Montreal
-
రెచ్చిపోయిన రసెల్, రూథర్‌ఫోర్డ్.. కెనడా టీ20 లీగ్ విజేత మాంట్రియాల్ టైగర్స్
కెనడా టీ20 లీగ్ 2023 ఎడిషన్ (మూడో ఎడిషన్.. 2018, 2019, 2023) విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచింది. సర్రే జాగ్వార్స్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన ఫైనల్లో మాంట్రియాల్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (29 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కడ దాకా నిలిచి మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించి మాంట్రియాల్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఓపెనర్ జతిందర్ సింగ్ (57 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), అయాన్ ఖాన్ (15 బంతుల్లో 26; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంట్రియాల్ బౌలర్లలో అయాన్ అఫ్జల్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. కార్లోస్ బ్రాత్‌వైట్, అబ్బాస్ అఫ్రిది, ఆండ్రీ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. Montreal Tigers - Champions of GT20 Canada Season 3 🙌 The Montreal Tigers unleashed a loud Roar and clinched the Title 🏆#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/paLAtYBa1U — GT20 Canada (@GT20Canada) August 6, 2023 అనంతరం అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ సున్నా పరుగులకే వికెట్ కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. అయితే కెప్టెన్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. స్రిమంత (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), దిల్‌ప్రీత్ సింగ్ (15 బంతుల్లో 14; 2 ఫోర్లు) సాయంతో స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించాడు. 60 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో మాంట్రియాల్ 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. The Moment, the Feels, and the Celebrations ❤️#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals pic.twitter.com/ONOQtgOKSK — GT20 Canada (@GT20Canada) August 7, 2023 ఈ దశలో వచ్చిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.. దీపేంద్ర సింగ్ (16 రిటైర్డ్), ఆండ్రీ రసెల్‌ల సాయంతో మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. జాగ్వార్స్ బౌలర్లలో కెప్టెన్ ఇఫ్తికార్ అహ్మద్ (4-0-8-2) అద్భుతంగా బౌల్ చేయగా.. స్పెన్సర్ జాన్సన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ ఆధ్యాంతం రాణించిన రూథర్‌ఫోర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶 Dean Jones - Most Valuable Player ✅ Finals Man of the Match ✅ Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT — GT20 Canada (@GT20Canada) August 7, 2023 -
జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?
కెనాడా నగరం మాంట్రియల్లో 2022 డిసెంబర్లో జరిగిన 15వ జీవవైవిధ్య సదస్సులో కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను ఆహ్వానించవలసిందే. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే లక్ష్యాలు నెరవేరతాయా అనిపిస్తోంది. భారత్ సహా 190 దేశాల ప్రతినిధులు పాల్గొని చర్చించి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి ఈ ధరిత్రిపై 30 శాతం జీవవైవిధ్యం కాపా డాలన్నది ఒప్పందంలో ప్రధాన అంశం. ఈ విశ్వంలోగల జీవరాశులన్నిటినీ కలిపి జీవావరణం అంటున్నాం. జీవరాశులన్నీ సురక్షితంగా ఉంటేనే జీవవైవిధ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటికే జీవవైవిధ్యం గణనీయంగా ధ్వంసమైపోయింది. ఇందుకు ప్రధానకారణం మానవ కార్యకలాపాలే. 