all is well
-
పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆరోగ్యం విషయంలో అడపా దడపా అభిమానులు షాక్‌కి గురయ్యే వార్తలు బయటికొస్తుంటాయి. తాజాగా ఆయన చెనై్నలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారనే వార్త ఫ్యాన్స్‌ని కలవరానికి గురి చేసింది. గత ఏడాది మణిరత్నంకు గుండె పోటు వచ్చిన విషయం తెలిసిందే. చికిత్స తీసుకున్న ఆయన కోలుకున్నారు. ఇప్పుడు భారీ మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ పనుల్లో ఉన్న మణి ఆస్పత్రిలో చేరారని వార్త రావడంతో ఏమై ఉంటుంది? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ‘ఆల్ ఈజ్ వెల్’ అని స్పష్టం చేశారు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని. ‘‘నా భర్త ఈ రోజు (సోమవారం) ఉదయం పని చేయడానికి వెళ్లారు. ‘నామ్ ఉమన్’ ట్రస్ట్ కోసం మా ఇంట్లో వర్క్‌షాప్ ఏర్పాటు చేశాను. ట్రస్ట్ కోచ్ రూపా రోటీలు, మామిడికాయ పచ్చడి తీసుకొస్తే, ఆయన ఇష్టంగా తిని, స్క్రిప్ట్‌లో మరింత స్పైస్ యాడ్ చేయడం కోసం ఆఫీస్‌కి వెళ్లారు’’ అని సుహాసినీ మణిరత్నం తెలిపారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ విషయానికి వస్తే.. ప్రముఖ తమిళ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, ఐశ్వర్యా రాయ్, అనుష్క, శింబు, కార్తీ, కీర్తీ సురేష్.. ఇలా పలువురు ప్రముఖ తారలు నటించనున్నారని సమాచారం. నటీనటుల గురించి ఇంకా మణిరత్నం అధికారికంగా ప్రకటించలేదు. -
త్వరలో సెట్స్ మీదకు ‘ఆల్ ఈజ్ వెల్’
శతమానం భవతి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న తరువాత శ్రీనివాస కల్యాణం సినిమాతో తడబడ్డాడు. దీంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సతీష్ ప్రస్తుతం మరో ఇంట్రస్టింగ్ సినిమాతో రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు ఈ దర్శకుడు. ‘ఆల్ ఈజ్ వెల్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమాను రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించనున్నారు. శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన సతీష్ వేగేశ్న ఆల్ ఈజ్ వేల్‌ను కూడా అదే తరహా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించానున్నారు. -
జనమంతా ఖుష్
-
జనమంతా ఖుష్
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్ - సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరుతున్నాయి - వచ్చే నెలలో పార్టీ సంస్థాగత ఎన్నికలు - 6వ తేదీన గ్రామ కమిటీలకు.. 12, 13న మండల కమిటీలకు.. - 21న అధ్యక్షుడి ఎన్నిక.. ప్లీనరీ - 27న వరంగల్‌లో బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని, ప్రజలు అధికారం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముఖ్యపాత్ర పోషించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతోపాటు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. శనివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ప్లీనరీ నిర్వహణ, పార్టీ వార్షికోత్సవ సభ తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఏర్పాటు చేసే పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు సూచించారు. ఈసారి బడ్జెట్లో కొత్తగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేశామని.. దాని స్ఫూర్తిని అర్థం చేసుకుని ఆయా వర్గాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేయాలన్నారు. ఇక బీసీ వర్గాలు, కులవృత్తులకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని.. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. పార్టీ సంస్ధాగత ఎన్నికల తేదీలు ఖరారు ఏప్రిల్ 6న పార్టీ గ్రామ కమిటీల ఎన్నిక.. 12, 13 తేదీల్లో మండల కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 14వ తేదీన రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక నోటిఫికేషన్, 18న నామినేషన్ల స్వీకరణ, 20న నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉంటుందని తెలిపారు. 21న హైదరాబాద్ సమీపంలోని కొంపల్లిలో ప్లీనరీ నిర్వహిస్తామని, అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్లీనరీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లు, సహకార బ్యాంకు చైర్మన్లు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, నియోజకవర్గ ఇన్చార్జులు, నగర మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ఆత్మ కమిటీ సభ్యులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. వరంగల్ సభకు అయ్యే ఖర్చుల కోసం పార్టీ నాయకులు శ్రమదానం చేసి విరాళాలు సేకరించాలని కేసీఆర్ సూచించారు. తాను కూడా శ్రమదానం చేసి విరాళాలు సేకరిస్తానని.. పార్టీ నాయకులంతా నియోజకవర్గాల్లో శ్రమదానం చేయాలని చెప్పారు. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నాయిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నిర్వహించే ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నాయిని నర్సింహారెడ్డిని నియమించారు. గ్రామ శాఖ, మండల శాఖ ఎన్నికలకు కూడా రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎన్నికలు, బహిరంగసభ ఏర్పాట్లు, జన సమీకరణకు రాష్ట్రస్థాయిలో సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డిలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. వరంగల్(రూరల్), వరంగల్ (అర్బన్), జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తారు.. ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలకు సముద్రాల వేణుగోపాలాచారి.. మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వి.గంగాధర్.. హైదరాబాద్ జిల్లాకు బొంతు రామ్మోహన్‌లను ఇన్చార్జులుగా నియమించారు. -
అంతా ఓకే..!
అనంతపురం సిటీ : సర్వజనాస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు సంతృప్తిగా ఉన్నాయని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. స్థానిక సర్వజనాస్పత్రిని ఆయన శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం దాకా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత చిన్న పిల్లల వార్డుకు వెళ్లిన ఆయన అక్కడ పిల్లలకు వైద్యులు అందిస్తున్న సేవల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వార్డులో వైద్యసేవలు పొందుతున్న నలుగురు అనాథ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో వైద్యులు సుధీర్‌బాబు, డాక్టర్ మల్లేశ్వరీ వార్డులో పిల్లల సంఖ్య బాగా పెరుగుతోందని అందుకు తగ్గ విధంగా స్టాఫ్ లేరని సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఐదు మంది నర్సులతో పాటు ఒక సహాయకులు, త్వరలో ఒక వైద్యుడిని నియమిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం టీబీ, మెటర్నరీ, ఇన్సెంట్స్న్యూ కేర్, ఎస్ఎన్సీయూ, ఎన్‌ఐయూ వార్డులు పరిశీలించారు. -
‘ఆల్ ఈజ్ వెల్’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్
ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ఆల్ ఈజ్ వెల్ ఘన విజయం సాధించాలన్న ఆకాంక్షను ‘ఎస్బీఎస్ బయోటెక్’ వ్యక్తంచేసింది. ఈ సంస్థ కీళ్ల నొప్పులకు మందుగా ‘డాక్టర్ ఆర్థో’ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వ్యక్తీ తన జీవనగమన గమనంలో ఎదుర్కొనే కష్టనష్టాలు సంబంధిత కుటుంబంపై ప్రభావం చూపుతాయన్న కథాగమనం.. ఎస్బీఎస్ బయోటెక్‌ను ఆకర్షించినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తి ఆరోగ్యాన్ని, వంటి నొప్పులను సైతం పట్టించుకోడని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ ఆర్థో ఉత్పత్తి బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చిత్ర ప్రమోషన్‌కు సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన ‘మీట్-గ్రీట్’ కార్యక్రమంలో చిత్ర యూనిట్, ఎస్బీఎస్ బయోటెక్ సిబ్బంది పాల్గొన్నారు. -
హృదయం ఇక్కడ ఉన్నది...
‘ఆల్ ఈజ్ వెల్’ టైటిల్ అసిన్ (29)కు కలిసొచ్చినట్టుంది. ఆ టైటిల్‌కు తగినట్టుగానే ఆమె వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం ఆల్ ఈజ్ వెల్‌గా ఉండబోతోంది. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ తాజా బాలీవుడ్ సినిమాలో అసిన్, అభిషేక్ బచ్చన్ పక్కన కనిపించనుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ హడావిడి కంటే అసిన్ పెళ్లి వార్త హడావిడే ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉంది. అవును. అసిన్ పెళ్లి చేసుకోబోతోంది. తను నటించిన ‘గజిని’ సినిమాలోలానే ఒక పెద్ద కోటీశ్వరుణ్ణి, పారిశ్రామికవేత్తను పెళ్లాడనుంది. సినిమా నిజమైంది... సంజయ్ రామస్వామి ప్రఖ్యాత మొబైల్ కంపెనీ అధినేత. కోటీశ్వరుడు. కాని అతడు ఒక సాదాసీదా మోడల్ ప్రేమలో పడతాడు. ఇది ‘గజిని’ సినిమాలో మనం చూశాం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరిగింది. మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీ కో - ఫౌండర్, సి.ఇ.ఓ అయిన రాహుల్ శర్మ (36), అసిన్ ప్రేమలో పడ్డాడు. అసిన్ అతణ్ణి ఇష్టపడింది. వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అసిన్ ఈ వార్తను ధ్రువీకరించిందని భోగట్టా. ‘గజిని’ సినిమాలో తన దగ్గర ఏమీ లేకపోయినా సాటివారికి సాయం చేసే పాత్రలో అసిన్ నటించింది. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె అలాంటి స్వభావం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. చాలామంది పేద అమ్మాయిలను అసిన్ చదివిస్తోంది. శ్రీలంకలో షూటింగ్ చేయడానికి వెళ్లి అక్కడ తమిళ శిబిరాల వారి పరిస్థితికి చలించి వారి కోసం హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. ముంబైలో అనేక ఎన్జిఓలకు ఆమె సపోర్ట్ చేస్తోంది. ‘గజిని’లో ఆమెకు హీరో లభించకపోయి ఉండవచ్చు. కాని నిజ జీవితంలో రాకుమారుడు అందాడు. ‘ఆమె తన వృత్తిగతమైన ఒడంబడికలను త్వరగా ముగించుకుని వ్యక్తిగత జీవితానికి అంకితం కాదలుచుకుంది. బహుశా సినిమాలకు స్వస్తి కూడా చెప్పవచ్చు’ అని ఆమె సన్నిహితురాలు ఒకరు వ్యాఖ్యానించారు. ఎవరీ రాహుల్ శర్మ నాగపూర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ తర్వాత కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఇండియా తిరిగి వచ్చి మైక్రోమాక్స్ సంస్థను ప్రారంభించాడు. మొదట సాఫ్ట్వేర్ రంగంలో పని చేసిన ఈ సంస్థ క్రమంగా మొబైల్స్ రంగంలోకి వచ్చింది. ‘ఎక్కువ సమయం నిలబడగల బ్యాటరీ ఉండే మొబైల్‌ను’ వినియోగదారులకు అందించడం అనే ఐడియా నుంచి మైక్రోమాక్స్ మొబైల్స్‌ను మార్కెట్లోకి తెచ్చే ఆలోచనను రాహుల్ శర్మే చేశాడు. కొత్తల్లో ఇది అంత సులువు కాలేదు. కాని రాను రాను భారతీయ మార్కెట్లో మైక్రోమాక్స్ సంస్థ తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంది. అక్షయ్ కుమార్ మధ్యవర్తిత్వం... అసిన్‌కు, రాహుల్ శర్మకు పరిచయం ఏర్పడటానికి హీరో అక్షయ్ కుమార్ కారణం. అసిన్, అక్షయ్‌కుమార్ కలిసి ‘ఖిలాడీ 786’ (2012)లో నటించారు. అక్షయ్ కుమార్ అప్పటికే మైక్రోసాఫ్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అందువల్ల సాధారణంగా జరిగే సినిమా పార్టీల్లో వీళ్లను ఒకరికొకరిని పరిచయం చేసి ఉంటాడని భావిస్తున్నారు. అసిన్ అప్పటికే బాలీవుడ్లో టాప్‌స్టార్. ఆమె బాలీవుడ్లో నటించిన తొలి సినిమా ‘గజిని’ వంద కోట్లు వసూల్ చేసిన తొలి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. దానికి ముందే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ రాహుల్ ఆమె వైపు ఆకర్షింపబడటానికి కారణం అయ్యుండొచ్చు. రాహుల్ శర్మ అందగాడు కావడం, పారిశ్రామికవేత్తగా విజయాలు సాధించడం ఒక ఎత్తయితే అతడికి సంగీతం అంటే ఉండే ఆసక్తి, కార్ల మీద ఉండే క్రేజ్, కొత్త ప్రాంతాలు చూడాలనుకునే ఉత్సుకత ఇవన్నీ అసిన్‌కు నచ్చి ఉంటాయని ఊహించవచ్చు. రాహుల్ శర్మ దగ్గర ప్రస్తుతం ఒక రోల్స్ రాయిస్, బెంట్లే, బిఎండబ్ల్యు, మెర్సిడస్ ఉన్నాయి. అమెరికా వెళితే ఒక కారు తీసుకుని తోచిన ప్రాంతానికి వెళ్లిపోవడం అతడికి సరదా. సంగీతం అంటే ఇష్టం. అసిన్‌ను ఆకట్టుకోవడానికి ఇంతకు మించి ఏం కావాలి అంటున్నారు. కేరళ నుంచి కోట్లకు... కొచ్చిలో పుట్టి పెరిగిన అసిన్ది దాదాపుగా మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి మధ్యతరగతి వ్యాపారాలు చేసేవాడు. తల్లి డాక్టర్. మొదట మోడలింగ్‌లో అడుగుపెట్టిన అసిన్ 2001లో తొలిసారిగా మలయాళ సినిమాలో కనిపించింది. అయితే ఆమెను వెలుగులోకి తెచ్చింది మాత్రం తెలుగు సినిమా రంగమే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా... నాన్నా... ఓ తమిళ అమ్మాయి’ సినిమా అసిన్‌ను తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడేసింది. అదే సినిమా తమిళంలో రిమేక్ అయ్యి, అక్కడా హిట్ సాధించి అసిన్‌ను బిజీ చేసింది. తెలుగులో ‘ఘర్షణ’, ‘లక్ష్మీ నరసింహ’, ‘చక్రం’ సినిమాల్లో నటించిన అసిన్ ‘గజిని’ సినిమాతో పెద్దస్థాయిని అందుకుంది. కమలహాసన్ సరసన ‘దశావతారం’లో నటించే అవకాశం కూడా దక్కించుకోవడంతో నం.1 సౌత్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు రావడం కెరీర్ తొలి రోజుల్లోనే ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ సరనన నటించడం ఆమెకు పెద్ద హోదాను తెచ్చాయి. ప్రస్తుతం అసిన్ ముంబైలోని లోఖండ్వాలాలో నివాసం ఉంటుంది. కొచ్చి మెరైన్ డ్రైవ్‌లో ఆమెకు ఖరీదైన అపార్ట్మెంట్ ఉంది. కొట్టాయం సమీపంలో ఉన్న వెగమాన్ అనే హిల్ స్టేషన్లో ఆమెకు ఒక సొంత ఫామ్ హౌస్ కూడా ఉంది. -
వాళ్లతో సినిమా అంటే ఎగిరి గంతేస్తా..!
‘‘ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించిన ‘ఓ మై గాడ్’ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా ‘ఆల్ ఈజ్ వెల్’ వంటి మంచి కథతో ఆయన నన్ను కలిశారు’’ అని హీరో అభిషేక్ బచ్చన్ చెప్పారు. అభిషేక్ బచ్చన్, రిషికపూర్, అశిన్, సుప్రియా పాథక్ ముఖ్య తారలుగా రూపొందిన ‘ఆల్ ఈజ్ వెల్’ ఈ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో అభిషేక్, ఉమేశ్ పాల్గొన్నారు. ఈ చిత్రకథ రాసుకున్న తర్వాత శ్రవణ్‌కుమార్ పాత్రకు అభిషేక్ తప్ప వేరే ఎవరూ సూట్ కారనుకున్నానని, ఆయన తండ్రిగా రిషి కపూర్ నటిస్తేనే బాగుంటుందని అనుకున్నానని దర్శకుడు తెలిపారు. తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని కూడా అన్నారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ - ‘‘ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్. చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా’’ అన్నారు. మీకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? అని అభిషేక్‌ని అడిగితే - ‘‘నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ సందర్భంలో షారుక్ ఖాన్ని కలిశాను. అప్పుడాయన్ను ‘మీ డ్రీమ్ రోల్ ఏంటి?’ అనడిగితే.. ‘‘అసలు నేనీ స్థాయికి వస్తానని అనుకోలేదు. వచ్చాను. చేసే ప్రతి పాత్రను నా డ్రీమ్ రోల్లానే భావిస్తాను’’ అన్నారు. ఇప్పుడు నేనూ అదే చెబుతున్నా. ప్రతి పాత్రా నాకు డ్రీమ్ వంటిదే’’ అన్నారు. మీ నాన్నగారు అమితాబ్ బచ్చన్, మీరు, మీ భార్య. మీ ముగ్గురూ కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు? అంటే, ‘‘నాన్నతో సినిమా అంటే ఎగిరి గంతేస్తా. భార్యతో సినిమా అంటే కూడా అంతే. కానీ, రచయితలు కథ తయారు చేయాలి కదా’’ అని అభిషేక్ చెప్పారు. -
చక్కనమ్మా.. కాస్త చిక్కవమ్మా..
చక్కనమ్మ చిక్కినా అందమే కానీ.. బక్కనమ్మ ఒళ్లు చేస్తేనే కష్టం. ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమా క్లాప్ కొట్టే టైంలో మెరుపుతీగలా ఉన్న అసిన్.. ఈ మధ్య కాస్త వెయిట్ పెరగడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అసిన్ షెడ్యూల్ పూర్తయింది. అయితే ఇందులో నటించిన స్మృతి ఇరానీ ప్లేస్‌లో సుప్రియా పాఠక్‌ను తీసుకోవాల్సి వచ్చింది. దీంతో అసిన్, స్మృతి ఇరానీ కాంబినేషన్లోని సీన్లు రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలో అసిన్ వెయిట్ పెరగడంతో కాస్త చిక్కవమ్మా అంటూ అసిన్ ముందు ప్రొడ్యూసర్లు పొర్లు దండాలు పెడుతున్నారు. -
వీకెండ్స్‌లో మాత్రమే నటిస్తా: కేంద్రమంత్రి
ప్రముఖ నటీ స్మృతీ ఇరానీ కేంద్రమంత్రి అయిన తర్వాత మహాబిజీ అయిపోయారు. దాంతో ఆమె నటించేందుకు సమయం చిక్కడం లేదు. దీంతో వీకెండ్స్‌లో రోజుల్లో మాత్రమే నటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉమేష్ శుక్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆల్ ఈజ్ వెల్. ఆ చిత్రంలో అభిషేక్ బచ్చెన్ తల్లి పాత్రలో స్మృతీ ఇరానీ నటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే స్మృతీ ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఎన్నికలైన తర్వాత ఆమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం... అది అత్యంత ముఖ్యమైన శాఖలో ఒకటైనా మానవ వనరుల శాఖను చేపట్టారు. దీంతో స్మృతి నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న హీరో నుంచి లైట్ బాయ్ వరకు చిత్ర యూనిట్ అంతా స్మృతి ఎలా అంటే అలా అని ప్రకటించేశారని సమాచారం. ఆల్ వెల్ చిత్రంలో స్మృతి ఇరానీ భర్తగా రిషి కపూర్ నటిస్తున్నారు. -
అసిన్ రిటర్న్స్
దక్షిణాదిలో ముఖ్యంగా తమిళతం, తెలుగు భాషల్లో నటిగా తన సత్తా చాటుకున్న హీరోయిన్లలో నటి అసిన్ ఒకరు. గజిని చిత్రంలో ఈ భామ నటనా ప్రతిభను ఆమె అభిమానులు మరచిపోలేదు. ఆమెను బాలీవుడ్కుతీసుకెళ్లింది కూడా ఆ చిత్రమే. హిందీ గజిని చిత్రం అసిన్‌ను ఉత్తరాది అభిమానులకు దగ్గర చేసినా, దక్షిణాది అభిమానులకు ఆమెను దూరం చేసింది. అసిన్ దక్షిణాది చిత్రాలో నటించి మూడేళ్లకు పైనే అయ్యింది. అయితే బాలీవుడ్లో గజిని మినహా చెప్పుకోదగ్గ విజయాలేమీ వరించలేదన్నది నిజం. ప్రస్తుతం అవకాశాలు కూడా అంత ఆశాజనకంగా లేవు. అసిన్ హిందీలో ఆల్ ఈజ్ వెల్ అనే ఒకే ఒక్క చిత్రం చేస్తున్నారు. కొత్త అవకాశాలు కూడా దరిదాపుల్లో లేవని సమాచారం. దీంతో అసిన్ మళ్లీ దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన మైక్రోబ్లాగ్‌లో పేర్కొన్నారు. మళ్లీ తమిళ చిత్రాల్లో నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు ఈ ముద్దుగుమ్మ పేర్కొనడం విశేషం. అయితే కొలీవుడ్లో ఇప్పుడు అనుష్క, నయనతార, హన్సిక, సమంతల హవా కొనసాగుతోంది. లక్ష్మీమీనన్, ప్రియాఆనంద్ వంటి వర్ధమాన హీరోయిన్లు కూడా విజయాలతో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అసిన్ మళ్లీ కోలీవుడ్‌లో పాగా వేసేనా? ఒక వేళ అలా జరిగితే ఆమె కంటే ఆనందించేది ఆమె అభిమానులే. అసిన్ చివరిగా మూడేళ్ల క్రితం విజయ్ సరసన కావలన్ చిత్రంలో నటించారు. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చినా ఆమె అంగీకరించలేదు. మరి ఇప్పుడామెను తమిళ చిత్ర పరిశ్రమ అంగీకరిస్తుందా? వేచి చూడాల్సిందే.