Rajdoot Movie
-
ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి
ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగించారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్టైనర్స్ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను. ► నేను షూటింగ్లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్ లోకి రానివ్వను. నా ఫస్ట్ మూవీ ‘రాజ్‌దూత్’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను. ► ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు. ► ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి? ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాల కోసం ఈ వీడియో చూసేయండి మరి... -
‘రాజ్‌దూత్’ మూవీ రివ్యూ
టైటిల్ : రాజ్‌దూత్ జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : మేఘాన్ష్, సుదర్శన్, నక్షత్ర , ఆదిత్య తదితరులు సంగీతం : వరుణ్ సునీల్ నిర్మాత : ఎం. ఎల్. వీ సత్యనారాయణ దర్శకత్వం : అర్జున్, కార్తీక్ స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంష్ శ్రీహరి.. రాజ్‌దూత్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న శ్రీహరి నట వారసత్వాన్ని కొంసాగించేలా.. ఆయన కుమారుడు కూడా విజయవంతం అవుతాడా? మొదటి ప్రయత్నంలో సక్సెస్ కొట్టి.. మేఘాంష్ విజయ తీరాలను చేరుకున్నాడా? అన్నది చూద్దాo. కథ : తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ రాజ్‌దూత్. ప్రియ (నక్షత్ర)ను తనకిచ్చి చెయ్యాలంటే రాజ్దూత్ను తీసుకురావాలని కండీషన్ పెడతాడు హీరోయిన్ తండ్రి. ఇరవై ఏళ్ల క్రితం వదిలేసిన రాజ్దూత్ను తీసుకు రావడానికి మేఘాంష్ చేసిన ప్రయత్నాలే ఈ కథ. అసలు రాజ్దూత్కు హీరోకు ఉన్న సంబంధం ఏంటి?, చివరకు మేఘాంష్ రాజ్దూత్ను సంపాదించాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు : తను ప్రేమించిన అమ్మాయి కోసం కష్ట పడే పాత్రలో సంజయ్గా మేఘాంష్ బాగానే ఆకట్టుకున్నాడు. మొదటి ప్రయత్నం కాబట్టి మరీ ఎక్కువ ఆశించడం భావ్యం కాదు. అయితే డైలాగ్ డెలివరీలో.. నటనలో ఇంకాస్త మెరుగు పడాలి. ప్రియ పాత్రలో నక్షత్ర కనిపించేది కొద్ది సేపే అయినా ఆకట్టునే ప్రయత్నం చేసింది. రాజన్నగా ఆదిత్య బాగానే నటించాడు. స్నేహితుడి క్యారెక్టర్లో సుదర్శన్ నవ్వులు పూయించాడు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ : అర్జున్, కార్తీక్ దర్శకులుగా మామూలు కథను.. మరింత తీసికట్టుగా తెరకెక్కించారు. ఏ కోశాన కూడా ప్రేక్షకులు లీనమయ్యేట్టు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయారు. మేఘాంష్ వయసుకు సరిపడే కథే అయినా.. దాన్ని తెరపై అంతే పట్టుతో చూపెట్టలేకపోయారు. ఇలా నాసిరకంగా సినిమాను తీయడంతో.. మేఘాన్ష్కు ఈ చిత్రం ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. కథే చిన్న పాయింట్ కావడం.. దాన్ని కూడా పట్టులేకుండా తెరకెక్కించడం మైనస్ పాయింట్. సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు కూడా చిత్రాన్ని నిలబెట్టలేకపోయారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సంగీతం ఏవీ కూడా ఆశించిన స్థాయిలో లేవు. ప్లస్ పాయింట్స్ : కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథాకథనాలు దర్శకత్వం -బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్. -
రియల్ స్టార్ టైటిల్ మా ఇద్దరిదీ!
‘‘ప్రసుత్తం బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాను. స్టూడెంట్‌గా ఓ 70 శాతం మార్కులు వస్తాయి. చిన్నప్పట్నించి సినిమాల్లోకి రావాలనే ఐడియాతోనే పెరిగాను. అందుకే సినిమా తప్ప నాకు ఏమీ తెలియదు. మా నాన్న కూడా ‘మా చిన్నోడు హీరో అవుతాడు, పెద్దోడు డైరెక్టర్ అవుతాడు’ అని చెప్పేవారు. అది అలాగే నా మైండ్‌లో పడిపోయింది’’ అన్నారు మేఘాంశ్. దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి రెండో కుమారుడు మేఘాంశ్. అర్జున్–కార్తీక్‌ల దర్శకత్వంలో సత్యనారాయణ నిర్మించిన ‘రాజ్‌దూత్’ చిత్రం ద్వారా మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ శుక్రవారం విడుదల సందర్భంగా మేఘాంశ్ చెప్పిన విశేషాలు. శ్రీహరి గారి రియల్ స్టార్ టైటిల్ మీ ఇద్దరిలో ఎవరు తీసుకుంటారు? అని కొంతమంది అడిగారు. ఆ టైటిల్ నా ఒక్కడిదే కాదు, నాది, మా అన్నయ్య శశాంక్ ది. నాది అమ్మ పోలిక, కానీ నాన్న యంగ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు నేను అలానే ఉన్నాను అంటున్నారు. అన్నయ్య ఇంకా ట్రైన్ అవుతున్నాడు. మరో నాలుగైదేళ్లల్లో దర్శకుడు అవుతాడు. మా అమ్మ, అన్న ఎప్పుడూ గైడ్ చేస్తారు నన్ను. ఫ్యూచర్లో నాతో, అన్నతో సి.కళ్యాణ్ మామ సినిమా చేస్తాను అన్నారు. ♦ నాన్న మరణం తర్వాత అనుకోకుండా ఇండస్ట్రీకి అలా దూరమైపోయాం. ఈ గ్యాప్‌లో మేం పర్సనల్‌గా ఫుల్ స్ట్రగుల్ అయ్యాం. అమ్మని మేం చూసుకోవటం, ఆమె మమ్మల్ని చూసుకోవటం జరిగింది. సడెన్‌గా ఇలా హీరోలా ఎంట్రీ ఇస్తే అందరూ నిండు మనసుతో ఆదరించారు. సినీ పరిశ్రమ మొత్తం వెల్కమ్ చేస్తూ ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ♦ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. 44 డిగ్రీస్ ఎండల్లో హైదరాబాద్, రాజమండ్రి, రంపచోడవరంలలో షూటింగ్ జరిపాం. మంచి అవుట్ పుట్ వచ్చింది. ఇది హారర్ జానర్ అని, ఇలా ఒక జానర్ అని అనుకోలేం. రెండు, మూడు జానర్లు కలిసిన కథ. ♦ ఇలాంటి ఓ సినిమా ఉందని టీజర్ లాంచ్ వరకు ఎవరికీ తెలియక పోవటానికి కారణం మొదట్లో చాలా ప్రెజర్ ఉండేది. మా అమ్మ షూటింగ్‌కి వస్తేనే నాకు చాలా ఒత్తిడిగా ఉండేది. ఇక అందరికీ చెప్పి చేస్తే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పకుండా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి టీజర్‌తో మీ ముందుకు వచ్చాను. కొంచెం సినిమా రోడ్ జర్నీతో ముడిపడి ఉంటుంది. ఈ సినిమాకి ‘రాజ్ దూత్ ’ టైటిల్ ఫుల్ యాప్ట్. ఇది కమర్షియల్ సినిమానే కానీ, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నా ఫేస్‌కి, నా ఏజ్‌కి ఇది కరెక్ట్ సినిమా అనిపించింది. ♦ మొన్న అమ్మకు సినిమా చూపించాను. మొదట్లో అమ్మ కొంచెం నెర్వస్‌గా ఉండేది. సినిమా అవుట్‌పుట్ ఎలా వస్తుందో అని. సినిమా చూశాక ఆమె ప్రౌడ్‌గా ఫీలయ్యింది. ‘ఏందిరా ఇంత తెల్లగా ఉన్నావు’ అంది. ఇంట్లో మేం డాన్స్ వేసినప్పుడల్లా అమ్మ గైడ్ చేసేది. అంత పెద్ద డాన్సర్ మా ఇంట్లోనే ఉందిగా మరి. ♦ నాన్న ఉన్నప్పుడు అందరినీ బాగా చూడు, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, అందరూ సమానమే అని చెప్పేవారు. అందరికీ హెల్ప్ చేయాలనేవారు. నాన్న ఉండి ఉంటే ఇంకా బెటర్ లాంచ్ డెఫినెట్‌గా ఉండేది. ♦ ఈ సినిమా స్టార్ట్ అవక ముందు ఓ నెలరోజుల పాటు నటనలో బేసిక్ ట్రైనింగ్ తీసుకొన్నాను. స్కూల్లోనే థియేటర్ యాక్టింగ్ మీద అవగాహన ఉంది. మా సినిమాలోని బైక్ వాయిస్ టీజర్‌కి మాత్రమే ఉంటుంది. సునీల్‌గారు వాయిన్ ఓవర్ చెప్పారు. సినిమాలో బైక్‌కి వాయిస్ ఉండదు. ♦ మా సినిమాకి ఇద్దరు దర్శకులు. అర్జున్ అండ్ కార్తీక్. వాళ్లు దర్శకుడు సుధీర్ వర్మ దగ్గర రైటర్స్‌గా ఉండేవాళ్లు. నాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఓ డౌట్ ఉండేది. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే సినిమా ఆగిపోతుందేమో అనుకొనేవాణ్ని. ఇద్దరూ మంచి కో– ఆర్డినేషన్‌తో ఒకే మాట మీద ఫుల్ క్లారిటీతో ఉంటారు. నిర్మాత సత్యనారాయణ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. -
‘అందుకే రహస్యంగా షూటింగ్ చేశాం’
శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకుల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ మీడియాతో మాట్లాడారు.. హీరోగా మీ మొదటి సినిమా రాజ్‌దూత్ రిలీజ్ అవుతుంది ఎలా ఫీల్ అవుతున్నారు? హీరోగా ఇది నా మొదటి సినిమా, ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మండుటెండల్లో చిత్రీకరణ చేశాం. నిర్మాత కూడా ఈ చిత్ర నిర్మాణం కొరకు చాలా కష్టపడ్డారు. చిత్రాన్ని చాలా రహస్యంగా చిత్రీకరించారు ఎందుకు? కేవలం ఒత్తిడి తగ్గించడానికే సినిమా షూటింగ్ ఎటువంటి ప్రచారం లేకుండా రహస్యంగా చిత్రీకరించడం జరిగింది. సినిమాపై ప్యాషన్ తోనే హీరో అయ్యారా? చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టి పెరిగినవాడిగా, సినిమాపై ఫ్యాషన్ ఉంది. అలాగే నాన్న కూడా ఓ సందర్భంలో చిన్నవాడిని యాక్టర్‌ని, పెద్దవాడిని డైరెక్టర్ని చేస్తాను అన్నారు. దానితో ఆయన కోరిక మేరకు కూడా హీరో అయ్యాను. సినిమాకు రాజ్‌దూత్ అని బైక్ పేరు ఎందుకు పెట్టారు? చాలా మంది అడుగుతున్న ప్రశ్నఇది. ఈ మూవీలో హీరో తనకిష్టమైన రాజ్ దూత్ బైక్ కోసం, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై అన్వేషిస్తూ ఉంటాడు. రాజ్ దూత్ రోడ్ జర్నీలో సాగే థ్రిల్లర్ మూవీనా? సినిమాలో కొంత భాగం రోడ్ జర్నీలో సాగుతుంది, ఐతే ఇది థ్రిల్లర్ మూవీ కాదు, రెండు మూడు, విభిన్న జోనర్స్లో సాగే ఓ వైవిధ్యమైన కమర్షియల్ చిత్రం అని చెప్పవచ్చు. మీరు హీరో అవుతున్నారంటే మీ అమ్మ గారు ఎలా స్పందించారు? అమ్మ చాలా సంతోషించారు, అలాగే సినిమా ఎలా వస్తుందో అని కొంచెం కంగారుకూడా పడ్డారు. ఐతే నేను సినిమాను అమ్మకు చూపించాను, ఆమెకు చాలా బాగా నచ్చింది. మీ నాన్న గారి నటనలో మీకు నచ్చిన కోణం ఏమిటి? ఆయన నటనలో ప్రతి కోణం నాకు నచ్చుతుంది. ఎమోషనల్ అయినా, యాంగ్రీ సన్నివేశాలలోనైనా ఆయన నటన చాలా బాగుంటుంది. నటనలో శిక్షణ తీసుకున్నారా? సినిమాకి ముందు కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నాను. అలాగే స్కూల్ ఏజ్ నుండి థియేటర్ డ్రామాలలో నటించిన అనుభవం కూడా ఉంది. కెమెరా ముందు మొదటి అనుభవం ఎలా అనిపించింది? మొదట్లో కొంత కంగారుపడ్డాను, తరువాత మెల్లగా అలవాటు పడ్డాను. ఇండస్ట్రీ నుండి మీకు అందిన సపోర్ట్ గురించి చెబుతారా? ఇండస్ట్రీ మాపై చాలా అభిమానం, ప్రేమా చూపించింది. సాయి ధరమ్ తేజ్ అన్న, అలాగే మంచు మనోజ్ అన్న కాల్ చేసి మరి అభినందించారు. నాన్నగారి సినిమాలలో మీకు నచ్చిన చిత్రం? చాలా ఉన్నాయి. భద్రాచలం, ఢీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా! సినిమాలంటే చాలా ఇష్టం. ఈ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పండి? అర్జున్, కార్తీక్ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర పనిచేశారు. వీళ్లద్దరి మధ్య వర్క్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసింది. అలా ఏం కాకుండా (నవ్వుతూ) ఇద్దరు చిత్రాన్ని పూర్తి చేశారు. మూవీలో జర్నీ ప్రధానంగా సాగుతుందా? ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్, లవ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. జర్నీ కేవలం చిత్రంలో ఒక భాగం మాత్రమే.