
సినీ నిర్మాతకు రిమాండ్
చెక్‌బౌన్స్ కేసులో ‘సినిమా చూపిస్తా మావా’ సినీ నిర్మాత బోగాది అంజిరెడ్డిని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోర్టు సోమవారం రిమాండ్‌కు ఆదేశించింది.
జూన్ నెల 27వ తేదీన కేసు వాయిదాకు సినీ నిర్మాత హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో కాకినాడ టూటౌన్ పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న అంజిరెడ్డిని అరెస్టు చేసి శనివారం రాత్రి 8 గంటలకు మేజిస్ట్రేట్ వెంకటేశ్వరరావు ఎదుట హాజరుపరిచారు. ఆ సమయంలో అస్వస్థతకు గురైన అంజిరెడ్డికి పూర్తి స్థాయిలో చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఐదో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి విచారణ చేసి 14 రోజులు రిమాండ్ విధించగా రాజమండి సెంట్రల్ జైలుకు తరలించారు.