
సాక్షి, కాకినాడ జిల్లా: యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి కాకినాడ కోర్టు.. జీవిత ఖైదు, జరినామా విధించింది. కాకినాడ రూరల్ కూరాడ గ్రామానికి చెందిన కాదా దేవిక(21)ను గుబ్బల వెంకట సూర్యనారాయణ కత్తితో నరికి చంపిన సంగతి తెలిసిందే.
గత ఏడాది అక్టోబర్ 8న బైక్‌పై వస్తున్న దేవికను వెంబడించి కాండ్రేగుల-కూరాడ మార్గ మధ్యలో కత్తితో దాడి చేసి అతి కిరాతంగా హత్యకు పాల్పడ్డాడు. సీఎం జగన్ ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 138 రోజుల్లో విచారణ పూర్తి చేశారు. దేవికా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment