
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా (Preity Zinta) కాంగ్రెస్ (Congress) పార్టీపై భగ్గుమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ఆమె పేర్కొన్నారు. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాపీ చేసిందని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకు గాను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారని ఆ పార్టీ పేర్కొంది. అయితే, ఇదే విషయంపై ప్రీతి జింటా ఫైర్ అయ్యారు.
'నా సోషల్‌మీడియా అకౌంట్స్ అన్నీ సొంతంగానే నిర్వహించుకుంటాను. మరోకరికి అప్పగించలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉంది. 10ఏళ్ల కిందటే ఆ బ్యాంకు నుంచి తీసుకొన్న రుణాన్ని తీర్చేశాను. ఇన్నేళ్ల తర్వాత ఈ అంశపై కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను తీసుకున్న రుణాన్నీ ఎవరూ మాఫీ చేయలేదు. ఆ అవసరం నాకు లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి. పూర్తి విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. సాధారణంగా ఇలాంటి రూమర్స్‌కు నేను రియాక్ట్ అవను. కానీ, భవిష్యత్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వివరణ ఇస్తున్నాను.' అని ప్రీతి జింటా తెలిపారు.
న్యూఇండియా కోఆపరేటివ్ ముంబై బ్రాంచ్‌లో ప్రితీ జింటా లోన్ తీసుకున్నట్లు తెలిపారు. అదే బ్యాంక్‌లో జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్‌గా పనిచేస్తున్న హితేష్ మెహతా రూ.122 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన్ను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి జింటాపై కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment