ఈ విష సంస్కృతి ఇక్కడ మామూలే
ఈ విష సంస్కృతి ఇక్కడ మామూలే
Published Tue, Dec 10 2013 12:55 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘మీడియానే అనుకుంటే... ఇండస్ట్రీ కూడా గాసిప్పులను సృష్టిస్తే ఎలా? నా కెరీర్‌ను నాశనం చేసేలా ఇలాంటి గాసిప్పుల్ని పుట్టించడం భావ్యం కాదు’’ అంటూ వాపోయారు అసిన్. ఇటీవల ఆమె అమెరికా పర్యటనకు వెళ్లారు. దాదాపు ఇరవై రోజుల పాటు ఈ పర్యటన సాగింది. అయితే... ఈ చిన్న వ్యవధిలో ఇండస్ట్రీలోనే అసిన్‌పై ఓ కొత్త వార్త హల్‌చల్ చేసింది. అసిన్ పెళ్లి పనిమీదే అమెరికా వెళ్లారని, కుర్రాడిది అమెరికానే అని, అక్కడ అసిన్‌కి వివాహం అయిపోయిందని ఈ వార్త సారాంశం.
అమెరికాలో ఉండగానే... ఈ విషయంపై పరిశ్రమ నుంచే అసిన్‌ను ఎన్నో ఫోన్ కాల్స్ వెంటాడాయట. దీన్ని ఆసరాగా తీసుకొని అక్కడి మీడియాలో కూడా కథనాలు ప్రసారమయ్యాయి. ఇండియా తిరిగి వచ్చాక ఈ విషయంపై అసిన్ ఉద్వేగానికి లోనయ్యారు. ‘ఇలాంటి విష సంస్కృతి బాలీవుడ్‌లో మామూలే. వీటన్నింటినీ తట్టుకుంటేనే ఇక్కడ ఉండగలం. పెళ్లి కాకుండానే సహజీవనం చేయడాలు, బాయ్‌ఫ్రెండ్స్‌తో విదేశాలు చుట్టి రావడాలు, ఏమీ లేకపోయినా... ఏదేదో జరుగుతోందని ఊహించి వ్యక్తులపై లేనిపోని అపవాదులు వేయడాలూ... ఇక్కడ ఇవన్నీ సాధారణం.
నేను మా కుటుంబంతో కలిసి టూర్‌కి వెళ్లాను. కానీ ఎవరికి తోచినట్టు వారు చెప్పుకున్నారు. ఇది నా కెరీర్‌పై ఎంతగా ప్రభావితం చేస్తుందో ఎవరూ అర్థం చేసుకోలేదు’’అని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇంతకీ పెళ్లెప్పుడూ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ -‘‘ఆ ఘడియ కూడా దగ్గరకు వచ్చేసింది. ప్రస్తుతం ఇంట్లోవారు అదే పనిమీద ఉన్నారు. ఇక్కడ చాలా మంది వివాహాలు చేసుకోకుండా లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటూ మన సంస్కృతిని పాడు చేస్తున్నారు. నేను అలాంటి దాన్ని కాదు. ఇంట్లోవారు చూసిన వారినే పెళ్లాడతా. అది కూడా మీకు చెప్పే చేసుకుంటా’’ అని చెప్పారు అసిన్.
Advertisement
Advertisement