'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ | Satya Narayana Starrer Manyam Dheerudu Movie Review in Telugu | Sakshi
Sakshi News home page

Manyam Dheerudu Movie Review: మన్యం ధీరుడు మూవీ రివ్యూ

Published Fri, Sep 20 2024 8:36 PM | Last Updated on Fri, Sep 20 2024 8:40 PM

Satya Narayana Starrer Manyam Dheerudu Movie Review in Telugu

బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయన జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా, వెండితెరపై చూసినా ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. అలాంటి పాత్రలో రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. 

మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకున్నారో చూసేద్దాం..

కథ
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు వారి తుపాకీ గుళ్లకు బలై నేలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి... బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? పేద ప్రజలకు ఉన్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
టెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు విప్లవ వీరుల కథలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గతంలో అల్లూరి సీతారామరాజు జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం... వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్‌కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి.

అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం, బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేషాలు మాస్‌ ఆడియన్స్‌ను అలరిస్తాయి. సత్యనారాయణ రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ స్పష్టంగా వుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా వున్నా... సెకెండాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల  సినిమా పరుగులు పెడుతుంది. జబర్దస్థ్ అప్పారావుతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా... ఓ యువజంట ప్రేమాయణం గురించి కథకు అవసరం లేకున్నా బలవంతంగా చొప్పించారనిపిస్తుంది.

మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో... బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే... వాళ్లకు ఎందుకు పన్ను కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అంశాలను బాగా చూపించారు.

రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా నేర్చుకుని నటించడం విశేషం. బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ చివరి దాకా బాగా నటించారు.జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా... నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నేచురల్‌గా వేశారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రాంతాల అందాలను కెమెరాలో బంధించారు. అల్లూరి సీతారామరాజు ఎలివేషన్‌ షాట్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌ ఓకే. రెండుగంటలలోపే నిడివి వుండటం ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్ కథను బాగానే డీల్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement