సాక్షి, అనంతపురం: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ‘మృత్యు‘గంటలు’ మోగాయి. గంటల వ్యవధిలోనే 13మంది మృత్యుఒడికి చేరారు. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం వరకూ ఈ మరణాలన్నీ సంభవించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవన్నీ ఆస్పత్రిలోని ఏఎంసీ (అక్యూర్డ్ మెడికల్ కేర్) వార్డులో జరగడంతో అక్కడ ఆక్సిజన్ సరఫరా లేక మృతి చెందారా? అన్న అనుమానాలు మొదట్లో కలిగినా అలాంటిదేమీ లేదని తేలింది. మృతి చెందిన వారంతా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని వైద్యులు నిర్ధారించారు.
అసలేం జరిగిందంటే..:
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నిత్యం 800కు పైగా ఇన్‌పేషెంట్స్ ఉంటారు. వార్డుల్లో చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం క్షీణిస్తే అలాంటి వారిని ఏఎంసీకి తరలించి చికిత్స చేస్తారు. రోజూ సగటున ఐదుగురు వరకు మృతి చెందుతుంటారు. అయితే మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వరుసగా మరణాలు సంభవించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చివరగా (గురువారం ఉదయం) కుళ్లాయమ్మ, ఉమాదేవి, హనుమక్క మృతిచెందారు.
మృతుల వివరాలు - లక్ష్మిదేవి (25) – (నిమోనియా, సెప్టిసీమియా) కొట్టాలపల్లి, కణేకల్లు మండలం
- శ్రీరాములు (65) – (కిడ్నీ సమస్య) వైసీ పల్లి, కంబదూరు మండలం
- శారద (40) – (గుండె సమస్య) రాజీవ్‌కాలని, అనంతపురం
- ఓబన్న (95) – (తలలో రక్తం గడ్డకట్టి) బీజేపీ కాలని, అనంతపురం
- గంగమ్మ (45) – (తీవ్రమైన క్షయ), బొమ్మేపర్తి, రాప్తాడు మండలం
- ఆనంద్ (56) – (నిమోనియా), ఇరుపాపురం, గుత్తి మండలం
- సంజప్ప (70) – (ఊపిరితిత్తుల సమస్య), వేణుగోపాలనగర్, అనంతపురం
- తిరుపాల్ (55) – (ఊపిరితిత్తుల సమస్య), ముప్పాల, పెద్దవడుగూరు మండలం
- చెన్నమ్మ (80) – (రక్తహీనత, కిడ్నీ సమస్య), బీఎస్ నగర్, తాడిపత్రి
-కుళ్లాయమ్మ
-ఉమాదేవి
-హనుమక్క