
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న హీరోయిన్ శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ తో కలిసి దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు శివాత్మిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తొలి సినిమా దొరసాని రిలీజ్ కాకుండానే శివాత్మిక మరో మూవీకి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
త్వరలో రాజ్‌దూత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్, రెండో సినిమాలో శివాత్మిక హీరోయిన్‌గా నటించనున్నారట. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాను మేఘాంశ్ తొలి చిత్ర నిర్మాత ఎమ్‌ఎల్‌వీ సత్యనారాయణ నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment