Meghamsh
-
నవ్వులే నవ్వులు
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న కథానాయకులుగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. ఎమ్ఎల్వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమా నిర్మించనున్నారు. ఆగస్టు 15న డా. శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. సతీష్ వేగేశ్న మాట్లాడుతూ –‘‘వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘‘శతమానం భవతి’ సినిమా నా మనసుకి బాగా నచ్చింది. సతీష్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎమ్ఎల్వి సత్యనారాయణ (సత్తిబాబు). -
‘రాజ్‌దూత్’ మూవీ రివ్యూ
టైటిల్ : రాజ్‌దూత్ జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : మేఘాన్ష్, సుదర్శన్, నక్షత్ర , ఆదిత్య తదితరులు సంగీతం : వరుణ్ సునీల్ నిర్మాత : ఎం. ఎల్. వీ సత్యనారాయణ దర్శకత్వం : అర్జున్, కార్తీక్ స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంష్ శ్రీహరి.. రాజ్‌దూత్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న శ్రీహరి నట వారసత్వాన్ని కొంసాగించేలా.. ఆయన కుమారుడు కూడా విజయవంతం అవుతాడా? మొదటి ప్రయత్నంలో సక్సెస్ కొట్టి.. మేఘాంష్ విజయ తీరాలను చేరుకున్నాడా? అన్నది చూద్దాo. కథ : తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ రాజ్‌దూత్. ప్రియ (నక్షత్ర)ను తనకిచ్చి చెయ్యాలంటే రాజ్దూత్ను తీసుకురావాలని కండీషన్ పెడతాడు హీరోయిన్ తండ్రి. ఇరవై ఏళ్ల క్రితం వదిలేసిన రాజ్దూత్ను తీసుకు రావడానికి మేఘాంష్ చేసిన ప్రయత్నాలే ఈ కథ. అసలు రాజ్దూత్కు హీరోకు ఉన్న సంబంధం ఏంటి?, చివరకు మేఘాంష్ రాజ్దూత్ను సంపాదించాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు : తను ప్రేమించిన అమ్మాయి కోసం కష్ట పడే పాత్రలో సంజయ్గా మేఘాంష్ బాగానే ఆకట్టుకున్నాడు. మొదటి ప్రయత్నం కాబట్టి మరీ ఎక్కువ ఆశించడం భావ్యం కాదు. అయితే డైలాగ్ డెలివరీలో.. నటనలో ఇంకాస్త మెరుగు పడాలి. ప్రియ పాత్రలో నక్షత్ర కనిపించేది కొద్ది సేపే అయినా ఆకట్టునే ప్రయత్నం చేసింది. రాజన్నగా ఆదిత్య బాగానే నటించాడు. స్నేహితుడి క్యారెక్టర్లో సుదర్శన్ నవ్వులు పూయించాడు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ : అర్జున్, కార్తీక్ దర్శకులుగా మామూలు కథను.. మరింత తీసికట్టుగా తెరకెక్కించారు. ఏ కోశాన కూడా ప్రేక్షకులు లీనమయ్యేట్టు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయారు. మేఘాంష్ వయసుకు సరిపడే కథే అయినా.. దాన్ని తెరపై అంతే పట్టుతో చూపెట్టలేకపోయారు. ఇలా నాసిరకంగా సినిమాను తీయడంతో.. మేఘాన్ష్కు ఈ చిత్రం ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. కథే చిన్న పాయింట్ కావడం.. దాన్ని కూడా పట్టులేకుండా తెరకెక్కించడం మైనస్ పాయింట్. సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు కూడా చిత్రాన్ని నిలబెట్టలేకపోయారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సంగీతం ఏవీ కూడా ఆశించిన స్థాయిలో లేవు. ప్లస్ పాయింట్స్ : కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథాకథనాలు దర్శకత్వం -బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్. -
‘అందుకే రహస్యంగా షూటింగ్ చేశాం’
శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకుల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ మీడియాతో మాట్లాడారు.. హీరోగా మీ మొదటి సినిమా రాజ్‌దూత్ రిలీజ్ అవుతుంది ఎలా ఫీల్ అవుతున్నారు? హీరోగా ఇది నా మొదటి సినిమా, ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మండుటెండల్లో చిత్రీకరణ చేశాం. నిర్మాత కూడా ఈ చిత్ర నిర్మాణం కొరకు చాలా కష్టపడ్డారు. చిత్రాన్ని చాలా రహస్యంగా చిత్రీకరించారు ఎందుకు? కేవలం ఒత్తిడి తగ్గించడానికే సినిమా షూటింగ్ ఎటువంటి ప్రచారం లేకుండా రహస్యంగా చిత్రీకరించడం జరిగింది. సినిమాపై ప్యాషన్ తోనే హీరో అయ్యారా? చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టి పెరిగినవాడిగా, సినిమాపై ఫ్యాషన్ ఉంది. అలాగే నాన్న కూడా ఓ సందర్భంలో చిన్నవాడిని యాక్టర్‌ని, పెద్దవాడిని డైరెక్టర్ని చేస్తాను అన్నారు. దానితో ఆయన కోరిక మేరకు కూడా హీరో అయ్యాను. సినిమాకు రాజ్‌దూత్ అని బైక్ పేరు ఎందుకు పెట్టారు? చాలా మంది అడుగుతున్న ప్రశ్నఇది. ఈ మూవీలో హీరో తనకిష్టమైన రాజ్ దూత్ బైక్ కోసం, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై అన్వేషిస్తూ ఉంటాడు. రాజ్ దూత్ రోడ్ జర్నీలో సాగే థ్రిల్లర్ మూవీనా? సినిమాలో కొంత భాగం రోడ్ జర్నీలో సాగుతుంది, ఐతే ఇది థ్రిల్లర్ మూవీ కాదు, రెండు మూడు, విభిన్న జోనర్స్లో సాగే ఓ వైవిధ్యమైన కమర్షియల్ చిత్రం అని చెప్పవచ్చు. మీరు హీరో అవుతున్నారంటే మీ అమ్మ గారు ఎలా స్పందించారు? అమ్మ చాలా సంతోషించారు, అలాగే సినిమా ఎలా వస్తుందో అని కొంచెం కంగారుకూడా పడ్డారు. ఐతే నేను సినిమాను అమ్మకు చూపించాను, ఆమెకు చాలా బాగా నచ్చింది. మీ నాన్న గారి నటనలో మీకు నచ్చిన కోణం ఏమిటి? ఆయన నటనలో ప్రతి కోణం నాకు నచ్చుతుంది. ఎమోషనల్ అయినా, యాంగ్రీ సన్నివేశాలలోనైనా ఆయన నటన చాలా బాగుంటుంది. నటనలో శిక్షణ తీసుకున్నారా? సినిమాకి ముందు కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నాను. అలాగే స్కూల్ ఏజ్ నుండి థియేటర్ డ్రామాలలో నటించిన అనుభవం కూడా ఉంది. కెమెరా ముందు మొదటి అనుభవం ఎలా అనిపించింది? మొదట్లో కొంత కంగారుపడ్డాను, తరువాత మెల్లగా అలవాటు పడ్డాను. ఇండస్ట్రీ నుండి మీకు అందిన సపోర్ట్ గురించి చెబుతారా? ఇండస్ట్రీ మాపై చాలా అభిమానం, ప్రేమా చూపించింది. సాయి ధరమ్ తేజ్ అన్న, అలాగే మంచు మనోజ్ అన్న కాల్ చేసి మరి అభినందించారు. నాన్నగారి సినిమాలలో మీకు నచ్చిన చిత్రం? చాలా ఉన్నాయి. భద్రాచలం, ఢీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా! సినిమాలంటే చాలా ఇష్టం. ఈ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పండి? అర్జున్, కార్తీక్ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర పనిచేశారు. వీళ్లద్దరి మధ్య వర్క్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసింది. అలా ఏం కాకుండా (నవ్వుతూ) ఇద్దరు చిత్రాన్ని పూర్తి చేశారు. మూవీలో జర్నీ ప్రధానంగా సాగుతుందా? ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్, లవ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. జర్నీ కేవలం చిత్రంలో ఒక భాగం మాత్రమే. -
శ్రీహరిగారి పేరు నిలబెడతాడు
‘‘మేఘాంశ్ తొలి సినిమా ‘భైరవ’ (బాల నటుడు). ‘రాజ్‌ధూత్’ రెండవ (హీరో) చిత్రం. పాఠాలు సరిగ్గా చదవడు కానీ, డైలాగులున్న పేజీలు మాత్రం బాగా చదువుతాడు. మేఘాంశ్ రక్తంలోనే నటన ఉందని అప్పుడే అర్థమైంది. ‘రాజ్‌ధూత్’ ట్రైలర్ చూసిన తర్వాత శ్రీహరిగారి పేరును మేఘాంశ్ నిలబెడతాడన్న నమ్మకం వచ్చింది’’ అని దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి శాంతి అన్నారు. శాంతిశ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘రాజ్‌ధూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. అర్జున్–కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం మా బావ (శ్రీహరి). మా ఇద్దరిదీ 35 ఏళ్ల అనుబంధం. నాకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది ఆయనే. దాని పేరు శ్రీహరి నిలయం. తండ్రిలా మేఘాంశ్ పెద్ద స్టార్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మా దర్శకులు ఇద్దరైనా ఒక్కరిలా పనిచేసి, చాలా క్లారిటీతో ఈ సినిమా తీశారు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లో సినిమా చూడండి’’ అని మేఘాంశ్ అన్నారు. ‘‘నిర్మాతకు కథ చెప్పగానే మూడు రోజుల్లో ఓకే చేశారు. మేఘాంశ్ పెద్ద డైరెక్టర్స్‌తో సినిమాలు చేయొచ్చు.. కానీ మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చారు’’ అన్నారు అర్జున్–కార్తీక్. ‘‘శ్రీహరిగారి వల్ల ఎంతో మంది వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారు. నేను ఇలా ఉండటానికి కారణం శ్రీహరిగారే. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’’ అన్నారు ఫైట్ మాస్టర్ విజయ్. ‘‘నేను నిర్మాతగా ఉన్నానంటే కారణం శ్రీహరిగారే. ఆయన ఉండుంటే ఇంకా చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చేవారు. ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప వ్యక్తి. మహాసముద్రంలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం’’ అన్నారు నిర్మాత బెల్లకొండ సురేష్. ‘‘రాజ్‌ధూత్’తో నేను గొప్ప నిర్మాత అవుతానో? లేదో? తెలియదు. కానీ అర్జున్–కార్తీక్ మంచి దర్శకులవుతారు. మేఘాంశ్ బాగా నటించాడు’’ అన్నారు చిత్రనిర్మాత సత్యనారాయణ. దర్శకులు ఇ.సత్తిబాబు, దేవీప్రసాద్, బాబీ, రవికుమార్ చౌదరి, శ్రీరామ్ ఆదిత్య, అజయ్ భూపతి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తనయుడు సాయి, నటుడు రాజా రవీందర్, నిర్మాత అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాజ్ దూత్’ మూవీ స్టిల్స్
-
యువతకు దగ్గరయ్యేలా...
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘రాజ్ దూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. అర్జున్ – కార్తీక్ దర్శకత్వం వహించారు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించిన ఈ సినిమా జూలై 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎమ్.ఎల్.వి సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘శ్రీహరి వారసుడిగా మేఘాంశ్ సంచలనాలు సష్టించడం ఖాయం అన్న ఆసక్తికర చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతోంది. హీరోయిజానికి సరిపడే ఛామింగ్ డ్యాషింగ్ లుక్ అతడికి ఉంది. యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో పలువురు మేఘాంశ్ లుక్, అప్పియరెన్స్‌పై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే విడుదలై చిత్ర టీజర్ మిలియన్ వ్యూస్ అధిగమించి యూట్యూబ్‌లో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి’’ అన్నారు. ‘‘టీజర్‌తోనే ప్రశంసలు దక్కించుకున్న మా అబ్బాయికి తండ్రి శ్రీహరి ఆశీస్సులతో పాటు తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయనే నమ్మకం ఉంది’’ అని మేఘాంశ్ తల్లి, నటి శాంతి శ్రీహరి అన్నారు. ‘‘మేఘాంశ్‌కు ఇది తొలి చిత్రమైనా తన యాక్షన్ సన్నివేశాలు చిత్రానికే హైలైట్‌గా నిలుస్తాయి. యువతకు దగ్గరయ్యేలా అతని నటన ఉంటుంది’’ అని దర్శకులు అర్జున్ – కార్తీక్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్ చింతా, సంగీతం: వరుణ్ సునీల్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్. -
అప్పుడు ఎంత అంటే అంత!
శశాంక్.. మేఘాంశ్.. ‘రియల్ స్టార్’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన శ్రీహరి కుమారులు. ‘రాజ్‌దూత్’ చిత్రం ద్వారా మేఘాంశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. శశాంక్‌కి డైరెక్టర్ అవ్వాలనే ఆశయం ఉంది. ఈ ఇద్దరూ తమ తండ్రి శ్రీహరి గురించి పంచుకున్న విశేషాలు. ► హీరోగా పరిచయమవుతున్న ఈ సమయంలో నాన్న పక్కన ఉంటే అనే ఫీలింగ్ రాక మానదు.. మేఘాంశ్: కచ్చితంగా. నాన్న ఉండి ఉంటే పక్కనే ఉండి నడిపించేవారు. ఒక భరోసా ఉండేది. అది మిస్సవుతున్నాం. సినిమా కమిట్ అయ్యే ముందు ఆర్టిస్ట్‌గా నాన్నకు వచ్చిన దాంట్లో ఓ 5 శాతం వచ్చినా చాలు అనుకున్నాను. నాన్న పేరు చెడగొట్టకూడదు అనే బాధ్యతతో చేశాను. ► నాన్న ఉన్నప్పుడే హీరో అవ్వాలనే టాపిక్ మీ మధ్య వచ్చిందా? మేఘాంశ్: మేం ఇద్దరం సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలనుకున్నారు. కానీ హీరోనా? డైరెక్టర్‌గానా? అనే డిస్కషన్ అయితే ఎప్పుడూ రాలేదు. అప్పుడు చిన్నపిల్లలం కదా. ► మీ నాన్నగారు ఫిట్‌గా ఉండేవారు. మీరు కూడా అదే అలవర్చుకున్నట్టున్నారు? మేఘాంశ్: ఆయన్ను చూసే జిమ్ చేయడం స్టార్ట్ చేశాం. నాన్నకి ఫిట్‌గా ఉండటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మాకది ఇన్స్పైరింగ్గా ఉండేది. మా జిమ్‌లో నాన్న ఫొటోలు ఉంటాయి. జిమ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆ ఫొటోలు చూస్తుంటాం. ► శ్రీహరిగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు.. మేఘాంశ్: అందరికీ హెల్ప్ చేయడం. శశాంక్: హంబుల్‌గా ఉండటం. మేఘాంశ్: హంబుల్‌గా ఉంటూనే రాయల్‌గా ఉండటం. ► ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేవారా? ఏదైనా గిఫ్ట్ ఇచ్చేవారా? ఇద్దరూ: ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజూ మాకు సెలబ్రేషనే. శశాంక్: ఓ రోజు ఆమ్లెట్ చేసి ఇచ్చా. మస్త్ ఉంది అన్నారు. మేఘాంశ్: నేను నాన్నతో చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. శశాంక్: వీడు డాడీ పెట్. ► నాన్న వెళ్లిపోయిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? శశాంక్: లైఫ్‌స్టైల్ మారిపోయింది. అప్పుడు బాధ్యతలు లేవు. ఇలా అంటే (చిటికేస్తూ) అన్నీ వచ్చేసేవి. ఇప్పుడు కొంచెం చూసి ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్షియల్‌గా చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాం. ► స్కూల్‌కి వెళ్లను అన్నప్పుడు నాన్న కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేఘాంశ్: మమ్మీ కొట్టేది. కానీ డాడీ ఎప్పుడూ కొట్టలేదు. స్కూల్ బంక్ కొడితే డాడీ దగ్గరకు వెళ్లిపోయేవాళ్లం. ► డాడీ ఏ విషయంలోనూ కోప్పడలేదా? మేఘాంశ్: ఎప్పుడూ లేదు. శశాంక్: ఒకే ఒక్కసారి నన్ను కోప్పడ్డారు. ఆయన్ను చూడటానికి ఫ్యాన్స్ వచ్చారు. నేను పటాసులు కాలుస్తున్నాను. గేట్ దగ్గర రాకెట్ పేలిస్తే ఓ అభిమాని మీదకు వెళ్లింది. అప్పుడు కోప్పడ్డారు. ఇంకోసారి కార్ విండోలో నుంచి మేఘాంశ్ చేయి బయటపెడితే అద్దం పైకి ఎత్తేశా. అప్పుడు తిట్టారు. ► బిజీ ఆర్టిస్ట్ అయినా మీతో టైమ్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవారా? ఇద్దరూ: రోజూ కలసి భోజనం చేసేవాళ్లం. అప్పుడు మమ్మీ మా అల్లరి గురించి చెబుతుండేది. వాళ్ల గురించి ఇప్పుడెందుకు? హ్యాపీగా తిననివ్వు అని మమ్మీనే తిట్టేవాళ్లు. మాకు ఒక్క తిట్టు కూడా పడేది కాదు. ► మీ ప్రోగ్రెస్ కార్డ్ ఎవరు సైన్ చేసేవాళ్లు? మేఘాంశ్: మమ్మీనే. అప్పుడప్పుడు పాస్ అయ్యేవాణ్ణి, అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యేవాణ్ణి. శశాంక్: కానీ వాడి తిట్లన్నీ నాకు పడేవి. ఎందుకంటే ముందు నా ప్రోగ్రెస్ కార్డ్ చూసి నన్ను తిట్టేది. మళ్లీ వాడిని ఏం తిడతాంలే అనుకునేదేమో. నన్ను తిడుతూనే ఉండేది. ► మీ ఇద్దర్లో టామ్ ఎవరు? జెర్రీ ఎవరు? మేఘాంశ్: వాడే. (శశాంక్ని చూపిస్తూ) వాడు కొట్టేటోడు.. నేను పడేటోడ్ని. (నవ్వుతూ ) ► మీ తమ్ముడు హీరో అవుతున్నాడు కదా. ఏమనిపిస్తుంది? మేఘాంశ్: మంచిగా చెప్పురా ప్లీజ్. శశాంక్: అలా చెప్పాలనే ఆలోచిస్తున్నా. ఫస్ట్ నాకు నవ్వొచ్చింది. బచ్చాగాడు హీరో అయిపోయాడు అనుకున్నాను. అయితే నేను చెప్పేదొక్కటే. హిట్ అయినా ఫట్ అయినా హంబుల్‌గా ఉండాలి. ► మీ నాన్నగారు ఉన్నప్పుడు ఓసారి పదివేలకు చాక్లెట్లు కొన్నారట? శశాంక్: నాన్నగారి కార్డ్ తీసుకెళ్లాడు. అక్కడున్న చాక్లెట్లు అన్నీ కొన్నాడు. రేయ్.. మేఘాంశ్ పదివేలు అయిందీ అంటే ఓ చాక్లెట్ పక్కన పెట్టి ఇప్పుడు 9 వేలే కదా తీసుకో అన్నాడు (నవ్వుతూ). మేఘాంశ్: మాకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. పాకెట్‌మనీ ఇచ్చేవాళ్లు కాదు. ఎవరికైనా డబ్బులిచ్చి మాతో పాటు పంపేవాళ్లు. మేం కొనుక్కునేవాళ్లం. అప్పుడు ఎంత అంటే అంత. ఇప్పుడు ఎంత అవసరం ఉంటే అంత. ► యాక్టర్ అవుతున్నారు. హోమ్ వర్క్ కోసం నాన్న సినిమాలేమైనా చూశారా? మేఘాంశ్: అలా ఏం చూడలేదు. అయితే నాన్నని చూడటం కోసమే ఆయన సినిమాలు చూస్తుంటాను. ► మీ నాన్నగారికి తీరని కోరిక ఏదైనా మిగిలిపోయిందా? శశాంక్: పాలిటిక్స్. ఇంకో సంవత్సరం ఉండి ఉంటే కచ్చితంగా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యేవారు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్. సహాయం చేయాలని అనుకుంటారు. ► మరి మీలో ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉందా? మేఘాంశ్: ఇంట్రెస్ట్, నాలెడ్జ్ రెండూ లేవు. ► నాన్న యాక్ట్ చేసిన సినిమాల్లో బాగా నచ్చినవి? ఇద్దరూ: కింగ్, ఢీ, భద్రాచలం, విజయరామరాజు... ఇలా చాలా ఉన్నాయి. ► తమ్ముడు హీరో అయ్యాడు.. మరి అన్న డైరెక్టర్ ఎప్పుడు అవుతాడు? శశాంక్: షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. ఇంకా ఏమీ అనుకోలేదు. శశాంక్, మేఘాంశ్ -
‘దొరసాని’ రెండో సినిమా రెడీ!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న హీరోయిన్ శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ తో కలిసి దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు శివాత్మిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తొలి సినిమా దొరసాని రిలీజ్ కాకుండానే శివాత్మిక మరో మూవీకి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలో రాజ్‌దూత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్, రెండో సినిమాలో శివాత్మిక హీరోయిన్గా నటించనున్నారట. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాను మేఘాంశ్ తొలి చిత్ర నిర్మాత ఎమ్ఎల్వీ సత్యనారాయణ నిర్మించనున్నారు. -
‘రాజ్‌ధూత్’ టీజర్ విడుదల
-
అబ్బాయిలకు పెళ్లి సేఫ్ కాదు
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘రాజ్‌ధూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. అర్జున్–కార్తీక్ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని నటి, దర్శక–నిర్మాత జీవితారాజశేఖర్ విడుదల చేశారు. ‘ఇందుకే అంటారు.. అమ్మాయిలకు ఢిల్లీ, అబ్బాయిలకు పెళ్లి సేఫ్ కాదని’ అంటూ కథానాయికతో హీరో అంటాడు. ‘సూపర్ భయ్యా.. ఎవరైనా ఆటోవాడికి చెప్పు.. యెనక రాసుకుంటాడు’ అంటూ నటుడు సుదర్శన్ చెప్పే డైలాగ్ టీజర్లో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జీవితారాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘శ్రీహరి–శాంతి కుమారులు చిన్ననాటి నుంచి తెలుసు. తల్లి–తండ్రిలాగే మంచి వ్యక్తిత్వం గలవారు. నా ఇద్దరు అమ్మాయిలతో పాటే వీరిద్దరూ(శశాంక్, మేఘామ్ష్) బిడ్డల్లాంటి వారు. మేఘామ్ష్, శివాత్మిక క్లాస్ మేట్స్. సినిమా టీజర్, రషెస్ చూశాను. శ్రీహరిగారి కన్నా పదిరెట్లు మేఘామ్ష్ మంచి పేరు తెస్తాడనే నమ్మకం ఉంది. శ్రీహరిగారు లేని లోటును మేఘాష్ణు్ తీర్చేశాడు. మేఘామ్ష్–శివాత్మికలకు మంచి కథ కూడా సిద్ధమైంది’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులు బావని(శ్రీహరి) గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. మా బిడ్డని కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నా’’ అన్నారు నటి శాంతిశ్రీహరి. ‘‘మా అమానాన్నల వల్లే ఈ స్థాయిలో నిలబడగలిగాను. జూలైలో సినిమా విడుదలవుతుంది’’ అని మేఘామ్ష్ అన్నారు. ‘‘మేఘామ్ష్ రెండో సినిమా కూడా నా బ్యానర్లోనే ఉంటుంది’’ అన్నారు ఎమ్.ఎల్.వి సత్యనారాయణ. ‘‘రచయితలగా పలు సినిమాలకు పనిచేసాం. మేం దర్శకులుగా పరిచయమవుతోన్న చిత్రమిది’’ అన్నారు దర్శకులు అర్జున్–కార్తీక్. ఈ సందర్భంగా ‘ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్’ అభివృద్ధికి ఎమ్.ఎల్.వి సత్యనారాయణ లక్ష రూపాయలు విరాళంగా అందించారు. సంతోషం అధినేత సురేష్ కొండేటి, నక్షత్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్ కుమార్ పాల్గొన్నారు....శశాంక్, శాంతి శ్రీహరి, మేఘామ్ష్ -
నాన్న మెచ్చిన దారిలో..
‘ నాన్ననే నవ్ముకం దూరమై నెలలు గడుస్తున్నాయి. ఇన్నాళ్లూ అపనవ్ముకంతో కాలం గడిపిన మేవుు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. నాన్న ఆశ యూలు నిలబెట్టే ప్రయుత్నంలో ఉన్నాం’ అని చెబుతున్నారు రియుల్ స్టార్ శ్రీహరి తనయుులు శశాంక్, మేఘాంశ్. నాన్న మెచ్చిన దారిలో వెళ్తున్నావుంటున్న వీరిని ‘సిటీప్లస్’ పలకరించింది. మేఘాంశ్: నాన్న అన్ని సౌకర్యాలతో ఇంట్లోనే పెద్ద జిమ్ ఏర్పాటు చేశారు. నేను, అన్న ప్రతి రోజూ గం టల తరబడి ఎక్సర్సైజ్లు చేసేవాళ్లం. ఫిట్నెస్ కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో నాన్న చెప్పేవారు. అన్న నాన్నతో కలసి పోటాపోటీగా ఎక్సర్సైజ్ చేసేవాడు. నాన్న పోయాక అన్న ఇప్పుడు జిమ్‌ను మళ్లీ ప్రారంభించాడు. నాన్న జ్ఞాపకాలతో జిమ్‌లో గడుపుతున్నాం. శశాంక్: మేమంటే నాన్నకు చాలా ఇష్టం. మాకు కూడా నాన్నంటే ఎంతో ఇష్టం. మమ్మల్ని స్నేహితుల్లానే చూసేవారు. నన్ను డెరైక్టర్ చేయాలని, తమ్ముడిని హీరో చేయాలని నాన్నకు కోరికగా ఉండేది. అమ్మ మాత్రం నన్ను డాక్టర్‌గా, తమ్ముడిని లాయర్‌గా చూడాలనుకునేది. నాన్న పోయాక అమ్మ ఆలోచనలూ మారాయి. నాన్న కోరిక మేరకే మమ్మల్ని డెరైక్టర్‌గా, హీరోగా చేయాలనుకుంటోంది. - శిరీష చల్లపల్లి