చంచల్‌గూడ జైలుకు నటుడు ప్రదీప్‌ | actor pradeep goes to chanchalguda jail in Cheque Bounce case | Sakshi
Sakshi News home page

చంచల్‌గూడ జైలుకు నటుడు ప్రదీప్‌

Published Sat, Jun 10 2017 8:49 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

చంచల్‌గూడ జైలుకు నటుడు ప్రదీప్‌ - Sakshi

చంచల్‌గూడ జైలుకు నటుడు ప్రదీప్‌

చంచల్‌గూడ: చెక్‌ బౌన్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న బుల్లి తెర నటుడు ప్రదీప్‌ని నగర పోలీసులు శుక్రవారం సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఓ చెక్‌ బౌన్స్‌ కేసులో ఎర్ర మంజిల్‌ కోర్టు ప్రదీప్‌పై వారెంట్‌ జారీ చేయగా పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి రిమాండ్‌ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైల్‌కు తరలించారు. అనంతరం అదే రోజు కోర్టు బెయిల్‌ మంజూరు చేయటంతో గంటల వ్యవధిలో ప్రదీప్‌ జైలు నుంచి విడుదలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement