‘రాజ్‌దూత్’ మూవీ రివ్యూ | Rajdoot Telugu Movie Review | Sakshi
Sakshi News home page

‘రాజ్‌దూత్’ మూవీ రివ్యూ

Published Fri, Jul 12 2019 3:45 PM | Last Updated on Fri, Jul 12 2019 4:05 PM

Rajdoot Telugu Movie Review - Sakshi

టైటిల్ : రాజ్‌దూత్
జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్
నటీనటులు : మేఘాన్ష్, సుదర్శన్, నక్షత్ర , ఆదిత్య తదితరులు
సంగీతం : వరుణ్ సునీల్
నిర్మాత : ఎం. ఎల్. వీ సత్యనారాయణ
దర్శకత్వం : అర్జున్, కార్తీక్

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంష్‌ శ్రీహరి.. రాజ్‌దూత్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న శ్రీహరి నట వారసత్వాన్ని కొంసాగించేలా.. ఆయన కుమారుడు కూడా విజయవంతం అవుతాడా? మొదటి ప్రయత్నంలో సక్సెస్ కొట్టి.. మేఘాంష్‌ విజయ తీరాలను చేరుకున్నాడా? అన్నది చూద్దాo.

కథ : 
తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ రాజ్‌దూత్. ప్రియ (నక్షత్ర)ను తనకిచ్చి చెయ్యాలంటే రాజ్‌దూత్‌ను తీసుకురావాలని కండీషన్ పెడతాడు హీరోయిన్ తండ్రి. ఇరవై ఏళ్ల క్రితం వదిలేసిన రాజ్‌దూత్‌ను తీసుకు రావడానికి మేఘాంష్‌ చేసిన ప్రయత్నాలే ఈ కథ. అసలు రాజ్‌దూత్‌కు హీరోకు ఉన్న సంబంధం ఏంటి?, చివరకు మేఘాంష్‌ రాజ్‌దూత్‌ను సంపాదించాడా? అన్నదే మిగతా కథ.

నటీనటులు : 
తను ప్రేమించిన అమ్మాయి కోసం కష్ట పడే పాత్రలో సంజయ్‌గా మేఘాంష్‌ బాగానే ఆకట్టుకున్నాడు. మొదటి ప్రయత్నం కాబట్టి మరీ ఎక్కువ ఆశించడం భావ్యం కాదు. అయితే డైలాగ్ డెలివరీలో.. నటనలో ఇంకాస్త మెరుగు పడాలి. ప్రియ పాత్రలో నక్షత్ర కనిపించేది కొద్ది సేపే అయినా ఆకట్టునే ప్రయత్నం చేసింది. రాజన్నగా ఆదిత్య బాగానే నటించాడు. స్నేహితుడి క్యారెక్టర్‌లో సుదర్శన్ నవ్వులు పూయించాడు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. 

విశ్లేషణ : 
అర్జున్, కార్తీక్ దర్శకులుగా మామూలు కథను.. మరింత తీసికట్టుగా తెరకెక్కించారు. ఏ కోశాన కూడా ప్రేక్షకులు లీనమయ్యేట్టు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయారు. మేఘాంష్‌ వయసుకు సరిపడే కథే అయినా.. దాన్ని తెరపై అంతే పట్టుతో చూపెట్టలేకపోయారు. ఇలా నాసిరకంగా సినిమాను తీయడంతో.. మేఘాన్ష్‌కు ఈ చిత్రం ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. కథే చిన్న పాయింట్ కావడం.. దాన్ని కూడా  పట్టులేకుండా తెరకెక్కించడం మైనస్ పాయింట్. సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు కూడా చిత్రాన్ని నిలబెట్టలేకపోయారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సంగీతం ఏవీ కూడా ఆశించిన స్థాయిలో లేవు. 

ప్లస్ పాయింట్స్ :
కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్ :
కథాకథనాలు
దర్శకత్వం

-బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement