
ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల గణేష్
ప్రొద్దుటూరు క్రైం : చెక్‌బౌన్స్ కేసుకు సంబంధించి సినీ నిర్మాత బండ్లగణేష్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు బండ్లగణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టులో చెక్‌బౌన్స్ కేసులు ఉన్నాయి.
వీటిలో ఒక కేసుకు సంబంధించి బుధవారం ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. తిరిగి ఈ కేసు విచారణ ఈ నెల 22కు వాయిదా పడినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి.