NBW
-
పూనంకు ఎన్బీడబ్ల్యూ
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో తమ ముందు హాజరు కావాలన్న ఆదేశాలను వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పాటించకపోవడంతో ఆమెకు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. ఈ కేసులో అధికారులు తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పేర్కొంది. ఈ కేసు తీర్పును ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పట్టు పరిశ్రమల శాఖలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న పిటిషనర్ల సేవలను 1993 నుంచి క్రమబద్ధీకరించాలని గతేడాది ఫిబ్రవరి 28న హైకోర్టు ఆదేశించింది. అందుకనుగుణంగా పెన్షనరీ ప్రయోజనాలను వర్తింపచేయాలని సూచించింది. అయితే ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ 17 మంది విశ్రాంత ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ పలువురు అధికారులకు గతంలో ఆదేశాలిచ్చారు. ఈ మేరకు వారు బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే పూనం మినహా మిగిలిన అధికారులు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ రికార్డుల్లో లేకపోవడంతో పూనంకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. స్వయంగా హాజరుకండి: సీఎస్‌కు హైకోర్టు ఆదేశం ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 24న స్వయంగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఉపాధి పనులకు సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయిందా? లేదా? అనేదానిపై స్పష్టతనివ్వాలని కోరింది. విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు కేంద్రానికి చెప్పి.. విచారణ జరుగుతోందని తమకు చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నామని.. కాబట్టి సీఎస్ హాజరుకు ఆదేశాలిస్తున్నట్లు జస్టిస్ బట్టు దేవానంద్ చెప్పారు. -
నిత్యానందకు కర్ణాటక కోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడు వివాదాస్పద నిత్యానంద స్వామికి (45) కోర్టు షాకిచ్చింది. గత రెండు నెలలుగా కోర్టుగా గైర్హాజరువుతున్న నిత్యానందకు కర్ణాటకలోని రామనగర సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అత్యాచారం కేసు విచారణకు రాకుండా నిత్యానంద స్వామి పరారీలో ఉన్నాడని కోర్టు పేర్కొంది. ఈ సారి కోర్టు విచారణకు ఆయన తప్పకుండా హాజరు కావాలని సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశించారు. బెంగళూరు సమీపంలోని బిడది ఆశ్రమంల కూడా నిత్యానంద ఆచూకీ లభ్యం కాలేదని, దీంతో ఈ వారెంట్ జారీ చేశామని దర్యాప్తు అధికారి హొన్నప్ప తెలిపారు. నిందితుడు ఎక్కడ ఉన్నదీ విచారిస్తున్నామనీ, అనంతరం తదుపరి చర్యలతీసుకుంటామని చెప్పారు. అయితే వారణాసిలో చాతుర్మాస దీక్షలో ఉన్నకారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయారని నిత్యానంద తరపు న్యాయవాది వాదించారు. కాగా ఎనిమిదేళ్ల క్రితం అత్యాచారం, తదితర కేసులో నిత్యానంద స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదుతో 2010 లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన నిత్యానందకు, బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. 2017లో ఆయనతో పాటు అత్యాచార కేసులో భాగస్వాములుగా ఉన్న మరో ఐదుగురి పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో 2018 జూన్‌లో విచారణ ప్రారంభమైంది. అలాగే మూడవ నిందితుడు నిత్యా సచ్చిదానంద, రెండవ నిందితుడు గోపాల్ రెడ్డికి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, విచారణకు సహకరించకుండా ఆగస్టు 8 నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని అధికారులు చెబుతున్నారు. -
మాల్యాపై ఉచ్చు బిగిస్తున్న సీబీఐ
ముంబై: కష్టకాలంలో విదేశాల్లో కింగ్ లా ఎంజాయ్ చేస్తున్న రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు తప్పేట్టు లేవు. ఆయన్ని స్వదేశానికి రప్పించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కీలక అడుగు ముందుకు వేయనుంది. ముఖ్యంగా ఆయనకు సాయం చేసారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెద్దమొత్తంలో రుణాలను ఎ గ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు దేశానికి రప్పించే విషయంలో సీబీఐ మరింత పట్టు బిగిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ లోన్ డీఫాల్ట్ కేసులో మాల్యాపై సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రత్యేక న్యాయవాది హెచ్ ఎస్ మహాజన్ మాల్యాపై నాన్ బెయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతను వాంటెడ్ క్రిమినల్ అని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఐడిబిఐ బ్యాంకు లోన్ డిఫాల్ట్ సందర్భంలో ఇబ్బందులతో పడ్డ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పై అఫిడవిట్ దాఖలు చేశామని సిబీఐ అధికారి తెలిపారు. లండన్ నుంచి వెనక్కి రప్పించాలని కోరినట్టు తెలిపారు. ఈ వారెంట్ ను దౌత్య మార్గాల ద్వారా ఆ దేశానికి పంపిస్తామన్నారు. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన ఐడీబీఐ అధికారులు, కింగిఫిషర్ ఉద్యోగుల తదితర నిందితుల బెయిల్ దరఖాస్తులను బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు పరిశీలించింది. గతంలో కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ అతని ఎడ్రస్ తెలియలేదని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ మాల్యాకు సహకరించారన్న బీజేపీ ఆరోపణల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సీబీఐ ప్రశ్నించనున్నట్టు సమాచారం. కాగా జనవరి 24న ముంబై కోర్టులో 1000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. "వ్యక్తిగత ఖర్చులు" కోసం ఈ నిధులను మళ్లించినట్టు సిబిఐ చార్జిషీట్లో ఆరోపించింది. మోసం, కుట్ర అభియోగాలను కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే పలుసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, తనపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన బిజినెస్ టైకూన్ మాల్యాను వెనక్కి రప్పిస్తారా? వేచి చూడాల్సిందే. -
చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట!
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు బాంబే హై కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో స్టేట్ మెంట్ రికార్డు కోసం హజరవ్వడంలో విఫలమైన ప్రీతి జింటాకు అంధేరి మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జనవరి 27 తేదిన జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను గురువారం కొట్టివేసింది. సినీ రచయిత అబ్బాస్ టైర్ వాలా దాఖలు చేసిన కేసులో పలు దఫాలు కోర్టుకు గైర్హాజరవ్వడంతో వారెంట్లు జారీ చేశారు. వారెంట్ల జారీని సవాల్ చేస్తూ జింటా హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం చెక్ బౌన్స్ కేసులో న్యాయవాది ద్వారా తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవచ్చనే ఉదహరిస్తూ హైకోర్టులో జింటా పిటిషన్ దాఖలు చేశారు. అయితే జింటా పిటిషన్ నిరాకరించి ఫిబ్రవరి 10 తేదిన నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను జారీచేశారు. జింటా కేసును మూడు నాలుగు వారాలు వాయిదా వేయడమే కాకుండా.. కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.