పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ సంచలన తీర్పు వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై గతంలో రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిని సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు.
(ఇదీ చదవండి: సూర్య కొత్త సినిమా ప్రకటన.. విశాఖలో పుట్టిన సుధకే డైరెక్టర్ ఛాన్స్)
చిరంజీవి పేరుతో నడుస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై వారిద్దరూ అసత్య ఆరోపణలు చేశారంటూ అల్లు అరవింద్ అప్పట్లోనే పరువునష్టం దావా వేశారు. అందుకు సంబంధించిన తీర్పును తాజాగా కోర్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా కూడా విధించింది.
(ఇదీ చదవండి: చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్)
దీంతో జరిమానాను రాజశేఖర్, జీవిత చెల్లించడంతో వారికి అప్పీలుకు వెళ్లే అవకాశం దక్కింది. వారు జిల్లా కోర్టును ఆశ్రయించడంతో వారిద్దరికి రూ. 10 చొప్పున పూచీకత్తుగా తీసుకుని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment