మాల్యాపై ఉచ్చు బిగిస్తున్న సీబీఐ | CBI court issues warrant against Vijay Mallya in IDBI loan case | Sakshi
Sakshi News home page

మాల్యాపై ఉచ్చు బిగిస్తున్న సీబీఐ

Published Tue, Jan 31 2017 8:11 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

మాల్యాపై ఉచ్చు బిగిస్తున్న సీబీఐ

మాల్యాపై ఉచ్చు బిగిస్తున్న సీబీఐ

ముంబై: కష్టకాలంలో  విదేశాల్లో కింగ్ లా ఎంజాయ్‌  చేస్తున్న రుణ ఎగవేతదారుడు  విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు తప్పేట్టు లేవు. ఆయన్ని స్వదేశానికి  రప్పించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్   (సీబీఐ) మరో కీలక అడుగు ముందుకు వేయనుంది.
ముఖ్యంగా ఆయనకు సాయం చేసారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించేందుకు  ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెద్దమొత్తంలో రుణాలను ఎ గ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు దేశానికి  రప్పించే విషయంలో సీబీఐ  మరింత పట్టు బిగిస్తోంది.   

ఐడీబీఐ  బ్యాంక్ లోన్ డీఫాల్ట్ కేసులో మాల్యాపై సీబీఐ ప్రత్యేక  కోర్టులో  మంగళవారం అఫిడవిట్ ను దాఖలు చేసింది.  దీంతో  సీబీఐ ప్రత్యేక కోర్టు   ప్రత్యేక న్యాయవాది హెచ్ ఎస్ మహాజన్ మాల్యాపై  నాన్ బెయలబుల్  అరెస్ట్ వారెంట్ జారీ  చేశారు. అతను వాంటెడ్  క్రిమినల్  అని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

ఐడిబిఐ బ్యాంకు లోన్ డిఫాల్ట్ సందర్భంలో ఇబ్బందులతో  పడ్డ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పై  అఫిడవిట్ దాఖలు చేశామని సిబీఐ అధికారి తెలిపారు. లండన్ నుంచి వెనక్కి రప్పించాలని కోరినట్టు తెలిపారు. ఈ వారెంట్ ను దౌత్య మార్గాల ద్వారా ఆ దేశానికి  పంపిస్తామన్నారు.
ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన ఐడీబీఐ అధికారులు, కింగిఫిషర్ ఉద్యోగుల తదితర నిందితుల బెయిల్ దరఖాస్తులను బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు పరిశీలించింది. గతంలో కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ అతని ఎడ్రస్ తెలియలేదని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ మాల్యాకు సహకరించారన్న బీజేపీ ఆరోపణల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  సీబీఐ ప్రశ్నించనున్నట్టు  సమాచారం.

కాగా జనవరి 24న ముంబై కోర్టులో 1000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. "వ్యక్తిగత ఖర్చులు" కోసం ఈ నిధులను మళ్లించినట్టు  సిబిఐ చార్జిషీట్లో  ఆరోపించింది.  మోసం, కుట్ర అభియోగాలను కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే.  మరి ఇప్పటికే పలుసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, తనపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్  ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన బిజినెస్ టైకూన్ మాల్యాను వెనక్కి రప్పిస్తారా?  వేచి చూడాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement