న్యూఢిల్లీ: చెక్కు బౌన్స్ కేసును ఏ స్థాయిలోనైనా పరిష్కరించుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. కేసులో శిక్షను అమలు చేసేలోగా ఫిర్యాదీతో చెక్కు బౌన్స్ వ్యవహారాన్ని కోర్టు వెలుపలైనా పరిష్కరించుకోవచ్చని తెలిపింది. విచారణ కొనసాగుతున్నప్పుడు పరిష్కరించుకోవాలా లేకుంటే అప్పీలుపై విచారణ పూర్తయ్యాక పరిష్కరించుకోవాలా అనే దానిపై చట్టపరంగా ఎలాంటి పరిమితి లేదని జస్టిస్ వీకే జైన్ వివరించారు.