Ghajini
-
గజినీ 2 తో 1000 కోట్లు కొట్టాలి
-
గజిని తమిళ నిర్మాత కన్నుమూత
సాక్షి, చెన్నై: కరోనాతో నిర్మాత సేలం చంద్రశేఖర్ సోమ వారం కన్నుమూశారు. ఈయన సూర్య కథానాయకుడిగా నటించిన గజిని, విజయకాంత్ నటించిన శబరి, భరత్ నటించిన ఫిబ్రవరి 14, కిల్లాడి వంటి చిత్రాలను నిర్మించారు. కొంతకాలంగా చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్న సేలం చంద్రశేఖర్ వయసు 59 ఏళ్లు. సేలంలో నివసిస్తున్న ఈయన కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచా రు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: నా జీవితంలో ఇది అత్యంత క్లిష్ట సమయం: నటుడు -
ఇతను నిజంగానే గజిని
సూర్య హీరోగా నటించిన గజిని సినిమా గుర్తుందా! తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రతి 15 నిమిషాలకు తన గతాన్ని హీరో మర్చిపోతుంటాడు. ఇలా నిజంగానే ఓ గజిని ఉన్నాడు. తైవాన్‌లో ఉండే అతని పేరు చెన్(26). సిన్చూ కౌంటీలో ఉంటున్న చెన్ను స్థానికులందరూ ‘నోట్‌బుక్ బాయ్’ అని పిలుస్తారు. తొమ్మిదేళ్ల క్రితం ఓ ప్రమాదంలో చెన్ తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో అతనికి షార్ట్‌టైం మెమొరి లాస్ సమస్య ఏర్పడింది. 5 నుంచి 10 నిమిషాల ముందు జరిగిన ఘటనలు మాత్రమే చెన్కు గుర్తుంటాయి. అంతకుముందు జరిగిన ఏ విషయమూ చెన్కు గుర్తుండదు. దీంతో రోజూ తాను చేసిన పనుల్ని చెన్ అక్షరబద్ధం చేస్తున్నాడు. స్నేహితులతో కబుర్లు, తోటలో పనిచేయడం, మార్కెట్లో కూరగాయలు అమ్మడం.. ఇలా తాను చేసిన ప్రతీపనిని చెన్ ఓ పుస్తకంలో రాసిపెట్టుకుంటాడు. ఈ విషయమై చెన్ మాట్లాడుతూ..‘ఓసారి నా పుస్తకాల్లో ఒకటి కనిపించకుండా పోయింది. నేను చాలా బాధలో మునిగిపోయాను. కన్పించకుండాపోయిన నా నోట్‌బుక్‌ను తెచ్చివ్వాలని నాన్నను అప్పట్లో బ్రతిమాలాను’ అని అన్నాడు. ప్రస్తుతం 26 ఏళ్ల వయస్సున్న చెన్ తన పెంపుడు తల్లి వాంగ్ మియో సియాంగ్(65)తో కలిసి ఉంటున్నాడు. తండ్రి మరణం తర్వాత ప్రభుత్వం చేసిన కొద్దిపాటి సాయానికి తోడు తమకున్న భూమిలో పండ్లు, కూరగాయలు సాగుచేస్తూ చెన్, అతని తల్లి జీవిస్తున్నారు. ఇంతకాలం తాను తోడుగా ఉన్నప్పటికీ, తానుపోయాక చెన్ను చూసుకునే వారు ఎవరూ లేరని తల్లి ఆందోళన చెందుతోంది. -
జిల్ ప్రిన్స్..గజినీకి రివర్స్
హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రాఫికల్ మెమొరీ (హెచ్ఎస్ఏఎం). ఈ వ్యాధి వచ్చిన వారికి చిన్నతనం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలు గుర్తుండిపోతాయట.! అయితే ఇదో వ్యాధి లక్షణమట. ప్రపంచంలో అత్యంత అరుదుగా కొద్దిమందికే ఈ వ్యాధి వస్తుంది. ఇది వచ్చిన వారు 80 మంది మాత్రమే ఉన్నారని వైద్య నిపుణుల కథనం. ఆ కోవలోకే వస్తుంది ఈ ఫొటోలోని జిల్ ప్రిన్స్. 27 ఏళ్ల జిల్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందింది. ఈ మతిమరుపు గజినీకి రివర్స్ అన్నమాట. వాస్తవంగా హెచ్ఎస్ఏఎం ఉన్నవారికి సుమారుగా 10–12 ఏళ్ల వయసు నుంచి జరిగిన విషయాలు గుర్తుంటాయి. కానీ జిల్కు మాత్రం తాను పుట్టిన 12 రోజుల నుంచి జరుగుతున్న సంగతులూ గుర్తున్నాయని చెబుతోంది. తన మొదటి పుట్టినరోజుకు వేసుకున్న డ్రెస్ నుంచీ అన్నీ చెప్పేస్తోంది. తాను చదివిన అన్ని హ్యారీ పోర్టర్ నవలల్లోని ప్రతీ అక్షరాన్ని చెప్పగలుగుతోందట. ఇది తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఇదెలా సాధ్యమని ముక్కున వేలేసేకుంటున్నారు. -
ఏ ఫర్...?
ఆమిర్ ఖాన్, ఏఆర్ మురుగదాస్, ఏఆర్ రహమాన్, అసిన్.. ఈ నాలుగు పేర్లూ ఇంగ్లిష్‌లో ‘ఏ’ అక్షరంతో మొదలవుతాయ్. అందుకే ఈ కాంబినేషన్లో రూపొందిన హిందీ చిత్రం ‘గజిని’ విడుదలైనప్పుడు ‘నాలుగు ఏల కోసం ఈ సినిమా చూడొచ్చు. అద్భుతం’ అని చాలామంది అన్నారు. ఆమిర్‌ఖాన్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ఇది. ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చాడు కాబట్టే, దర్శకుడు మురుగదాస్ అంటే ఆయనకు అభిమానం. ఈ చిత్రం విడుదలై ఎనిమిదేళ్లయింది. మళ్లీ ఈ హిట్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు? అనుకునేవాళ్లకు మురుగదాస్ ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. ‘‘ఇటీవల ఆమిర్‌ని కలిశాను. ‘మన కాంబినేషన్లో సినిమా వచ్చి, చాలా ఏళ్లయింది. మళ్లీ చేద్దాం’ అన్నాను. ఆయన అంగీకరించారు. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలతో నేను బిజీ. హిందీ చిత్రాలతో ఆయన బిజీ. అందుకని ఇప్పటికిప్పుడు మా కాంబినేషన్లో సినిమాని మొదలుపెట్టలేం. కొంత టైమ్ పడుతుంది. ఎంత టైమ్ అయినా చేయడం మాత్రం ఖాయం’’ అని మురుగదాస్ పేర్కొన్నారు. ఆమిర్ నటించిన తాజా చిత్రం ‘దంగల్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన ‘దంగల్’ లుక్ చూసినప్పుడు ‘గజిని’, ‘ధూమ్ 3’లో కనిపించినంత యంగ్‌గా ఆమిర్ కనిపిస్తున్నారనిపించిందనీ, ఫిజిక్‌ని అద్భుతంగా మెయిన్టైన్ చేస్తున్నారని అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. మళ్లీ ఆమిర్, మురుగదాస్ సినిమా చేస్తే, ఏఆర్ రహమాన్ని సంగీతదర్శకుడిగా అడిగితే కాదనరు. ఆ విధంగా ఈ మూడు ‘ఏ’లు మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. కానీ, ‘గజిని’లో నాయికగా నటించిన అసిన్‌కి పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలేవీ ఒప్పుకోలేదు. సో.. ఈ ప్రాజెక్ట్‌కి ఆ ఒక్క ‘ఏ’ మిస్సవుతుందా? ఒకవేళ ఆలియా భట్ని నాయికగా తీసుకున్నా లేక ‘ఏ’ అక్షరంతో మొదలయ్యే పేరున్న వేరొక తారని తీసుకున్నా అప్పుడు ఈ సినిమాకీ నాలుగో ‘ఏ’ ఉంటుంది. -
మళ్లీ... ‘మెమెంటో ’
‘గజిని’ సినిమాలో సూర్య పాత్ర సంజయ్ రామస్వామి విలన్ల దాడిలో గతాన్ని మర్చిపోతే వారి మీద పగతీర్చుకోవడానికి ఒంటి నిండా పేర్లు మొత్తం రాసుకుంటాడు. మురుగదాస్ దర్శక త్వంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ మూవీ ‘మెమంటో’ ఆధారంగా అల్లుకున్నారు. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో దాదాపు 15 ఏళ్ల క్రింత తెరకెక్కిన ‘మెమంటో’ చిత్రం హాలీవుడ్ ఆల్‌టైమ్ హిట్స్‌లో స్థానం సంపాదించుకుంది కూడా. ఇప్పుడు ఈ సినిమాకు మరో హాలీవుడ్ రీమేక్ వచ్చే సూచనలున్నాయి. హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆంబి పిక్చర్స్ ఈ చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకుంది. -
అసిన్‌కు పెళ్లి కళ
నటి అసిన్‌కు పెళ్లి కళ వచ్చిందా? అవుననే అంటున్నారు. సినీ వర్గాలు. దక్షిణాదిలో ఒక వెలుగు వెలిగి ఉత్తరాదికి ఎగబాకిన నటి అసిన్. గజినీ చిత్రం ఆమెను బాలీవుడ్లో పాపులర్ చేసింది. ఆ తరువాత అక్కడ వరుసగా అవకాశాలు పొందినా ప్రస్తుతం కొరవడ్డాయని చెప్పకతప్పదు. అక్టోబర్ 26కు అసిన్‌కు 30 ఏళ్లు నిండుతాయి. దీంతో అమ్మడు పెళ్లికి సిద్ధమైందట. వ్యాపారవేత్తతో మూడుముళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆ ఘడియలు రానున్నట్లు సమాచారం. అయితో ఈ విషయం గురించి అసిన్ ఏమంటుందో చూడండి. నేను హిందీలో చాలా తక్కువ చిత్రాలే చేశాను. అయితే గ్లామరస్ పాత్రల అవకాశాలు చాలానే వచ్చాయి. అలాంటి పాత్రలు పోషించడం ఇష్టం లేక అంగీకరించలేదు. అలాంటి పరిస్థితిలోనూ నేను కోరుకున్న పాత్రలు వస్తూనే ఉన్నాయి. అసలు అవకాశాలు రాకపోయినా బాధపడను.ఇక పొతే వ్యాపారవేత్తతో వివాహమా?అని అడుగుతున్నారు. నా వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ చర్చిలేదు. ఒక్క విషయం మాత్రం నిజం నాకింకా వివాహం జరగలేదు. పెళ్లి ఎప్పుడన్నది నిర్ణయించలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. -
ఆశిన్‌చినంతగా..!
‘గజిని’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆశిన్. అమీర్‌ఖాన్ సరసన నటించడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘ఇక రాబోయే కాలమంతా అశిన్దే’ అనుకున్నారు సినీ పండితులు. టాప్-1 హీరోయిన్ల లిస్ట్‌లో ఆమె పేరు చేరడం ఖాయం అని కూడా అన్నారు. బరువు తగ్గడం నుంచి స్టైల్ సెన్స్ వరకు బాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్లుగా తనను తాను మలుచుకునే విషయంలో బాగానే కష్టపడింది. అయినప్పటికీ ఆమెకు ‘గజిని’ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఇప్పుడు అశిన్ చేతిలో ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమా మాత్రమే ఉంది. ‘‘యువ హీరోలతో నటించాలని ఉంది’’ అని ఒక ఇంటర్య్వూలో చెప్పింది అశిన్. అయితే ఆమె కోరిక నెరవేరడం లేదు. ‘‘ఇక నా ప్రాధాన్యత బాలీవుడ్ మాత్రమే’’ అని సౌత్ఫిల్మ్స్ను తిరస్కరించిన అశిన్ రేసులో ఎందుకు వెనక బడింది? విశ్వసనీయ సమాచారం ప్రకారం, రకరకాల కండిషన్లు పెట్టే ధోరణి వల్లే దర్శక, నిర్మాతలెవరూ ఆశిన్ గురించి ఆలోచించడం లేదట. దీంతోపాటు వ్యక్తిగత విషయాలు కూడా ఆమె కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. మరోవైపు తమన్నా, కాజల్ అగర్వాల్, ఇలియానాలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం కూడా...అశిన్ కెరీర్‌పై ప్రభావాన్ని చూపింది. వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఆల్ఈజ్ వెల్’ హిట్ కాకపోతే...ఇక ముంబాయికి టాటా చెప్పి తట్టా బుట్టా సర్దుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి! -
అసిన్ రిటర్న్స్
