అభినవ గజనీ..!
ఇతడ్ని చూస్తుంటే ‘గజనీ’ గుర్తుకొస్తున్నాడు కదూ? కెనడాలోని మోంట్రియల్‌కు చెందిన ఈ అభినవ గజనీ పేరు విన్ లాస్. వయసు 24 ఏళ్లు. అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా.. ఇతడికి షార్ట్ టెర్మ్ మెమోరీ లాస్ లేదండోయ్. మరి ఒళ్లంతా ఆ టాటూలు ఎందుకు వేయించుకున్నాడనేగా మీ డౌట్? సినిమాలో గజనీ ఏ విషయాన్నీ మరిచిపోకుండా గుర్తుంచుకోవడం పచ్చబొట్లు పొడిపించుకుంటే.. విన్ లాస్ మాత్రం జనమంతా తనను గుర్తించాలని ఇలా టాటూలమీద టాటూలు వేయించేసుకుంటున్నాడు. పైగా రకరకాల సైజుల్లో రకరకాల పదాలు.. ఒకదానికొకటి సంబంధం ఉండదు..
అసలు ఆ పదం ఎందుకు వేయించుకున్నాడో అర్థంకాదు. ఒక్క ముఖంపైనే ఏకంగా 24 పదాలున్నాయి. అర్థంపర్థం లేకుండా ఏమిటా పదాలు అని అడిగితే.. ‘‘అద్భుతమైన పెయింటింగ్స్ అని అంటాడు. అందులో మనకు ఏమైనా అర్థమవుతుందా? ఇది కూడా అంతే’’ అని తెలివిగా సమాధానం చెబుతాడు. 16వ ఏట తొలి టాటూ పొడిపించుకున్న విన్ అసలు లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడమేనట. మరి ఫేమస్ కావాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలి కదా? అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెబుతున్నాడు. వాటేన్ ఐడియా..!