అసిన్ రిటర్న్స్ | Asin to make a re-entry in South India | Sakshi
Sakshi News home page

అసిన్ రిటర్న్స్

Published Mon, Sep 1 2014 12:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అసిన్ రిటర్న్స్ - Sakshi

అసిన్ రిటర్న్స్

 దక్షిణాదిలో ముఖ్యంగా తమిళతం, తెలుగు భాషల్లో నటిగా తన సత్తా చాటుకున్న హీరోయిన్‌లలో నటి అసిన్ ఒకరు. గజిని చిత్రంలో ఈ భామ నటనా ప్రతిభను ఆమె అభిమానులు మరచిపోలేదు. ఆమెను బాలీవుడ్‌కుతీసుకెళ్లింది కూడా ఆ చిత్రమే. హిందీ గజిని చిత్రం అసిన్‌ను ఉత్తరాది అభిమానులకు దగ్గర చేసినా, దక్షిణాది అభిమానులకు ఆమెను దూరం చేసింది. అసిన్ దక్షిణాది చిత్రాలో నటించి మూడేళ్లకు పైనే అయ్యింది. అయితే బాలీవుడ్‌లో గజిని మినహా చెప్పుకోదగ్గ విజయాలేమీ వరించలేదన్నది నిజం. ప్రస్తుతం అవకాశాలు కూడా అంత ఆశాజనకంగా లేవు. అసిన్ హిందీలో ఆల్ ఈజ్ వెల్ అనే ఒకే ఒక్క చిత్రం చేస్తున్నారు.
 
 కొత్త అవకాశాలు కూడా దరిదాపుల్లో లేవని సమాచారం. దీంతో అసిన్ మళ్లీ దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన మైక్రోబ్లాగ్‌లో పేర్కొన్నారు. మళ్లీ తమిళ చిత్రాల్లో నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు ఈ ముద్దుగుమ్మ పేర్కొనడం విశేషం. అయితే కొలీవుడ్‌లో ఇప్పుడు అనుష్క, నయనతార, హన్సిక, సమంతల హవా కొనసాగుతోంది. లక్ష్మీమీనన్, ప్రియాఆనంద్ వంటి వర్ధమాన హీరోయిన్లు కూడా విజయాలతో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అసిన్ మళ్లీ కోలీవుడ్‌లో పాగా వేసేనా? ఒక వేళ అలా జరిగితే ఆమె కంటే ఆనందించేది ఆమె అభిమానులే. అసిన్ చివరిగా మూడేళ్ల క్రితం విజయ్ సరసన కావలన్ చిత్రంలో నటించారు. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చినా ఆమె అంగీకరించలేదు. మరి ఇప్పుడామెను తమిళ చిత్ర పరిశ్రమ అంగీకరిస్తుందా? వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement