అసిన్‌కు పెళ్లి కళ | Ghajini Actress Asin Gets Married? | Sakshi
Sakshi News home page

అసిన్‌కు పెళ్లి కళ

Published Fri, Aug 7 2015 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అసిన్‌కు పెళ్లి కళ - Sakshi

అసిన్‌కు పెళ్లి కళ

నటి అసిన్‌కు పెళ్లి కళ వచ్చిందా? అవుననే అంటున్నారు. సినీ వర్గాలు. దక్షిణాదిలో ఒక వెలుగు వెలిగి ఉత్తరాదికి ఎగబాకిన నటి అసిన్. గజినీ చిత్రం ఆమెను బాలీవుడ్‌లో పాపులర్ చేసింది. ఆ తరువాత అక్కడ వరుసగా అవకాశాలు పొందినా ప్రస్తుతం కొరవడ్డాయని చెప్పకతప్పదు. అక్టోబర్ 26కు అసిన్‌కు 30 ఏళ్లు నిండుతాయి. దీంతో అమ్మడు పెళ్లికి సిద్ధమైందట. వ్యాపారవేత్తతో మూడుముళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆ ఘడియలు రానున్నట్లు సమాచారం.
 
 అయితో ఈ విషయం గురించి అసిన్ ఏమంటుందో చూడండి. నేను హిందీలో చాలా తక్కువ చిత్రాలే చేశాను. అయితే గ్లామరస్ పాత్రల అవకాశాలు చాలానే వచ్చాయి. అలాంటి పాత్రలు పోషించడం ఇష్టం లేక అంగీకరించలేదు. అలాంటి పరిస్థితిలోనూ నేను కోరుకున్న పాత్రలు వస్తూనే ఉన్నాయి. అసలు అవకాశాలు రాకపోయినా బాధపడను.ఇక పొతే వ్యాపారవేత్తతో వివాహమా?అని అడుగుతున్నారు. నా వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ చర్చిలేదు. ఒక్క విషయం మాత్రం నిజం నాకింకా వివాహం జరగలేదు. పెళ్లి ఎప్పుడన్నది నిర్ణయించలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement