సర్వజనాస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు సంతృప్తిగా ఉన్నాయని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు.
అనంతపురం సిటీ : సర్వజనాస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు సంతృప్తిగా ఉన్నాయని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. స్థానిక సర్వజనాస్పత్రిని ఆయన శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం దాకా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత చిన్న పిల్లల వార్డుకు వెళ్లిన ఆయన అక్కడ పిల్లలకు వైద్యులు అందిస్తున్న సేవల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వార్డులో వైద్యసేవలు పొందుతున్న నలుగురు అనాథ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ క్రమంలో వైద్యులు సుధీర్‌బాబు, డాక్టర్ మల్లేశ్వరీ వార్డులో పిల్లల సంఖ్య బాగా పెరుగుతోందని అందుకు తగ్గ విధంగా స్టాఫ్ లేరని సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఐదు మంది నర్సులతో పాటు ఒక సహాయకులు, త్వరలో ఒక వైద్యుడిని నియమిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం టీబీ, మెటర్నరీ, ఇన్‌సెంట్స్‌న్యూ కేర్, ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐయూ వార్డులు పరిశీలించారు.