దక్షిణాదిలో ముఖ్యంగా తమిళతం, తెలుగు భాషల్లో నటిగా తన సత్తా చాటుకున్న హీరోయిన్లలో నటి అసిన్ ఒకరు. గజిని చిత్రంలో ఈ భామ నటనా ప్రతిభను ఆమె అభిమానులు మరచిపోలేదు. ఆమెను బాలీవుడ్కుతీసుకెళ్లింది కూడా ఆ చిత్రమే. హిందీ గజిని చిత్రం అసిన్‌ను ఉత్తరాది అభిమానులకు దగ్గర చేసినా, దక్షిణాది అభిమానులకు ఆమెను దూరం చేసింది. అసిన్ దక్షిణాది చిత్రాలో నటించి మూడేళ్లకు పైనే అయ్యింది. అయితే బాలీవుడ్లో గజిని మినహా చెప్పుకోదగ్గ విజయాలేమీ వరించలేదన్నది నిజం. ప్రస్తుతం అవకాశాలు కూడా అంత ఆశాజనకంగా లేవు. అసిన్ హిందీలో ఆల్ ఈజ్ వెల్ అనే ఒకే ఒక్క చిత్రం చేస్తున్నారు. కొత్త అవకాశాలు కూడా దరిదాపుల్లో లేవని సమాచారం. దీంతో అసిన్ మళ్లీ దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన మైక్రోబ్లాగ్‌లో పేర్కొన్నారు. మళ్లీ తమిళ చిత్రాల్లో నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు ఈ ముద్దుగుమ్మ పేర్కొనడం విశేషం. అయితే కొలీవుడ్లో ఇప్పుడు అనుష్క, నయనతార, హన్సిక, సమంతల హవా కొనసాగుతోంది. లక్ష్మీమీనన్, ప్రియాఆనంద్ వంటి వర్ధమాన హీరోయిన్లు కూడా విజయాలతో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అసిన్ మళ్లీ కోలీవుడ్‌లో పాగా వేసేనా? ఒక వేళ అలా జరిగితే ఆమె కంటే ఆనందించేది ఆమె అభిమానులే. అసిన్ చివరిగా మూడేళ్ల క్రితం విజయ్ సరసన కావలన్ చిత్రంలో నటించారు. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చినా ఆమె అంగీకరించలేదు. మరి ఇప్పుడామెను తమిళ చిత్ర పరిశ్రమ అంగీకరిస్తుందా? వేచి చూడాల్సిందే. -
అభినవ గజనీ..!
ఇతడ్ని చూస్తుంటే ‘గజనీ’ గుర్తుకొస్తున్నాడు కదూ? కెనడాలోని మోంట్రియల్కు చెందిన ఈ అభినవ గజనీ పేరు విన్ లాస్. వయసు 24 ఏళ్లు. అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా.. ఇతడికి షార్ట్ టెర్మ్ మెమోరీ లాస్ లేదండోయ్. మరి ఒళ్లంతా ఆ టాటూలు ఎందుకు వేయించుకున్నాడనేగా మీ డౌట్? సినిమాలో గజనీ ఏ విషయాన్నీ మరిచిపోకుండా గుర్తుంచుకోవడం పచ్చబొట్లు పొడిపించుకుంటే.. విన్ లాస్ మాత్రం జనమంతా తనను గుర్తించాలని ఇలా టాటూలమీద టాటూలు వేయించేసుకుంటున్నాడు. పైగా రకరకాల సైజుల్లో రకరకాల పదాలు.. ఒకదానికొకటి సంబంధం ఉండదు.. అసలు ఆ పదం ఎందుకు వేయించుకున్నాడో అర్థంకాదు. ఒక్క ముఖంపైనే ఏకంగా 24 పదాలున్నాయి. అర్థంపర్థం లేకుండా ఏమిటా పదాలు అని అడిగితే.. ‘‘అద్భుతమైన పెయింటింగ్స్ అని అంటాడు. అందులో మనకు ఏమైనా అర్థమవుతుందా? ఇది కూడా అంతే’’ అని తెలివిగా సమాధానం చెబుతాడు. 16వ ఏట తొలి టాటూ పొడిపించుకున్న విన్ అసలు లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడమేనట. మరి ఫేమస్ కావాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలి కదా? అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెబుతున్నాడు. వాటేన్ ఐడియా..! -
మహేష్‌తో మురుగదాస్ సినిమా..?
-
వారిద్దరిలో ఎవరు ఓకే అన్నా తెలుగులో సినిమా చేస్తా!
గజని, స్టాలిన్, తుపాకి... ఈ సినిమాలు చాలు దర్శకునిగా మురుగదాస్ ప్రతిభ ఏంటో చెప్పడానికి. నిర్మాతగా కూడా విజయబాటలో నడుస్తున్నారాయన. తమిళంలో మురుగదాస్ నిర్మించిన ‘రాజా-రాణి’ తెలుగులో అదే పేరుతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటిస్తూ అనేక విషయాలు చెప్పారాయన. ‘రాజా-రాణి’ ఏ తరహా చిత్రం? ‘ప్రేమ విఫలమైనా కృంగిపోనవసరం లేదు. జీవితం చాలా పెద్దది’ అనే పాయింట్ నాకు నచ్చి ఈ సినిమా నిర్మించాను. ఇందులోని హార్ట్ టచింగ్ సీన్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమాలోనూ చూసుండరు.కథ అంతగా నచ్చినప్పుడు రీమేక్ చేయొచ్చుకదా! డబ్బింగ్ చేయడానికి కారణం? ఈ కథను రీమేక్ చేస్తే ఫీల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే డబ్బింగ్ చేస్తున్నాం. నయనతార, ఆర్యలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది కదా. ఇక బాధేముంది? దర్శకునిగా భారీ సినిమాలు, నిర్మాతగా మాత్రం చిన్న సినిమాలు. కారణమేంటి? స్టార్లతో సినిమాలు చేయడం రిస్క్ అని చాలామంది అభిప్రాయం. నన్నడిగితే మాత్రం అదే శ్రేయస్కరం అంటాను. ఎందుకంటే... స్టార్లకు మార్కెట్ ఉంటుంది. కాస్త బాగా తీస్తే మన డబ్బుల్ని మనం రాబట్టుకోవచ్చు. కానీ చిన్న సినిమాలు అలాకాదు. అందులో నటించేవారందరూ దాదాపు కొత్తవాళ్లే అయ్యుంటారు. వాళ్లపై మూడు నాలుగు కోట్లు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడమంటే, మరీ రిస్క్. వాళ్లు ఎలా తీస్తారో తెలీదు. ఏ రకంగా చూసినా చిన్న చిత్రాలు ప్రమాదకరమే. అందుకే ఇకనుంచి తెలుగు, తమిళ భాషల్లో భారీ సినిమాలనే చేయాలనుకుంటున్నాను. అసలు నిర్మాణంలోకి రావాలని మీకెందుకనిపించింది? డబ్బు సంపాదన కోసం నేను నిర్మాత కాలేదు. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడానికి నిర్మాతనయ్యాను. హిందీ ‘గజనీ’ తర్వాత ఫాక్స్‌స్టార్ స్టూడియోవారు నా దర్శకత్వంలో సినిమా నిర్మించాలనుకున్నారు. నాకున్న కమిట్మెంట్స్ వల్ల అది సాధ్యపడలేదు. అయితే... కొత్తవారిని ప్రోత్సహిస్తూ చిత్ర నిర్మాణం చేపడితే బావుంటుందనే నా ఆలోచనను వారి ముందుంచాను. వారికి నచ్చింది. దాంతో నేను, వారు కలిసి నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ‘స్టాలిన్’ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. ఎప్పుడు చేస్తారు? త్వరలోనే. ఆ సినిమా ద్వారా తెలుగు స్టార్‌ని తమిళ చిత్రరంగానికి కూడా పరిచయం చేయాలనే ఆలోచన ఉంది. సదరు హీరో మార్కెట్, నా మార్కెట్లకు తగ్గట్టుగా ఆ సినిమా బడ్జెట్ ఉంటుంది. నాలుగువేల థియేటర్లలో ఆ సినిమాను విడుదల చేస్తే బావుంటుందనుకుంటున్నా. వచ్చే ఏడాది ఈ సినిమా ఉంటుంది. మీ దృష్టిలో ఉన్న ఆ తెలుగు హీరో ఎవరు? మహేశ్‌బాబు. ‘గజని’ సినిమాను ఆయన హీరోగా తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాను. కానీ కుదర్లేదు. ఆయనతో పాటు రామ్‌చరణ్‌కి కూడా ఈ కథ చెబుతాను. ఎవరు ఓకే అంటే వారే హీరో. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సామాజిక అంశాలు కూడా ఉంటాయి. దర్శకునిగా మీ బాలీవుడ్ ప్రస్థానం ఎలా ఉంది? చాలా బాగుంది. నిజానికి ‘తుపాకి’ కథను ముందు బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ హీరోగా చేద్దాం అనుకున్నాను. ఆయన డేట్స్ లేక అప్పుడు కుదర్లేదు. కానీ... ఇప్పుడు అక్షయ్‌తోనే ‘తుపాకి’ రీమేక్ చేస్తున్నాను. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తాం. ప్రేమ సన్నివేశాలను చాలా రొమాంటిక్‌గా, కొత్తగా తీస్తారు. స్వీయానుభవమా? (నవ్వుతూ...) అలాంటిదేం లేదు. నిజానికి నిజజీవితంలో నాకు అలాంటి అనుభవాల్లేవు. అలాంటి అనుభవాలుంటే... తీసే ప్రతి సినిమాలోనూ ఒకేలాంటి సన్నివేశాలుంటాయి. లేవు కాబట్టే కొత్తగా ఉంటున్నాయి. దేశం మొత్తం అభిమానించే దర్శకునిగా ఎదిగారు. ఈ అనుభూతి ఎలా ఉంది? కెమెరాను నేనేమీ కనిపెట్టలేదు కదా. గర్వంగా ఫీలవ్వడానికి. నేనిక్కడ సాధించింది ఏమీ లేదు. సినిమా అంటే ఇష్టం. ఆ ఇష్టమే నాకు మంచి పేరు తెచ్చింది. ‘రమణ’ తీస్తున్నప్పుడు తమిళంలో మంచి పేరొస్తే చాలనుకున్నాను. ‘గజని’ దేశం గుర్తించేలా చేసింది. ఇదంతా దైవనిర్ణయం. డ్రీమ్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? హిచ్‌కాక్, స్పీల్బర్గ్ తరహాలో థ్రిల్లర్స్, ఫాంటసీ సినిమాలు చేయాలని ఉంది. -
100 కోట్లు...200 కోట్లు...ఇదీ లేటెస్ట్ ట్రెండ్!
ఒకప్పుడు సినిమా విజయాలకు హండ్రడ్ డేస్, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీలు కొలబద్దలు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్ని రోజులాడిందన్నది కాదు ముఖ్యం... వసూళ్లే ఇక్కడ ప్రధానం. అందుకే ఈ రోజుల్లో శత దినోత్సవాల ప్రస్తావనే కానరావడం లేదు. అసలు అలాంటి ఫంక్షన్లే జరగడం లేదు. ఆ మధ్య వరకూ అభిమానులు తమ హీరో సినిమా ఇన్ని కేంద్రాల్లో వంద రోజులాడిందని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడంతా వసూళ్ల లెక్కలే. ఈ షేర్లని బట్టే బాక్సాఫీస్ దగ్గర ఎవరు షేర్‌గా నిలుస్తున్నారో తేల్చుకుంటున్నారు. వంద కోట్ల క్లబ్, రెండు వందల కోట్ల క్లబ్ అనేది లేటెస్ట్ ట్రెండ్. బాలీవుడ్లో అయితే గత ఆరేళ్ల నుంచీ విడుదలైన ప్రతి పెద్ద సినిమా వారంలోపే వంద కోట్లు సాధించాలనే పోటీ మొదలైంది. ఈ ఆరేళ్లల్లో మొత్తం 26 చిత్రాలు (షేర్ ఆధారంగా) 100 కోట్ల క్లబ్లో చేరాయి. అందులో 4 సినిమాలు 200 కోట్ల క్లబ్లో చేరడం కూడా విశేషం. అసలు ఈ క్లబ్‌ల కథేంటో చూద్దాం... బోణీ ఆమిర్దే! బాలీవుడ్లో తొలి వంద కోట్ల సినిమా ‘గజిని’. ఇది తమిళ ‘గజిని’కి రీమేక్. ఆమిర్‌ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. 2008లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు 115 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఏడాది వరకు వేరే ఏ సినిమా ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టలేదు. మళ్లీ ఆమీరే తన రికార్డ్ తాను బద్దలు కొట్టుకున్నాడు. 2009లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,215 థియేటర్లలో విడుదలై, ‘గజిని’ రికార్డ్‌ని అధిగమించింది. ఈ చిత్రం 202 కోట్లకు పైగా వసూలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ విధంగా తొలి వంద కోట్ల క్లబ్ తొలి రెండొందల క్లబ్లో చేరిన హీరో ఆమిరే. కావడం విశేషం. వంద రోజులు కాదు.. వంద కోట్లే విజయానికి కొలమానం ఎప్పుడైతే గజిని, త్రీ ఇడియట్స్ చిత్రాలు 100, 200 కోట్లు వసూలు చేశాయో, ఇక అప్పట్నుంచీ వంద కోట్లు వసూలు చేసిన సినిమాయే గొప్ప అనే భావన బాలీవుడ్లో బలపడిపోయింది. పది, ఇరవై రోజుల్లోనే ఈ కోట్ల క్లబ్లో చేరిపోవాలనే లక్ష్యంతో అగ్రనిర్మాతలు, హీరోలు, దర్శకులు సినిమాలు చేయడం మొదలుపెట్టేశారు. 2008లో ఒకటి, 2009లో ఇంకొకటి ఈ ఫీట్ సాధించగా, 2010లో మాత్రం ఈ సంఖ్య రెండు సినిమాలకు పెరిగింది. 2010లో డబుల్ స్ట్రాంగ్ ఆమిర్‌ఖాన్ తర్వాత కోట్ల క్లబ్లో చేరిన హీరో సల్మాన్‌ఖాన్. ఈ కండలవీరుడు నటించిన ‘దబాంగ్’ దాదాపు 140 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 1800 థియేటర్లలో విడుదలైంది. మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగన్, అర్షద్ వర్సి, కరీనా కపూర్ల కాంబినేషన్లో రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘గోల్మాల్-3’ 107 కోట్లు వసూలు చేసింది. 2011లో పాంచ్ పటాకా రెడీ, బాడీగార్డ్, రా.వన్, డాన్ 2, సింగమ్ చిత్రాలు 2011లో వసూళ్ల పరంగా వీరవిహారం చేశాయి. ‘రెడీ’ చిత్రం 120 కోట్లు వసూలు చేయగా, ‘బాడీగార్డ్’ 142 కోట్లతో సల్మాన్ స్టామినా ఏంటో చాటి చెప్పింది. ఈ రెండూ రీమేక్సే కావడం ఇక్కడ విశేషం. తెలుగు ‘రెడీ’కి ‘రెడీ’ రీమేక్ కాగా, మలయాళ ‘బాడీగార్డ్’ని అదే పేరుతో రీమేక్ చేశారు. అలాగే తమిళ ‘సింగమ్’కి రీమేక్ అయిన ‘సింగమ్’ సరిగ్గా వంద కోట్ల మేజిక్ ఫిగర్‌ని అందుకోగలిగింది. భారీ అంచనాల నడుమ విడుదలైన షారుక్ ఖాన్ ‘రా.వన్’ 115 కోట్లు వసూలు చేసింది. షారుక్ మరో సినిమా ‘డాన్ 2’ కూడా 106 కోట్ల రూపాయలను దర్జాగా కలెక్ట్ చేసింది. 2012లో నైన్ వండర్స్ 2012లో వంద కోట్ల క్లబ్లో మెంబర్షిప్ పొందిన తొలి సినిమా ‘అగ్నిపథ్’. హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం 123 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘హౌస్‌ఫుల్-2’ 114 కోట్లు వసూలు చేసింది. ఇక, తెలుగు ‘విక్రమార్కుడు’కి రీమేక్ అయిన ‘రౌడీ రాథోడ్’ కూడా బాగానే వసూళ్లు రాబట్టింది. అక్షయ్‌కుమార్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ రీమేక్ 131 కోట్లు దండుకుంది. ఆ తర్వాత విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘బోల్ బచ్చన్’ వసూళ్ల విలువ 102 కోట్లు. ఇక్కడ ‘ఏక్ థా టైగర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం 198 కోట్లు వసూలు చేసింది. ‘త్రీ ఇడియట్స్’ వసూళ్లకు దగ్గరగా వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం. కేవలం మాస్ మసాలా సినిమాలే 100, 200 కోట్ల క్లబ్లో చేరతాయనే అభిప్రాయాన్ని మార్చిన సినిమా ‘బర్ఫీ’. రొటీన్‌కి భిన్నంగా సాగిన ఈ సినిమా 120 కోట్లు వసూలు చేసి, బాలీవుడ్ బాక్సాఫీస్‌కి షాకిచ్చింది. ఆ తర్వాత విడుదలైన ‘జబ్ తక్ హై జాన్’ 120 కోట్లు వసూలు చేయగా, తెలుగు ‘మర్యాద రామన్న’కు రీమేక్ అయిన ‘సన్నాఫ్ సర్దార్’ 104 కోట్లు వసూలు చేసింది. 2012కి ‘దబాంగ్ 2’ మంచి ముగింపునిచ్చింది. సల్మాన్‌ఖాన్ నటించిన ఈ చిత్రం 158 కోట్లు వసూలు చేసింది. 2013లో 8 సినిమాల వీర విహారం ‘రేస్-2’ పేరుకి తగ్గట్టే ఫుల్ రేస్‌లో కొనసాగింది. ఈ చిత్రం సుమారు 102 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత విడుదలైన ‘యే జవానీ హై దివానీ’ కూడా వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం సుమారు 190 కోట్లు వసూలు చేసింది. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో ఖాన్, కపూర్ హీరోలు లేరు. వీళ్ల స్థాయిలో మార్కెట్ లేని దర్శక, నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ ఇందులో మిల్కా సింగ్ పాత్ర చేశారు. కథాంశం, మంచి టేకింగ్, ఫర్హాన్ నటన కారణంగా ఈ చిత్రం 103 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది స్పెషల్ ఏంటంటే... ఖాన్ రికార్డుని ఖానే బద్దలుగొట్టాడు. ఆమిర్ ‘త్రి ఇడియట్స్’ రికార్డ్‌ని షారుక్‌ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో అధిగమించాడు. ఈ చిత్రం సుమారు 226 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత విడుదలైన ‘గ్రాండ్ మస్తీ’ 102 కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘క్రిష్ 3’ టాక్ పెద్దగా లేకున్నా 240 కోట్లు వసూలు చేసింది. ‘రామ్‌లీలా’ 113 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఏడాది చివర్లో విడుదలైన ‘ధూమ్ 3’ దుమ్ము రేపింది. 3 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిందీ సినిమా. ఇప్పటికే 227 కోట్లు వసూలు చేసేసింది. ఇంకెంత చేస్తుందో వేచి చూడాల్సిందే. 2014లో ఈ క్లబ్లో ఇంకా సందడి పెరగడం ఖాయమనే అనిపిస్తోంది. -
చంద్రబాబు గజని: కొడాలి నాని
-
చంద్రబాబు గజని: కొడాలి నాని
హైదరాబాద్: విభజన ప్రక్రియను మొదలుపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కొడాలి నాని విమర్శించారు. ఎల్బీ స్టేడియంతో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు గజని అని ఎద్దేవా చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలన్న బీజేపీతో 1999లో పొత్తుపెట్టుకున్న విషయాన్ని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన వైఎస్సార్‌పై చంద్రబాబు పిచ్చిప్రేలాపనలు మానుకోవాలన్నారు. అనేక సంక్షేమ పార్టీలు పెట్టి ప్రజల గుండెల్లో వైఎస్సార్ గూడు కట్టుకున్నారని చెప్పారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ స్థాపించిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిన అవసరముందని హెచ్చరించారు. చంద్రబాబు తన పిచ్చి కుక్కలను మా నాయకుల మీదకు వదిలితే తగువిధంగా బుద్ధి చెబుతామని కొడాలి నాని అన్నారు. 150మంది ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ సీఎం కావాలని సంతకాలు పెట్టినా పదవికి ఆశపడని నైజం ఆయనదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలతో వైశ్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ద్వారా సీఎం అయ్యారని గుర్తు చేశారు.