చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట!
చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట!
Published Thu, Jan 30 2014 7:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు బాంబే హై కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో స్టేట్ మెంట్ రికార్డు కోసం హజరవ్వడంలో విఫలమైన ప్రీతి జింటాకు అంధేరి మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జనవరి 27 తేదిన జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను గురువారం కొట్టివేసింది.
సినీ రచయిత అబ్బాస్ టైర్ వాలా దాఖలు చేసిన కేసులో పలు దఫాలు కోర్టుకు గైర్హాజరవ్వడంతో వారెంట్లు జారీ చేశారు. వారెంట్ల జారీని సవాల్ చేస్తూ జింటా హైకోర్టును ఆశ్రయించారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం చెక్ బౌన్స్ కేసులో న్యాయవాది ద్వారా తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవచ్చనే ఉదహరిస్తూ హైకోర్టులో జింటా పిటిషన్ దాఖలు చేశారు. అయితే జింటా పిటిషన్ నిరాకరించి ఫిబ్రవరి 10 తేదిన నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను జారీచేశారు. జింటా కేసును మూడు నాలుగు వారాలు వాయిదా వేయడమే కాకుండా.. కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.
Advertisement