1972లో స్టాక్‌హోమ్‌లో జరిగిన ధరిత్రి పరిరక్షణ సదస్సు తర్వాత ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో ఇంతవరకు 27 కాప్ సదస్సులు జరిగాయి. మొత్తం సదస్సుల్లో క్యోటో ఒప్పందం, గతంలో జరిగిన మాంట్రి యల్ ఒప్పందం, పారిస్ సదస్సు, 2021లో జరిగిన గ్లాస్గో, 2022లో ఈజిప్టు షర్మెల్ షేక్ నగరంలో జరిగిన సదస్సుల్లో జరిగిన ఒప్పందాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. చేసినా అరకొర నిర్ణయాలే తీసుకొని అమలు చేశారు. గ్లాస్గో ఒప్పందంలోనే 2030 నాటికి సాధించవలసిన లక్ష్యా లను నిర్ణయించారు. వీటిలో చాలా తక్కువగానే సాధించారనీ, రానున్న ఐదేళ్ల కాలంలో సైతం సాధించే అవకాశం కనిపించడంలేదనీ, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఆయా ప్రభుత్వాలు సమర్పించిన ఐదేళ్ల ప్రణాళికలను బట్టి గ్లాస్గో సదస్సుకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జీవ వైవిధ్య సదస్సు చేసిన నిర్ణయాలను, లక్ష్యాలను సాధించడం సాధ్యమేనా? ఇప్పటికే 14 లక్షల జీవజాతులు అంతరించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకుల అంచనా మేరకు గడచిన నాలుగు వందల కోట్ల సంవత్సరాల జీవపరిణామ క్రమంలో జీవవైవిధ్యం ఏర్పడింది. దీని పరిరక్షణకు ముందు వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావలసి ఉంది. ఇందులో భాగంగా కృత్రిమ ఎరువులు, పురుగు మందులను నిలిపి వేసి సంప్రదాయ సేద్యాన్ని చేపట్టాలి. ఇది చాలా నెమ్మదిగా, దీర్ఘకాలం అమలు చేయవలసిన ప్రక్రియ. 2030 నాటికి ఈ మార్పును సాధించగలమా? జీవ వైవిధ్య రక్షణ ఒప్పందం అమలు చేయాలంటే ధనిక దేశాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చాలనీ, లేకపోతే ఒప్పందం నుండి వైదొలగుతామనీ కాంగో చివరిలో హెచ్చరించింది. అనేక దేశాలు ఈ బాటను ఎంచుకొనే అవకాశం ఉంది. వ్యవ సాయానికిచ్చే సబ్సిడీలను కొనసాగించాలని భారత్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు డిమాండ్ చేశాయి. అమెరికా తదితర కొన్నిదేశాలు 60 శాతానికి పైగా సబ్సిడీలు ఇస్తున్నాయి. సబ్సిడీల విషయాన్ని తుది ఒప్పందం పత్రంలో చేర్చారా లేదా అన్న సందేహాలు వ్యక్తమ య్యాయి. సబ్సిడీలు లేకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే ఆర్థిక రంగానికి హాని కలిగించే సబ్సిడీలను తగ్గించాలని ఒప్పందంలో చేరుస్తామని ఒప్పందం రూపొందించిన దేశాలు చెప్పాయి. ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలంటే కేవలం ఆసియా – పసిఫిక్ ప్రాంత దేశాలకే 300 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఆ ప్రాంత ఐరాస ఆర్థిక, సామాజిక కమిషన్ (యుఎన్ఈపీ) అంచనా వేసింది. 2025 నాటికి 20 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని సంపన్న దేశాలు అంగీకరించాయి. మరి లక్ష్యాలు సాధిం చడం సాధ్యమవుతుందా? వాతావరణ విపత్తులు.. పర్యావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల మూలంగా అధికమయ్యాయి. 200 ఏళ్లకు పైగా పారిశ్రామికీకరణ, పెట్రో ఉత్పత్తులు, వ్యవసాయానికి వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు, విచ్చలవిడిగా అడవుల నరికివేత పెరిగాయి. మన దేశంలో 75 జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వివిధ అధ్యయనాలతో పాటూ, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు ప్రకటించింది. ఇక అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందనేది వాస్తవం. ఇందుకు తాజా ఉదాహరణలు లక్ష దీవులు, నికోబార్ దీవుల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ ప్రాంతాల్లో వందలు, వేల ఎకరాల భూభాగంలో పచ్చదనం నాశనం అవుతోంది. ఫలితంగా వేలాదిమంది ఆదివాసీ తెగల జన జీవనం మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బ తింటోంది. వందలాది పక్షులు, జంతువుల రకాలు, ఇతర లెక్కలేనన్ని జీవరాసులు అంతరించిపోతాయి. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతాల్లో నెలకొని ఉన్న జీవ వైవిధ్యం మళ్లీ కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో నివసించే జంతువులు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు తదితర అనేక రకాల జీవులలో 1970 నుంచి ఇప్పటి వరకు 69 శాతం నశించాయని లివింగ్ ప్లానెట్ రిపోర్టు (ఎల్పీఆర్)– 2022 నివేదిక తెలిపింది. ప్రపంచ జంతుజాల నిధి సంస్థ పరిధిలో ఎల్పీఆర్ పనిచేస్తోంది. భారత ప్రభుత్వం వాతావరణంపై 2023లో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గతేడాది పారిస్ ఒప్పందంలో భాగంగా జాతీయ నిర్ణయ కార్యాచరణలు (ఎన్డీసీలు) రూపొందించింది. తక్కువ కాలుష్యం వెలు వరించే దీర్ఘకాలిక కార్యాచరణను మన ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2070 నాటికి కాలుష్య రహిత వాతావరణం సాధిస్తామని పారిస్ సదస్సులో ప్రకటించింది. మరి ఈ లక్ష్యాలను సాధించి మన దేశమన్నా మాట నిలుపుకొంటుందేమో చూడాలి. (క్లిక్ చేయండి: లోహియా లోకదర్శన సులోచనాలు!) – టీవీ సుబ్బయ్య, సీనియర్ జర్నలిస్ట్ -
జీవ వైవిధ్యానికి గొడుగు
మాంట్రియల్: ఏళ్ల తరబడి జరిగిన చర్చోపచర్చలు, సంప్రదింపులు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. భూమిపై జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా కీలక ముందడుగు పడింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్లో డిసెంబర్ 7 నుంచి జరుగుతున్న కాప్–15 అంతర్జాతీయ సదస్సులో భారత్‌తో సహా దాదాపు 200 దేశాలు ఈ విషయంలో విభేదాలు వీడి ఒక్కతాటిపైకి వచ్చాయి. కీలకమైన కుమ్నింగ్–మాంట్రియల్ జీవవైవిధ్య ప్రణాళిక (జీబీఎఫ్)కు సోమవారం అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ‘‘కున్మింగ్–మాంట్రియల్’ ఒప్పందం ఆమోదముద్ర పొందినట్టు సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న చైనా పర్యావరణ మంత్రి హువాంగ్ రుంక్యూ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పారిస్ ఒప్పందం తరహాలోనే పర్యావరణ పరిరక్షణ యత్నాల్లో దీన్నో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో భూ భాగాలు, సముద్ర జలాలతో పాటు జంతు జాతులను కాలుష్యం, వాతావరణ మార్పుల బారినుంచి పూర్తిస్థాయిలో రక్షించడం ఈ ఒప్పందం లక్ష్యం. అయితే ఇందుకు సమకూర్చాల్సిన ఆర్థిక ప్యాకేజీపై ఎంతోకాలంగా పడ్డ పీటముడి ఎట్టకేలకు వీడింది. ఆ మొత్తాన్ని ఇతోధికంగా పెంచి 2030 కల్లా ఏటా 200 బిలియన్ డాలర్లకు చేర్చాలని నిర్ణయం జరిగింది. 2020లో అంగీకరించిన మొత్తంతో పోలిస్తే ఇది రెట్టింపు! ఈ కీలక అంగీకారం నేపథ్యంలో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వాటిని 2030కల్లా సాధించాలన్నది లక్ష్యం. దీన్ని పలు పర్యావరణ సంస్థలు స్వాగతించగా ఆర్థిక, పరిరక్షణపరమైన పలు కీలకాంశాలను పట్టించుకోలేదంటూ పర్యావరణవేత్తలు పెదవి విరుస్తున్నారు. దీన్ని ప్రపంచ ప్రజల విజయంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబెర్టినీ అభివర్ణించారు. అయితే, లక్ష్యసాధనకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఈ ఒప్పందంలో కీలక లోపమని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ గ్లోబల్ పాలసీ సీనియర్ డైరెక్టర్ లిన్ లీ అన్నారు. 50 ఏళ్లలో భారీ విధ్వంసం జీవ వైవిధ్యానికి గత 50 ఏళ్లలో కనీవినీ ఎగరని స్థాయిలో ముప్పు వాటిల్లింది. చాలా రకాల జీవ జాతులు 1970 నుంచి ఏకంగా 69 శాతం క్షీణించాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్–లివింగ్ ప్లానెట్ నివేదిక (ఎల్పీఆర్) పేర్కొంది. పర్యావరణానికి జరుగుతున్న ఈ అపార నష్టానికి అడ్డుకట్ట వేసి జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు తాజాగా ఒప్పందమైతే కుదిరింది. కాకపోతే దాని అమలులో దేశాలు ఏ మేరకు చిత్తశుద్ధి కనబరుస్తాయన్నది కీలకం. ఎందుకంటే ఇందుకోసం ఏటా 200 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు ఎట్టకేలకు అంగీకారం కుదిరినా, ఇందులో వర్ధమాన దేశాల అవసరాలు తీర్చేందుకు సంపన్న దేశాలు కేటాయించబోయే వాటా ఎంత వంటి కీలకాంశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఒప్పందం లక్ష్యాలివీ... జీవ వైవిధ్య పరిరక్షణకు 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగిన కాప్–10 సదస్సులో దేశాలన్నీ పలు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. అవి చాలావరకు లక్ష్యాలుగానే మిగిలిపోయాయి. దాంతో మరోసారి అంతర్జాతీయ స్థాయి మేధోమథనం కోసం 2020 అక్టోబర్‌లో చైనాలోని కుమ్నింగ్‌లో తలపెట్టిన కాప్–15 సదస్సు కరోనా వల్ల వాయిదా పడింది. అది తాజాగా రెండు దశల్లో జరిగింది. తొలి భాగం వర్చువల్ పద్ధతిలో ముగియగా మాంట్రియల్లో డిసెంబర్ 7 నుంచి 19 దాకా జరిగిన కీలకమైన రెండో భాగంలో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. వాటిలో ముఖ్యాంశాలు... ► 2030 కల్లా మొత్తం భూభాగం, సాధారణ జలాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో కనీసం 30 శాతాన్ని పూర్తిస్థాయిలో సంరక్షించి, పరిరక్షించే చర్యలు చేపట్టడం. అపార జీవ వైవిధ్యానికి నిలయమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం. ప్రస్తుతం 17 శాతం భూభాగం, కేవలం 10 సముద్ర జలాల్లో మాత్రమే పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ► జీవ వైవిధ్యపరంగా అపార ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో పర్యావరణ నష్టాలను అరికట్టడం ► ఇందుకోసం పేద దేశాలకు చేసే కేటాయింపులను 2025కల్లా ఏటా 20 బిలియన్ డాలర్లకు, 2030 కల్లా 30 బిలియన్ డాలర్లకు పెంచడం. ► ప్రపంచ ఆహార వృథాను సగానికి తగ్గించడం. ► వనరుల విచ్చలవిడి వాడకాన్ని, తద్వారా వ్యర్థాల ఉత్పత్తిని వీలైనంత కట్టడి చేయడం. ► సాగులో పురుగు మందులు, ఇతర అత్యంత ప్రమాదకర రసాయనాల వాడకాన్ని కనీసం సగానికి తగ్గించడం. ► జీవ వైవిధ్యానికి అపారమైన హాని కలిగించే సాగు సబ్సిడీలను 2030 నాటికి ఏటా 500 బిలియన్ డాలర్ల చొప్పున తగ్గించడం. ► జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడే పథకాలు, చర్యలకు ప్రోత్సాహకాలను పెంచడం. ► భారీ, అంతర్జాతీయ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, తమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి కలిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడం. ► ఆ నష్టాలను అవి కనీస స్థాయికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవడం. -
పురుగుమందుల వాడకంపై టార్గెట్లు వద్దు
మాంట్రియల్: ప్రపంచవ్యాప్తంగా పంట సాగులో పురుగుమందుల వాడకాన్ని తగ్గించే క్రమంలో లక్ష్యాలు విధించడం సరికాదని భారత్ పేర్కొంది. పెస్టిసైడ్స్ వాడకంపై విచక్షణను ఆయా దేశాలకే వదిలివేయాలని సూచించింది. వ్యవసాయరంగానికి సబ్సిడీలు ఇవ్వడాన్ని సమర్థించింది. జీవ వైవిధ్యంపై కెనడాలోని మాంట్రియెల్‌లో జరుగుతున్న 15వ కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్(కాప్15) ఉన్నత స్థాయి సదస్సులో శుక్రవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడారు. పురుగుమందుల వాడకం తగ్గింపు విషయంలో ప్రపంచ దేశాలపై సంఖ్యాత్మక లక్ష్యాలను విధించడం తగదన్నారు. ఆ అంశాన్ని ఆయా దేశాలకే వదిలివేయాలని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులకు తగ్గించాలన్న గ్లోబల్ బయో డైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాలో 17% భారత్‌లోనే ఉండగా, కేవలం 2.4% భూభాగం, 4% నీటి వనరులు మాత్రమే ఉన్నాయన్నారు. అయినప్పటికీ, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నామన్నారు. ఎరువులు, పురుగుమందులు సహా వ్యవసాయ రంగంపై భారత ప్రభుత్వం ఏటా 2.2 లక్షల కోట్లను సబ్సిడీగా ఇస్తున్నట్లు ఒక అంచనా. కాప్15 సదస్సుకు 196 దేశాల నుంచి 20 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. -
కరోనా: సిక్కు సోదరుల సంచలన నిర్ణయం
ఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటంలో ముందుండి నడుస్తున్న వైద్య సిబ్బంది వెలకట్టలేని త్యాగాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ అహర్నిషలు రోగుల సేవలో నిమగ్నమవుతున్నారు. తమకు, తమ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎల్లప్పుడు మాస్కు ధరించడం వల్ల ముఖంపై గాయాలు అవుతున్నా లెక్కచేయడం లేదు. తాజాగా ఇద్దరు సిక్కు సోదరులు మహహ్మారిపై పోరులో భాగంగా తమ ఆచారాన్ని పక్కన పెట్టి నిజమైన హీరోలుగా నిలిచారు. మానవత్వాన్ని మించిన మతం లేదని మరోసారి నిరూపించారు. ఆచార వ్యవహారాల దృష్ట్యా సిక్కులు గడ్డం పెంచడం ఎంత ముఖ్యమో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించడానికి అడ్డంగా ఉన్న గడ్డాన్ని తీసేసిన సిక్కు సోదరులు ఇద్దరు.. నిరాటంకంగా విధులు నిర్వర్తిస్తున్నారు. (ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను) కెనడాలో నివసించే సంజీత్ సింగ్ సలూజా మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో ఎమర్జెన్సీ రూం ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు రజీత్ సింగ్ కూడా అదే ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు. అయితే కరోనా పేషెంట్లకు సేవలు అందించే క్రమంలో విధిగా మాస్కులు ధరించాల్సి ఉన్నందున వారు తమ గడ్డాన్ని తీసేసినట్లు సంజీత్ తెలిపారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘దేవుడు సృష్టిని గౌరవిస్తూ.. సహజంగా పెరిగే కేశాలను సంరక్షించుకోవడం.. వాటిని అలాగే పెరగనీయడం ఆచారం. అయితే ప్రస్తుతం కోవిడ్-19 వ్యాపిస్తున్నందున ఎన్-95 మాస్కు ధరించాలి. సేవా లేదా కేశాలా అనే రెండు ఆప్షన్లు మా ముందు ఉన్నపుడు సిక్కు మత విశ్వాస మూల స్తంభమైన సేవనే మేం ఎంచుకున్నాం. కాబట్టి షేవ్ చేశాం. రోగులకు అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు. ఇక కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఇంతటి త్యాగానికి పూనుకుని.. కఠిన నిర్ణయం తీసుకున్న సిక్కు సోదరులకు ధన్యవాదాలు చెబుతున్నామని ఆస్పత్రి యాజమాన్యం ఓ లేఖను విడుదల చేసింది. కాగా మంగళవారం నాటికి కెనడాలో కరోనా మరణాల సంఖ్య 3,915కు చేరింది. -
అభినవ గజనీ..!
ఇతడ్ని చూస్తుంటే ‘గజనీ’ గుర్తుకొస్తున్నాడు కదూ? కెనడాలోని మోంట్రియల్కు చెందిన ఈ అభినవ గజనీ పేరు విన్ లాస్. వయసు 24 ఏళ్లు. అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా.. ఇతడికి షార్ట్ టెర్మ్ మెమోరీ లాస్ లేదండోయ్. మరి ఒళ్లంతా ఆ టాటూలు ఎందుకు వేయించుకున్నాడనేగా మీ డౌట్? సినిమాలో గజనీ ఏ విషయాన్నీ మరిచిపోకుండా గుర్తుంచుకోవడం పచ్చబొట్లు పొడిపించుకుంటే.. విన్ లాస్ మాత్రం జనమంతా తనను గుర్తించాలని ఇలా టాటూలమీద టాటూలు వేయించేసుకుంటున్నాడు. పైగా రకరకాల సైజుల్లో రకరకాల పదాలు.. ఒకదానికొకటి సంబంధం ఉండదు.. అసలు ఆ పదం ఎందుకు వేయించుకున్నాడో అర్థంకాదు. ఒక్క ముఖంపైనే ఏకంగా 24 పదాలున్నాయి. అర్థంపర్థం లేకుండా ఏమిటా పదాలు అని అడిగితే.. ‘‘అద్భుతమైన పెయింటింగ్స్ అని అంటాడు. అందులో మనకు ఏమైనా అర్థమవుతుందా? ఇది కూడా అంతే’’ అని తెలివిగా సమాధానం చెబుతాడు. 16వ ఏట తొలి టాటూ పొడిపించుకున్న విన్ అసలు లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడమేనట. మరి ఫేమస్ కావాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలి కదా? అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెబుతున్నాడు. వాటేన్ ఐడియా..! -
అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా..
ఫోటోలో ఇతడ్ని చూస్తుంటే ‘గజనీ’ గుర్తుకొస్తున్నాడు కదూ? కెనడాలోని మోంట్రియల్కు చెందిన ఈ అభినవ గజనీ పేరు విన్ లాస్. వయసు 24 ఏళ్లు. అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా.. ఇతడికి షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ లేదండోయ్. మరి ఒళ్లంతా ఆ టాటూలు ఎందుకు వేయించుకున్నాడనేగా మీ డౌట్? సినిమాలో గజనీ ఏ విషయాన్నీ మరచిపోకుండా గుర్తుంచుకోవడం కోసం పచ్చబొట్లు పొడిపించుకుంటే.. విన్ లాస్ మాత్రం జనమంతా తనను గుర్తించాలని ఇలా టాటూలమీద టాటూలు వేయించేసుకుంటున్నాడు. పైగా రకరకాల సైజుల్లో రకరకాల పదాలు.. ఒకదాని కొకటి సంబంధం ఉండదు.. అసలు ఆ పదం ఎందుకు వేయిం చుకున్నాడో అర్థం కాదు. ఒక్క ముఖంపైనే ఏకంగా 24 పదాలున్నాయి. అర్థంపర్థం లేకుండా ఏమిటా పదాలు అని అడిగితే.. ‘‘అద్భుతమైన పెయింటింగ్స్‌లో మనకు ఏమైనా అర్థమవుతుందా? ఇది కూడా అంతే’’ అని తెలివిగా సమాధానం చెబుతాడు. 16వ ఏట తొలి టాటూ పొడిపించుకున్న విన్ అసలు లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడమేనట. మరి ఫేమస్ కావాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలి కదా? అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెబుతున్నాడు. వాటేన్ ఐడియా..!