ణయాన్ని డిసెంబర్ 10న తెలియజేస్తామన్న కోర్టు.. ఆ రోజు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్‌కు మినహాయింపు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగలంతా మోదీలే ఎందుకవుతారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు సహజంగా ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువునష్టం దావా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment